చికిత్స పొందుతున్న బోయ రమేష్
బొమ్మలసత్రం(కర్నూలు జిల్లా): ఇంటి ముందు శునకం విసర్జించిన విషయమై ఇరు కుటుంబాల మధ్య వాగ్వాదం జరిగి.. కత్తులతో దాడులు చేసుకున్నారు. దీంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన శుక్రవారం నంద్యాల మండలం కానాల గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బోయ రమేష్, దూదేకుల చిన్నబాబయ్యకు పక్కపక్కనే ఇళ్లు ఉన్నాయి. మురుగు నీరు వెళ్లే విషయంలో ఇరు కుటుంబాల మధ్య గత కొంత కాలంగా గొడవ జరుగుతోంది. ఈ క్రమంలో శుక్రవారం రమేష్ ఇంటి ముందు ఓ శునకం విసర్జించింది. ఈ విషయంలో చిన్నబాబయ్యకు, రమేష్‌లకు వాగ్వాదం తలెత్తి, ఘర్షణకు దారితీసింది.
ఇరువురు కత్తులతో ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. చిన్నబాబయ్య తన చేతిలో ఉన్న కత్తితో రమేష్, ఆయన తండ్రి వెంకటరమణలను పొడిచాడు. రమేష్ తన వద్ద ఉన్న కత్తితో బాబయ్యపై దాడి చేశాడు. గాయపడ్డవారిని కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రమేష్, వెంకటరమణల పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి రెఫర్ చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
(చదవండి: సినిమాలో చూస్తాడు.. బయట చేస్తాడు)
మాట వినకపోతే చంపేస్తాం.. బాబు పీఏ బెదిరింపులు..
Comments
Please login to add a commentAdd a comment