శ్రీలంకలో మరో అన్యూహ ఘటన చోటుచేసుకుంది. బుధవారం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో మాజీ ప్రధాని రణిల్ విక్రమ సింఘే.. కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. కాగా, లంక 8వ అధ్యక్షుడిగా విక్రమ సింఘేను ఎంపీలు ఎన్నుకున్నారు. ఈరోజు జరిగిన ఓటింగ్‌లో విక్రమ సింఘేకు ఎక్కువ ఓట్లు పడ్డాయి. దీంతో ఆయన కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
ఈ ఎన్నికల్లో విక్రమ సింఘేకు మద్దతుగా 134 ఓట్లు రాగా.. అలాహా పెరుమాకు 82 ఓట్లు, అనురాకుమారకు 3 ఓట్లు పడ్డాయి. కాగా, మొత్తం పోలైన ఓట్లు 219. ఇదిలా ఉండగా.. రణిల్ విక్రమసింఘే ఇప్పటి వరకు లంక ప్రధానిగా ఆరుసార్లు పనిచేశారు. ఇక, అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం విక్రమసింఘే మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. మన ముందు పెద్ద సవాళ్లు ఉన్నాయని అన్నారు.
Ranil Wickremesinghe elected as the new President of Sri Lanka: Reuters pic.twitter.com/WGjaLPY0zj
— ANI (@ANI) July 20, 2022
Comments
Please login to add a commentAdd a comment