శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన(ఫైల్ ఫొటో)
కొలంబో : శ్రీలంక స్థానిక ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు మహేంద్ర రాజపక్సే స్థాపించిన నూతన పార్టీ అఖండ విజయం సాధించి అధికార పార్టీకి షాక్ ఇచ్చింది. అంతేకాకుండా వచ్చే నెల 4వ తేదీన ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు ప్రతిపక్షం సిద్ధమయ్యింది. ఈ నేపథ్యంలో అధికార కూటమి ఫ్రీడమ్, యునైటెడ్ నేషనల్ పార్టీల భవితవ్యం సందిగ్ధంలో పడింది. ప్రస్తుత పరిస్థితులను చక్కదిద్దేందుకు అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ప్రధాని రణీల్ విక్రమ సింఘే బాధ్యతలను ఒక్కొక్కటిగా తగ్గిస్తున్నారు.
ఇందులో భాగంగానే ప్రధాని ఆధీనంలో ఉండే సెక్యూరిటీ అండ్ ఎక్ఛ్సేంజ్ కమిషన్‌ను ఆర్థిక శాఖ పరిధిలోకి తీసుకువచ్చారు. ఇందుకు సంబంధించిన మార్పులను గురువారం అధికారంగా గెజిట్ రూపంలో విడుదల చేయనున్నారు. అంతేకాకుండా శ్రీలంక సెంట్రల్ బ్యాంకుపై ప్రధానికి ఉన్న అధికారాలను కూడా తొలగించారు.
ఏప్రిల్ 4న అవిశ్వాస తీర్మానం..
2015లో శ్రీలంక సెంట్రల్ బ్యాంకు(ఎస్‌సీబీ) బాండ్లకు సంబంధించి జరిగిన మోసానికి ప్రధాని కారణం అంటూ ప్రతిపక్షం తీవ్రమైన ఆరోపణలు చేసింది. ఆయన ఉద్దేశపూర్వకంగానే మోసానికి పాల్పడ్డారని, అందుకే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతున్నామని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment