Minnesota
-
పేద్ద.. గుమ్మడి: బరువు 1161 కిలోలు.. రికార్డులు బద్దలు!
వాషింగ్టన్: గుమ్మడికాయ అంటే గరిష్ఠంగా 10-20 కిలోల వరకు ఉంటుందని చాలా మందికి తెలుసు. కానీ, వెయ్యి కిలోల గుమ్మడిని ఎప్పుడైనా చూశారా? అమెరికాలో కాలిఫోర్నియా రాష్ట్రంలోని హాఫ్ మూన్ బే సిటీలో జరిగిన పోటీల్లో ఏకంగా 2,560 పౌండ్లు(1161 కిలోలు) బరువైన గుమ్మడికాయను ప్రదర్శించి జాతీయ రికార్డును బద్దలుకొట్టారు ట్రావిస్ జింజర్ అనే ఉద్యానవన ఉపాధ్యాయుడు. హాఫ్ మూన్ బే సిటీలో మంగళవారం 49వ ప్రపంచ స్థాయి బరువైన గుమ్మడికాయల పోటీని నిర్వహించారు. ఈ పోటీకి భారీ గుమ్మడికాయను మిన్నెసోటా నుంచి తీసుకొచ్చేందుకు ఏకంగా 35 గంటల పాటు ప్రయాణం చేయాల్సి వచ్చిందని తెలిపారు ట్రావిస్ జింజర్. ఆ రెండు రోజుల ప్రయాణంలో గుమ్మడికాయను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నట్లు చెప్పారు. దానిని ప్లాస్టిక్, తడి బ్లాంకెట్లతో చుట్టి ఉంచామన్నారు. ‘మిన్నెసోటాలో వాతావరణ పరిస్థితులు చాలా కఠినంగా ఉన్నాయి. గుమ్మడి సాగుకు ప్రతికూలమనే చెప్పాలి. రోజుకు 75 గ్యాలన్ల నీటిని అందించాలి. భారీ గుమ్మడికాయను తీసుకొచ్చి పోటీలో గెలుపొందటం చాలా సంతోషంగా ఉంది.’ అని తెలిపారు. 2020లోనూ జింజర్ పోటీలో గెలుపొందారు. గతవారం నమోదైన 2,554 పౌండ్ల బరువు గుమ్మడికాయ రికార్డును తాజాగా ఆయన బద్ధలు కొట్టారు. Travis Gienger, a horticulture teacher from Minnesota, set a new U.S. record Monday for the heaviest pumpkin after raising one weighing 2,560 pounds. https://t.co/T8vuqaCD2N pic.twitter.com/AbUj3cYwol — CBS News (@CBSNews) October 11, 2022 ఇదీ చదవండి: నీ పిచ్చి తగలెయ్య.. అది బెడ్రూం కాదురా అయ్యా!.. నడి రోడ్డు.. -
గుడ్డిగా నమ్మి ప్రాణాలు కోల్పోయింది.. కానీ ఆ విషయం మాత్రం మిస్టరీనే!
కొందరు మోసగాళ్లకి నమ్మకమే పెట్టబడి. ఎవరినైనా గుడ్డిగా నమ్మితే.. కనీసం మోసపోయామనే విషయం కూడా తెలియకుండానే జీవితం ముగిసిపోతుందనడానికి ఈ కథ ఓ ఉదాహరణ. అది 1893 డిసెంబర్ 3.. మినీయపోలిస్ (మిన్నెసొటా, అమెరికా).. కనిచీకటి పడుతున్న వేళ.. 29 ఏళ్ల క్యాథరిన్ జింగ్.. గూస్మాన్ లివెరీ స్టేబుల్‌కి వెళ్లి క్లాస్ బ్లిక్ట్స్ అనే పేరు మీద ఓ గుర్రం, ఓ బగ్గీ (గుర్రబ్బండి)ని అద్దెకు తీసుకుంది. సరిగ్గా రాత్రి ఏడున్నర అయ్యేసరికి ఆ బగ్గీపై వెస్ట్ హోటల్ వైపు వెళ్లి.. అక్కడ క్లాస్ బ్లిక్ట్స్ అనే వ్యక్తిని కలిసింది. తన దగ్గరున్న నకిలీ నోట్లు అతడికి ఇచ్చి.. అతడి దగ్గరున్న ఒరిజినల్ కరెన్సీని తను తీసుకోవాలి. కానీ అలా జరగలేదు. ఆమె రాకకోసం చాలా సేపటి నుంచి ఎదురు చూస్తున్న బ్లిక్ట్స్.. ఆమె రాగానే తుపాకీతో కాల్చాడు. క్షణాల్లో నేలకొరిగిన క్యాథరిన్ తలపై పెద్ద రాయితో కొట్టి, ఆమె దగ్గరున్న అన్నింటినీ లాక్కుని ఉడాయించాడు. గుర్రాన్ని, గుర్రబ్బండినీ గూస్మాన్ లివెరీ స్టేబుల్‌కి అప్పగించేశాడు. ఎలాగో బ్లిక్ట్స్ పేరుమీదే వాటిని క్యాథరిన్ అద్దెకు తీసుకుంది కాబట్టి వాటిని తిరిగి ఇవ్వడానికి అతడు పెద్దగా కష్టపడలేదు. ఎనిమిదిన్నర.. తొమ్మిది మధ్యలో డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్తున్న విలియం ఎర్హార్డ్ అనే వ్యక్తి రోడ్డు మీద జింగ్ మృతదేహాన్ని గుర్తించాడు. కాసేపటికే అజ్ఞాత యువతి యాక్సిడెంట్ అని కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. పోస్ట్‌మార్టమ్ తర్వాత అది హత్య అని ఆమె తలలోని బుల్లెట్ తేల్చింది. ఆ తర్వాత.. ఆమె ఎవరో కాదు క్యాథరిన్ జింగ్ అనే డ్రెస్ మేకర్ అనీ తెలుసుకోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు. క్యాథరిన్ జింగ్... చాలా అందగత్తె. ఆమె సన్నిహితులంతా ఆమెని కిట్టీ అని ముద్దుగా పిలుచుకునేవారు. కొన్నేళ్ల క్రితం న్యూయార్క్ నుంచి మిన్నెసొటాకి వచ్చి, బట్టలు తయారుచేసే సంస్థలో డ్రెస్ మేకర్‌గా చేరింది. మరో డిపార్ట్మెంట్ స్టోర్‌లో క్లర్కుగా పనిచేస్తున్న ఫ్రెడెరిక్తో ప్రేమలో పడింది. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. నిశ్చితార్థం అయిన తర్వాత ఏవో కొన్ని గొడవలతో పెళ్లి క్యాన్సిల్ అయ్యింది. అయితే ఫ్రెడెరిక్ తొడిగిన నిశ్చితార్థపు ఉంగారాన్ని మాత్రం ఆమె ఎప్పుడూ తన మెడలో వేసుకుని తిరిగేది. ఏళ్లు గడిచే కొలదీ ఆమె జీవితంలో కొత్త పరిచయాలు, కొత్త స్నేహితులతో పాటు డబ్బూ జమకూడింది. అయితే జింగ్ మరణం తర్వాత మరింత లోతుగా ఆరాలు తీసిన పోలీసులు.. హత్య జరిగిన మూడురోజుల్లోనే నలుగురిని అరెస్ట్ చేశారు. వారిలో క్యాథరిన్ మాజీ ప్రేమికుడు ఫ్రెడెరిక్తో పాటు ధనిక కుటుంబానికి చెందిన హ్యారీ హేవార్డ్, హ్యారీ సోదరుడు ఆండ్రీ, సెక్యూరిటీ గార్డ్ బ్లిక్ట్స్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ విచారణలో ఫ్రెడెరిక్ అమాయకుడని నిర్ధారించి విడిచిపెట్టేశారు. ‘క్యాథరిన్ నా దగ్గర కొంత డబ్బు అప్పుగా తీసుకుంది. ఆ డబ్బు కోసమే ఆమెని చంపి, డబ్బు ఎత్తుకెళ్లి ఉంటారు’ చెప్పాడు హ్యారీ. తను క్యాథరిన్‌కు డబ్బు ఇచ్చేప్పుడు సాక్షిగా ఉన్న పనిమనిషినీ స్టేషన్‌కు పిలిపించాడు. దాంతో పోలీసులు హ్యారీది కూడా తప్పు లేదని నమ్మారు. ఆండ్రీ, బ్లిక్ట్స్ కూడా తమకు ఈ కేసుతో ఏ సంబంధం లేదనడంతో పోలీసుల దృష్టి హ్యారీ గర్ల్‌ఫ్రెండ్ లిలియన్ అలెన్ మీద పడింది. గతంలో హ్యారీతో క్యాథరిన్ క్లోజ్‌గా ఉండటం తట్టుకోలేకపోయిన అలెన్ .. రెండుమూడు సార్లు క్యాథరిన్తో గొడవపడిందట. కానీ విచారణలో ఆమె కూడా నిర్దోషిగానే తేలింది. అయితే పోలీసుల దెబ్బలు రుచి చూసిన ఆండ్రీ నోరు విప్పాడు. ‘హ్యారీ కొన్ని రోజుల క్రితం నా దగ్గరకు వచ్చి.. క్యాథరిన్‌ను చంపేందుకు సాయం చేయాలని కోరాడు. కానీ నేను భయపడి నో చెప్పాను. మా ఫ్యామిలీ లాయర్ లెవీ స్టూవర్ట్కి అప్పుడే ఈ విషయాన్ని షేర్ చేసుకున్నాను. కావాలంటే స్టూవర్ట్ని ప్రశ్నించండి’ అంటూ కేసుని హ్యారీ వైపు తిప్పాడు ఆండ్రీ. స్టూవర్ట్.. ఆండ్రీకి అనుకూలంగా నిలబడటంతో హ్యారీ చుట్టూ ఉచ్చు బిగిసింది. ఒజార్క్ ఫ్లాట్స్‌లోని క్యాథరిన్ అద్దెకుండే అపార్ట్మెంట్ ఓనర్ హ్యారీ తండ్రిదని.. హ్యారీకి, క్యాథరిన్కి చాలా సన్నిహిత సంబంధం ఉందని ప్రాథమిక విచారణలో బయటపడింది. హ్యారీ మంచి జూదగాడు. ఇన్సూరెన్స్ మోసాలు, డబ్బు కోసం భారీ చోరీలు, నకిలీ కరెన్సీ తయారీ వంటి పనుల్లో ఆరితేరిన మనిషి. చాలా అపరిష్కృత హత్య కేసుల్లో అతడి పేరుంది. అతడి గురించి తెలిసినవాళ్లంతా అతన్ని శాపనార్థాలు పెట్టేవారు. ఫ్రెడెరిక్తో విడిపోయిన బాధలో ఉన్న క్యాథరిన్కి.. హ్యారీ స్నేహం ఊరటనిచ్చింది. క్యాథరిన్‌కు డబ్బు ఆశ చూపిస్తూ తను చేసే ప్రతి దుశ్చర్యలో ఆమెను భాగంచేసేవాడు.. కొంత సొమ్ము ముట్టజెప్పేవాడు. ఆ క్రమంలోనే వారి మధ్య బంధం బలపడింది. హ్యారీ ప్రోత్సాహంతో క్యాథరిన్.. లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ కూడా తీసుకుంది. దానికి నామినీగా అతడి పేరు రాయించుకున్నాడు. క్యాథరిన్ చనిపోతే ఆ పాలసీ డబ్బులు తనకే వస్తాయని ఇదంతా చేశాడు హ్యారీ. మొత్తం కథలో బ్లిక్ట్స్ ఇచ్చిన సాక్ష్యం కీలకంగా మారింది. క్యాథరిన్ నన్ను కలవడానికి ప్లాన్ చేసిందే హ్యారీ. నకలీ డబ్బుల మార్పిడి కోసం క్యాథరిన్ నా దగ్గరకు వచ్చిందని చెప్పాడు. అంతే కాదు హ్యారీ ఈ హత్య ప్లాన్ గురించి చెప్పడానికి నా దగ్గరకు వచ్చినప్పుడు, అతడు నా కళ్లలోకి కళ్లు పెట్టి తదేకంగా చూశాడు. ఆ తర్వాత అతడు ఏం చెప్పినా నేను నో అనలేకపోయాను. ఆ చూపులో ఏదో మాయ ఉంది. అందుకే క్యాథరిన్‌ని హత్య చేశాను’ అంటూ హ్యారీ తనపై హిప్నాటిజం చేశాడని చెప్పుకొచ్చాడు బ్లిక్ట్స్. అయితే అప్పటికే స్థానికులు హ్యారీ హిప్నాటిజం గురించి కథలు కథలుగా చెప్పుకుంటూ ఉండేవారు. అతడికి ఏదో శక్తి ఉందని, అతడి కళ్లల్లో ఏదో మాయ ఉందని.. వశీకరణ చేసి చాలా మందిని మట్టుబెట్టాడని ఇలా హ్యారీపై చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. బ్లిక్ట్స్ ప్రత్యక్షసాక్షి కావడంతో వశీకరణ అనే అంశాన్ని పక్కన పెట్టి.. న్యాయపరంగానే విచారణ సాగించారు. కొన్ని వాయిదాల తర్వాత హ్యారీకి ఉరిశిక్ష, బ్లిక్ట్స్కి జీవితఖైదు పడింది. ఆండ్రీ నిర్దోషిగా బటయపడ్డాడు. 1895 డిసెంబర్ 11న తెల్లవారు జామున 2.12కి హ్యారీని ఉరి తీశారు. అయితే హ్యారీ 2.25 ని.ల వరకూ బతికేవున్నాడనీ రికార్డుల్లో నామోదు చేసుకున్నారు అధికారులు. దాంతో నిజంగానే హ్యారీ చాలా శక్తిమంతుడని.. అతడికి క్షుద్రపూజలు కూడా తెలుసని.. చాలా మంది నమ్మడం మొదలుపెట్టారు. అతడు తిరిగి లేచి, బతికొస్తాడనీ కొందరు భావించేవారు. హ్యారీకి ఉరి తీసే కొన్ని రోజుల ముందు ఒక విలేకరికి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. తను చేసిన కొన్ని హత్యల గురించి నోరు విప్పాడు హ్యారీ. అప్పుడు కూడా వశీకరణ గురించి చెప్పలేదు. దాంతో బ్లిక్ట్స్ని నిజంగానే వశీకరణ చేసి క్యాథరిన్‌ని చంపించాడా? లేక బ్లిక్ట్స్ కావాలనే అబద్ధం చెప్పాడా? అనేది తేలలేదు. కేసు ముగిసినా నేరస్తుడికి శిక్షపడినా.. ఈ కథలోని వశీకరణ కోణం నేటికీ మిస్టరీనే. -సంహిత నిమ్మన చదవండి: Mystery Room No 1046 Story: నిన్ను చంపాలనుకుంది ఎవరు.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన రోలాండ్! -
కన్నతల్లితోనే ఛాలెంజ్! ఆరేళ్ల తర్వాత..
చెప్పింది వినకుండా పిల్లలు మారాం చేసినప్పుడు.. ఫలానా కొనిస్తాం లేదంటే ఫలానా దగ్గరికి తీసుకెళ్తాం అంటూ బుజ్జగిస్తుంటారు పేరెంట్స్. ఈరోజుల్లో పిల్లల పాలిట సెల్‌ఫోన్ ఒక వ్యసనంగా మారింది. ఆ అలవాటు మాన్పించే ప్రయత్నాలు ఎన్ని ఉన్నా.. పూర్తి స్థాయిలో వర్కవుట్ కావడం లేదు. ఈ తరుణంలో ఓ తల్లి చేసిన పని.. ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. ఆరేళ్ల కిందట.. మిన్నెసోటా(అమెరికా)కు చెందిన 12 ఏళ్ల పిలగాడు సివెర్ట్ క్లెఫ్‌సాస్ ఇంట్లో ఉన్న మొబైల్‌కు అతుక్కుపోవడం మొదలుపెట్టాడు. కొడుకును ఎలాగైనా ఆ వ్యసనానికి దూరం చేయాలని తల్లి లోర్నా గోల్డ్స్ట్రాండ్ భావించింది. ఇందుకోసం కొడుకుతో ఓ ఛాలెంజ్ చేసింది. బహుశా ఏ తల్లికి ఇలాంటి ఐడియా వచ్చి ఉండదేమో.! ఆరేళ్ల పాటు సోషల్ మీడియాకు గనుక దూరంగా ఉంటే.. సివెర్ట్ 18వ పుట్టినరోజున 1,800 డాలర్లు (మన కరెన్సీలో లక్ష 36 వేల రూపాయలు) ఇస్తానని ఛాలెంజ్ విసిరింది. అంత చిన్న వయసులో అంత పెద్ద ఫిగర్ వినేసరికి సివెర్ట్ టెంప్ట్ అయ్యాడు. తల్లి ఛాలెంజ్‌కు సై చెప్పాడు. ఆరేళ్లు గిర్రున తిరిగింది.. తల్లితో చేసిన ఛాలెంజ్‌కు కట్టుబడి ఈ ఆరేళ్లు సోషల్ మీడియా జోలికి పోలేదు ఆ కుర్రాడు. మీరు నమ్మినా.. నమ్మకపోయినా.. అదే నిజం అంటున్నాడు. రీసెంట్గా బర్త్‌డే 18వ పుట్టినరోజు చేసుకున్న ఆ కుర్రాడికి.. ఛాలెంజ్ ప్రకారం 1,800 డాలర్లను కొడుక్కి అందించింది లోర్నా. అంతేకాదు కొడుకు ఫొటోను తన ఫేస్బుక్లో షేర్ చేసి.. జరిగిందంతా చెప్పింది. తన పెద్ద కూతురిలా కొడుకు కూడా సోషల్ మీడియాకు బానిస కావడం, మానసికంగా కుంగిపోవడం ఇష్టం లేకనే ఇలా ఛాలెంజ్ విసిరానని చెప్తోందామె. ఈ ఆరేళ్ల కాలంలో తన తోటి వాళ్లెందరో స్మార్ట్ఫోన్లు, సోషల్ మీడియాకు అడిక్ట్ అయ్యారు. కానీ, తన కొడుకు మాత్రం వాటికి దూరంగా ఉన్నాడని మెచ్చుకుంది ఆ తల్లి. ఇంతకీ ఈ తల్లికి ఈ ఐడియా ఎలా తట్టిందో తెలుసా? ఓరోజు రేడియోలో 18 ఫర్ 18 ఛాలెంజ్ అనే కాన్సెప్ట్ గురించి వినిందట. ఆ స్ఫూర్తితో కొడుక్కి ఈ ఛాలెంజ్ విసిరిందామె. ఇక ఎలాగూ కొడుకు తన ఛాలెంజ్ పూర్తి చేయడంతో.. ఇప్పుడతనికి స్వేచ్ఛ దొరికినట్లయ్యింది. -
వరుడికి చేదు అనుభవం.. వాంతి చేసుకుని కళ్లు తిరిగిపడిపోయిన వధువు
వాషింగ్టన్: పెళ్లి ప్రతి ఒక్కరి జీవితంలో అందమైన మధుర జ్ఞాపకం. వివాహ వేడుకను జీవితాంతం మరచిపోలేని అందమైన జ్ఞాపకంగా మలుచుకోవాలని కలలు కంటారు. అందుకోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తారు. ఇక పెళ్లి అంటే బోలేడు పనులు. ఇంట్లో సాయం చేసేవారు ఎవరు లేకపోతే.. పాపం కాబోయే వధువరులే ఆ పనులన్ని చూసుకోవాలి. ఇలా పనుల ఒత్తిడిలో పడి అలసిపోతే.. ఎలాంటి చేదు అనుభవాలు ఎదురవుతాయో ఈ వార్త చదివితే తెలుస్తుంది. ఈ జంటకు ఎదురైన కష్టాలు చూస్తే.. పాపం వీరంత దురదృష్టవంతులు ఈ భూమ్మీద ఇంక ఎవరు లేరనిపిస్తుది. ఆ వివరాలు.. అమెరికా, మిన్నెసోటాకు చెందిన హోలీ లిన్నియా-కోలెండా డార్నెల్లు వివాహం చేసుకుందామని భావించారు. డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నారు. ఇక పెళ్లి పనులన్ని వారిద్దరే చక్కబెట్టుకున్నారు. పెళ్లికి ఒకరోజు ముందు వరకు కూడా వారు పనులతో బిజీగానే ఉన్నారు. పెళ్లి నాడు ఉదయం హోలీకి చాలా అలసటగా అనిపించడంతో పాటు కాస్త అనారోగ్యంగా కూడా అనిపించింది. దీని గురించి కాబోయే భర్తకు చెప్పింది. కానీ అతడు ఆ విషయాన్ని సీరియస్‌గా తీసుకోలేదు. (చదవండి: మహిళా వెడ్డింగ్ ప్లానర్స్ ఆకాశమే హద్దు...) మరికొన్ని గంటల్లో పెళ్లి పెట్టుకుని.. ఇప్పుడు అనారోగ్య కారణంగా దాన్ని వాయిదా వేయడం బాగోదని భావించింది హోలీ. ఎలాగోలా ఓపిక చేసుకుని.. రెడీ.. అయ్యి మంటపానికి వచ్చింది. అప్పటికే ఆమె ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. పెళ్లి తంతు జరుగుతుండగా.. హోలీకి కళ్లు తిరిగాయి. కిందపడిపోతుండగా.. ఆమె కాబోయే భర్త పట్టుకున్నాడు. ముఖం మీద నీళ్లు చల్లితే హోలీ స్పృహలోకి వచ్చింది. దాన్నుంచి తేరుకునేలోపే ఆమెకు వాంతికి అయ్యింది. బయట బాగా వేడిగా ఉండటం వల్లనే హోలీకి ఇలా అయి ఉంటుందని భావించిన ఆమె సోదరి.. ఫ్యాన్ ఆన్ని చేద్దామని పైకి లేచింది. ఈ క్రమంలో చేతిలో ఉన్న పిల్లాడిని హోలీకి అప్పగించి ఆమె ఫ్యాన్ దగ్గరకు వెళ్లింది. వాడికి అప్పుడే గుర్తొచ్చిందేమో.. పెళ్లి కుమార్తె అని కూడా చూడకుండా.. హోలీ మీద మల విసర్జన చేశాడు. జరిగిన అన్ని సంఘటనలతో హోలీకి ఒకలాంటి విరక్తి కలిగింది. (చదవండి: మరికొద్ది నిమిషాల్లో పెళ్లి .. కారు దిగగానే వధువుకు షాక్!) త్వరగా పెళ్లి తంతు ముగుంచుకుని.. ఆస్పత్రికి వెళ్లింది హోలీ. ఆమెను పరీక్షించిన వైద్యులు.. లో బీపీ, రక్తహీనతతో బాధపడుతుందని.. అందుకే కళ్లు తిరిగి పడిపోయిందని తెలిపారు. ఇక విహానికి ముందు బాగా అలసిపోవడం.. ఆ రోజంతా నీళ్లు తాగకుండా ఉండటం వల్ల డీహైడ్రేషన్‌కు గురై వాంతి చేసుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా హోలీ దంపతులు మాట్లాడుతూ.. ‘‘పెళ్లి అంటే అందరికి చాలా మంచి అనుభూతులు ఉంటాయి. మాకు ఎదురైన అనుభవాలు తల్చుకుంటే.. చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. కానీ ఏం చేస్తాం అలా జరిగిపోయింది. ఇప్పుడే ఇవే సంఘటనలను మా ముందు తరాలకు చెప్పాలి. కనీసం వారు అయినా జాగ్రత్త పడతారు’’ అని చెప్పుకొచ్చారు. చదవండి: ఖాకీలు చేసిన కల్యాణం: 'ఒకరిని విడిచి, మరొకరం ఉండలేమని..' -
వైరల్ ట్వీట్.. తప్పులో కాలేసిన ట్రంప్ కుమారుడు
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేయాలంటూ ప్రస్తుత అధ్యకుడు డొనాల్ట్ ట్రంప్ కుమారుడు ఎరిక్ ట్రంప్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఈ ట్వీట్‌పై నెటిజన్లు జోకులు పేల్చుతున్నారు. వివరాల్లోకి వెళితే.. మిన్సెసోటాలోని ప్రజలంతా బయటకు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎరిక్ మంగళవారం ట్వీటర్ ద్వారా పేర్కొన్నారు. అయితే అమెరికాలో ఎన్నికలు జరిగి ఫలితాలు కూడా వెలువడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎరిక్ చేసిన తాజా ట్వీట్ అతన్ని ఇరకాటంలోకి నెట్టివేసింది. ఎన్నికలు అయిపోయిన ఇన్ని రోజులకు ఎరిక్ ఓటు వేయాలని కోరడం ఏంటని కొంతమంది నెటిజన్లు నోరెళ్లపెడుతున్నారు. అయితే అమెరికాలో ఎన్నికల రోజు కూడా ఎరిక్ ప్రజలను ఓటు వేయాలని కోరుతూ ట్వీట్ శారు. ఒకవేళ సాంకేతిక లోపం కారణంగా ఆ ట్వీట్ ఇప్పడు వచ్చి ఉండవచ్చని కొందరు భావిస్తున్నారు. చదవండి: అధికార మార్పిడికి ట్రంప్ మోకాలడ్డు! ఏదేమైనప్పటికీ ట్వీట్ చేసిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఈ పోస్టును డిలీట్ చేశారు. కానీ అప్పటికే నెటిజన్లు దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్లను తీసి తమ అకౌంట్లలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. కాగా ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరులో డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ విజయం సాధించిన విషయం తెలిసిందే. బరాక్ ఒబామా దగ్గర 8 ఏళ్లు ఉపాధ్యక్షుడుగా పనిచేసిన వైట్ హౌస్‌లో బైడెన్ ఇప్పుడు అధ్యక్ష పీఠం అధిష్టించడానికి సిద్ధమయ్యారు. కొత్త అధ్యక్షుడు జనవరి 20న అధికారికంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ఎన్నికల్లో ఘోర పరాజాయాన్ని ఎదుర్కొన్న డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఓటమిని జీర్ణించుకోలేని ట్రంప్ అధికార మార్పిడికి సంబంధించి బైడెన్ బృందానికి సహకరించకుండా ప్రభుత్వ యంత్రాంగాన్ని అడ్డుకోవడం తాజా పరిణామాలు. చదవండి: వైట్‌హౌస్ నుంచి వెళ్దాం: ట్రంప్‌తో భార్య మెలానియా But of course Eric Trump scheduled an Election Day tweet for the wrong week... pic.twitter.com/a4tL0UYRm8 — Rex Chapman🏇🏼 (@RexChapman) November 10, 2020 Proof Eric Trump is Internet Explorer (yes this is real) pic.twitter.com/YiJaPl6aeN — Bizarre Lazar 🏴☠️ (@BizarreLazar) November 11, 2020 You are a 🤡 do you know what day it is? — Antonio Gianola (@antoniogianola) November 10, 2020 Now I am not an expert, but I think @EricTrump just told Minnesota to commit voter fraud. pic.twitter.com/5AOOxew1xn — Kyle (@wylekolfe) November 11, 2020 -
నాటి నుంచే నీగ్రోలపై దారుణాలు
సాక్షి, న్యూఢిల్లీ : ఆఫ్రికా మూలాలు కలిగిన అమెరికన్ నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్‌ను శ్వేత జాతీయుడైన పోలీసు అధికారి అన్యాయంగా చంపేయడంతో దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగుతున్న విషయం తెల్సిందే. అమెరికాలో నల్ల జాతీయులను శ్వేత జాతీయులైన పోలీసు అధికారులు చంపేయడం, హింసించడం ఇప్పుడే కొత్త కాదు. అమెరికా చరిత్రలో కోకొల్లలుగా జరుగుతూ వస్తున్నాయి. అమెరికా పోలీసు చట్టం కూడా అందుకు కొంత దోహద పడుతోంది. (చదవండి: జార్జ్‌ది నరహత్యే !) 1700 శతాబ్దంలో మొదలైన ‘స్లేవ్ పెట్రోల్స్’ కాలం నాటి నుంచి నల్లజాతీయులకు వ్యతిరేకంగా అమెరికా పోలీసుల అరాచకాలు కొనసాగుతున్నాయి. నాడు బానిసత్వంలో మగ్గుతున్న నల్లజాతీయులపైనా శ్వేతజాతీయ పౌరులు, పోలీసు అధికారులు ‘స్లేవ్ పెట్రోల్స్’ పేరిట దారుణాలకు పాల్పడేవారు. బానిసత్వానికి వ్యతిరేకంగా 1739, 1741లో నల్లజాతీయులు చేసిన తిరుగుబాట్లను అమెరికా పోలీసులు దారుణంగా అణచివేశారు. అమెరికాలో అంతర్యుద్ధం (1861–65) ముగిశాక ‘స్లేవ్ పెట్రోల్స్’కు సంబంధించిన చట్టాలను అమెరికా రద్దు చేసింది. అయినప్పటికీ నల్ల జాతీయులకు వ్యతిరేకంగా జరుగుతున్న దాడులకు తెర పడలేదు. ‘1965లో వాట్స్ రైట్స్’ అందుకే జరిగాయి. మార్క్వెట్ ఫ్రై అనే నల్ల జాతీయుడు తన తల్లి, సోదరుడితో కలిసి కారులో వేగంగా వెళుతుండగా, శ్వేత జాతీయుడైన కాలిఫోర్నియా హైవే పెట్రోల్ ఆఫీసర్ ఆపి, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు కింద అరెస్ట్ చేసి హింసించారు. 1991, మార్చి మూడవ తేదీన రోడ్నీ కింగ్ అనే నల్లజాతీయుడు కారులో వేగంగా వెళుతుండగా, శ్వేతజాతి పోలీసు అధికారులు ఆపి, కారులో నుంచి గుంజీ రోడ్నీ కింగ్‌ను చితక్కొట్టారు. ఆ కేసులో అరెస్టయిన నలుగురు పోలీసు అధికారులు 1992, ఏప్రిల్ నెలలో నిర్దోషులుగా విడుదలయ్యారు. అందుకు వ్యతిరేకంగా నిరసనలు, అల్లర్లు కొనసాగాయి. 2014, ఆగస్ట్‌లో 18 ఏళ్ల మైకేల్ బ్రౌన్ అనే నల్లజాతీయ యువకుడిని పోలీసు అధికారి అన్యాయంగా కాల్చి వేయడంతో దానికి వ్యతిరేకంగా ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ ఉద్యమం పుట్టుకొచ్చింది. అయినప్పటికీ సదరు పోలీసు అధికారికి శిక్ష పడలేదు. ఆ తర్వాత ఇప్పుడు జార్జ్ ఫ్లాయిడ్ అన్యాయంగా బలయ్యారు. అమెరికా పోలీసు చట్టం శ్వేత జాతీయులైన పోలీసులను అనుకూలంగా ఉండడమేనని విమర్శకులు చెబుతున్నారు. పోలీసు వ్యవస్థలో కూడా నల్లజాతీయుల పట్ల ఎంతో వివక్షత ఉందని వారంటున్నారు. (చదవండి: జార్జ్ హత్య : సత్య నాదెళ్ల స్పందన) -
జార్జ్ హత్య : సత్య నాదెళ్ల స్పందన
వాషింగ్టన్ : ఆఫ్రికన్-అమెరికన్ పౌరుడు జార్జ్ ఫ్లాయిడ్ హత్యపై టెక్ దిగ్గజాలు, గూగుల్, మైక్రోసాఫ్ట్ తమ విచారాన్ని, సంతాపాన్ని వ్యక్తం చేశాయి. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల జాతి వివక్షను, జాత్యంహకారాన్ని ఖండించారు. నల్లజాతి సమాజానికి తమ సంఘీభావం తెలిపిన సత్య నాదెళ్ల సమాజంలో ద్వేషానికి, జాత్యహంకారానికి చోటు లేదని వ్యాఖ్యానించారు. ఇప్పటికే దీనిపై సానుభూతి, పరస్పర అవగాహన మొదలైనప్పటికీ, ఇంకా చేయాల్సిన అవసరం వుందని ఆయన అన్నారు. (జార్జ్‌ది నరహత్యే !) ఇప్పటికే జార్జ్ ప్లాయిడ్ మృతిపట్ల సెర్చ్ ఇంజీన్ దిగ్గజం గూగుల్ సానుభూతిని ప్రకటించింది. ఈ సంఘటన పట్ల భాధ, కోపం, విచారం, భయంతో ఉన్న వారెవ్వరూ ఏకాకులు కాదు.. జాతి సమానత్వానికి మద్దతుగా నిలబడతామని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ట్వీట్ చేశారు. దీనికి సంబంధించి గూగుల్ , యూట్యూబ్ హోమ్‌పేజీ స్క్రీన్ షాట్ ను ఆయన ట్విటర్లో షేర్ చేసిన సంగతి తెలిసిందే. (దేశీయ ఉగ్రవాద చర్యలు: రంగంలోకి సైన్యం) There is no place for hate and racism in our society. Empathy and shared understanding are a start, but we must do more. I stand with the Black and African American community and we are committed to building on this work in our company and in our communities. https://t.co/WaEuhRqBho — Satya Nadella (@satyanadella) June 1, 2020 Today on US Google & YouTube homepages we share our support for racial equality in solidarity with the Black community and in memory of George Floyd, Breonna Taylor, Ahmaud Arbery & others who don’t have a voice. For those feeling grief, anger, sadness & fear, you are not alone. pic.twitter.com/JbPCG3wfQW — Sundar Pichai (@sundarpichai) May 31, 2020 -
జార్జ్‌ది నరహత్యే!
వాషింగ్టన్ : జార్జ్ ఫ్లాయిడ్ (46) మరణంపై అమెరికా అట్టుడుకుతున్న సమయంలో కీలక మైన అధికారిక పోస్ట్‌మార్టం నివేదిక వెలువడింది. అతని మెడపై బలమైన ఒత్తిడి వలనే చనిపోయాడని, ఇది నరహత్య అని మినియాపోలిస్‌లోని హెన్నెపిన్ కౌంటీ వైద్యులు నిర్ధారించారు. పోలీసులు అదుపులో ఉండగా అతడు గుండెపోటుకు గురైనట్లు నివేదిక తెలిపింది. (నల్లజాతి ప్రతిఘటన) అటు ఫ్లాయిడ్ కుటుంబం ఏర్పాటు చేసిన ప్రైవేట్ పరీక్షల విచారణలోనూ ఇది పోలీసుల హత్యగానే నిర్ధారణ అయింది. ఫ్లాయిడ్ కుటుంబానికి చెందిన న్యాయవాది బెంజమిన్ క్రంప్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పోలీసులు జార్జ్‌ని నిరోధిస్తున్నపుడే..గుండె కొట్టుకోవడం ఆగిపోయిందన్నారు. మెడపై ఒత్తిడి కారణంగా మెదడుకు రక్త ప్రవాహం ఆగిపోవంతో మరణించాడని పరీక్షల్లో తేలినట్టు క్రంప్ చెప్పారు. పోలీసుల అమానుషంతోనే అతను మరణించాడని, అంబులెన్సే జార్జ్‌కు పాడెగా మారిందని వ్యాఖ్యానించారు. (దేశీయ ఉగ్రవాద చర్యలు: రంగంలోకి సైన్యం) కాగా మినెసోటా రాష్ట్రంలోని మినియాపోలిస్‌లో గత సోమవారం జార్జ్ ఫ్లాయిడ్ అనే ఓ నల్ల జాతి వ్యక్తిని అదుపులోకి తీసుకునే క్రమంలో తెల్ల జాతి పోలీస్ అధికారి డెరెక్ షావిన్ అతని మెడపై మోకాలితో బలంగా నొక్కుతుండగా ప్రాణాలు కోల్పోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో నిరాయుధుడైన ఆఫ్రికన్-అమెరికన్ పౌరుడు జార్జ్ ఫ్లాయిడ్ మరణానికి పోలీసులే కారణమంటూ ఎగిసిన నిరసనలతో అమెరికా అతలాకుతలమవుతున్న సంగతి తెలిసిందే. -
కంటతడి పెట్టిస్తోన్న చిన్నారుల లేఖ
రాంచెస్టర్: 'పిల్లలకేం తెలుసు?', 'వాళ్లకేం తెలీదు?' ఇలాంటి మాటలను చాలాసార్లు విన్నాం, వింటున్నాం, ఎప్పుడూ వింటూనే ఉంటాం కూడా! కానీ ఇది చదివాక అది అబద్ధం అనిపిస్తోంది. ప్రస్తుతం కరోనా వల్ల ప్రపంచమే స్థంభించిపోయింది. విరుగుడు లేని వ్యాధి కావడంతో ప్రతి ఒక్కరూ వణికిపోతున్నారు. ఈ మహమ్మారిని ఓడించేందుకు వైద్యులు అలుపెరగకుండా పోరాడుతున్నారు. కానీ పెరుగుతున్న కేసులు, సరిపోని వెంటిలేటర్లు వారికి పెనుసవాళ్లుగా మారుతున్నాయి. ఇంతటి పెద్ద సమస్య రెండు చిన్ని బుర్రలకు అర్థమైంది. 'మేమున్నాం..' అంటూ బోసి నవ్వులతో సాయం చేసేందుకు ముందుకొచ్చారు. వెంటిలేటర్లకు ఎంత డబ్బులవుతాయో చెప్పండి, ఇస్తాం అంటూ ఓ లేఖ పెట్టారు. అల్లరి పనులను పక్కనపెట్టి అర్థవంతమైన సందేశం ఇచ్చారు. మనసును స్పృశించే ఈ ఘటన అమెరికాలోని మించెన్నెసొటాలో చోటు చేసుకుంది. (అది కుక్కపిల్ల కాదు: అక్కడే వదిలేయ్!) మయో క్లినిక్‌లో పనిచేస్తున్న స్టీవెన్స్ మధ్యాహ్నం భోజనం చేసేందుకు టేబుల్ దగ్గరకు వెళ్లాడు. అప్పటికే అక్కడ ఇద్దరు చిన్నారులు డబ్బులు లెక్కపెడుతూ కనిపించగా బల్లపై తెల్ల కాగితం ఉంది. అందులో.. "ప్రియమైన మాయా క్లినిక్ ఉద్యోగులారా.. కొత్త బెడ్లు, వెంటిలేటర్లు కొనుగోలు చేసేందుకు నేను, మా సోదరి కొంత డబ్బు విరాళంగా ఇవ్వాలనుకుంటున్నాం. అది మీకు సరిపోతుందని ఆశిస్తున్నాం" అని రాసి ఉంది. అది చదివేసరికి ఆ పిల్లలు ఎంత ఖర్చవుతాయి? మా చేతిలో ఉంది సరిపోతుంది కదూ.. అని బేలగా మొహం పెట్టి అడిగారు. వారి ఆలోచనకు నిశ్చేష్టుడైన అతడు ఆ లేఖను ఫొటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. "ఇది చదువుతున్నప్పుడు ఏడుస్తుంది నేను కాదు.. మీరు" అంటూ క్యాప్షన్ జోడించాడు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. పిల్లల గొప్ప మనుసుకు నెటిజన్లు అబ్బురపడుతున్నారు. వారికి కరోనా భీభత్సం గురించి ఎంత మేరకు తెలుసన్నది తెలీదుగానీ, ఇలాంటి సమయంలో ఆదుకోవాలన్న విషయం మాత్రం మిగతావారికన్నా వాళ్లకే ఎక్కువ తెలుసంటున్నారు. (బుల్లోడా! నువ్వు సామాన్యుడివి కాదు..) -
2022 వరకు కరోనా ప్రభావం కొనసాగుతుంది!
