'మమ్మల్ని జంతువుల్లా చూడటం మానండి'
సెయింట్ పాల్: అమెరికాలో నల్లజాతీయులను పోలీసులు కాల్చేసిన ఘటనలో నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మిన్నెసోటాలోని సెయింట్ పాల్లో గత కొన్ని రోజులుగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్న సుమారు 40 మందిని పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. దీంతో గవర్నర్ నివాసానికి సమీపంలో రోడ్డును మూసివేసి ఆందోళనకారులు నిర్వహిస్తున్న ధర్నాను పోలీసులు అడ్డుకున్నారు.
జులై 7న ఫిలాండ్ కాసిల్ అనే నల్లజాతీయుడిని పోలీసు అధికారి సెయింట్ ఆంథోనీ కాల్చిచంపిన విషయం తెలిసిందే. ఫేస్బుక్ లైవ్స్ట్రీమింగ్ ద్వారా ఫిలాండో కాసిల్ గర్ల్ఫ్రెండ్ ఈ ఘటనను రికార్డ్ చేసింది. అప్పటి నుంచి ఆందోళనకారులు.. సెయింట్ పాల్ లో గవర్నర్ నివాసం వద్ద ఆందోళనలు కొనసాగిస్తున్నారు. అరెస్ట్ల సందర్భంగా తమను జంతువుల్లా ట్రీట్ చేయడం మానుకోవాలని నల్లజాతి నిరసనకారుడు జాకబ్ లడ్డా పేర్కొన్నారు. అకారణంగా ఓ వ్యక్తిని చంపేశారని, ఈ ఘటనలో న్యాయం జరగాలని ఆయన డిమాండ్ చేశారు.