రణరంగమైన మద్రాస్ ఐఐటీ | Protesters, police clash outside IIT Madras | Sakshi
Sakshi News home page

రణరంగమైన మద్రాస్ ఐఐటీ

Published Tue, Jun 2 2015 12:23 PM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM

రణరంగమైన మద్రాస్ ఐఐటీ - Sakshi

రణరంగమైన మద్రాస్ ఐఐటీ

మద్రాస్ ఐఐటీ ప్రాంగణం రణరంగంగా మారింది. విద్యార్ధి సంఘం గుర్తింపు రద్దు విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరును గర్హిస్తూ గత మూడు రోజులుగా విద్యార్థులు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం నిరసనకారులు, పోలీసులకు మధ్య ఘర్షణ చెలరేగడంతో పరిస్థితి ఉద్రింక్తంగా మారింది.

ఒక దశలో విద్యార్థులను పోలీసులు చితకబాదినట్లు సమాచారం. మీడియా ప్రతినిధులు క్యాపస్ లోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటుండంతో ఆ అనుమానాలకు మరింత బలం చేకూరింది. ప్రధాని నరేంద్రమోదీని విమర్శించారన్న ఫిర్యాదు ఆధారంగా అంబేడ్కర్-పెరియార్ స్టడీ సర్కిల్(ఏపీఎస్‌సీ) విద్యార్థి సంఘం గుర్తింపును రద్దు  చేయడంతో దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమైన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement