మహబూబ్నగర్ లో ఉద్రిక్తత
మహబూబ్నగర్: నూతన జిల్లాల ప్రారంభవేళ పాలమూరు జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నూతన మండల కార్యాలయాన్ని కాలూరుకు తరలించడాన్ని నిరసిస్తూ నందిన్నెలో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. రెండు ఆర్టీసీ బస్సులకు ఆందోళన కారులు నిప్పు పెట్టారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.