వాషింగ్టన్: మహమ్మారి కరోనా వైరస్(కోవిడ్-19) ప్రభావం 2022 వరకు కొనసాగుతుందని అమెరికా పరిశోధకులు తెలిపారు. ప్రజల రోగనిరోధక వ్యవస్థ మరింత పటిష్టమయ్యేదాకా వైరస్‌ను నియంత్రించలేమని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు మిన్నెసోటా యూనివర్సిటీలోని సెంటర్ ఫర్ ఇన్ఫెక్షస్ డిసీజ్ రీసెర్చ్ అండ్ పాలసీ పరిశోధకులు ఓ నివేదికను విడుదల చేశారు. ‘‘మహమ్మారి 18 నుంచి 24 నెలల పాటు ప్రభావం చూపుతుంది. హెర్డ్ ఇమ్యూనిటీ(దాదాపు 60- 70 శాతం మంది ప్రజలకు వైరస్‌ను తట్టుకునే శక్తి ఉండటం) పెంపొందినట్లయితేనే వైరస్ వ్యాప్తిని కట్టడి చేయవచ్చు’’ అని పేర్కొన్నారు. అదే విధంగా సాధారణ ఫ్లూ కంటే కోవిడ్-19 శరవేగంగా వ్యాపిస్తుందని... ఇంక్యుబేషన్ పీరియడ్ ఎక్కువగా ఉండటం మూలాన ప్రాణాంతక వైరస్ లక్షణాలు త్వరగా బయట పడవు.. కాబట్టి ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.(లాక్డౌన్ ఎత్తివేస్తే ఇక అంతే: డబ్ల్యూహెచ్ఓ) ఇక కరోనా నివారణకు వ్యాక్సిన్ అందుబాటులో లేనందున భవిష్యత్తులో ఎదురుకాబోయే మరిన్ని తీవ్ర పరిణామాలకు అమెరికా సన్నద్ధంగా ఉండాలని పరిశోధకులు హెచ్చరించారు. ఇక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్‌ఫెక్షీషియస్ డిసీజెస్ డైరెక్టర్ ఆంటోనీ ఫౌసీ మాట్లాడుతూ... ప్రపంచ వ్యాప్తంగా చోటుచేసుకుంటున్న తాజా పరిణామాల నేపథ్యంలో కరోనా వైరస్ మరోసారి తప్పక విజృంభించే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. కాగా కరోనా తీవ్రత తగ్గిన కారణంగా అమెరికాలోని పలు రాష్ట్రాల్లో లాక్డౌన్ ఎత్తివేస్తున్నట్లు ప్రభుత్వాలు ప్రకటించిన నేపథ్యంలో పరిశోధకుల హెచ్చరికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇక చైనాలోని వుహాన్ నగరంలో బయటపడిన కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే దాదాపు 2 లక్షల అరవై వేల మంది మరణించిన విషయం తెలిసిందే. దాదాపు 32 మిలియన్ మంది దీని బారిన పడ్డారు. ఇదిలా ఉండగా.. కరోనా ధాటికి ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలం అవుతున్న తరుణంలో పలు దేశాలు లాక్డౌన్ నిబంధనలు సడలిస్తూ ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభించేందుకు సన్నద్ధమవుతున్నాయి.(నివురుగప్పిన నిప్పులా వుహాన్) -
అమెరికాలో తెలుగు విద్యార్ధి మృతి
మిన్నెసోటా: అమెరికాలోని మిన్నెయాపోలిస్ నగరంలో అక్కడి కాలమానం ప్రకారం నవంబర్ 7న భార్గవ్ రెడ్డి ఇత్తిరెడ్డి(25) అనే తెలుగు విద్యార్థి ఆకస్మికంగా మృతిచెందాడు. గుండెపోటు రావడంతో తోటి స్నేహితులు దగ్గరలోని మెడికల్ సెంటర్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే చనిపోయాడు. ఇత్తిరెడ్డి భార్గవ్ రెడ్డి స్వస్థలం తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా. నార్త్ టెక్సాస్ యూనివర్సిటీలో భార్గవ్ ఇటీవలే గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. ఉద్యోగం వెతుక్కునేందుకు టెక్సాస్ నుంచి మిన్నెయాపోలిస్ నగరానికి ఇటీవల మారాడు. చిన్నవయసులోనే మృతిచెందడం విషాదకరమని తోటి స్నేహితులు తెలిపారు. ఎప్పుడూ ఇతరులకు సహాయపడే మనస్తత్వం భార్గవ్‌దని స్నేహితులు తెలిపారు. భార్గవ్ మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. భార్గవ్ రెడ్డి మృతి విషయం తెలిసి కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. -
అందరి దృష్టిని ఆకర్షించిన రకూన్
-
స్పైడర్ మ్యాన్‌ను తలపిస్తున్న రకూన్
మిన్నెసోటా : అమెరికన్లు మంగళవారం ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌ల మధ్య జరిగినచారిత్రక భేటీపైనే కాకుండా ఓ రకూన్(పిల్లిని పోలిన జీవి) గురించి కూడా విపరీతంగా చర్చించారు. ఎందుకంటే అది చేసిన విన్యాసం అటువంటింది. ఆ రకూన్ సెయింట్ పాల్ మిన్నెసోటాలోని యూబీఎస్ భవనాన్ని స్పైడర్ మ్యాన్‌లా ఎక్కడానికి ప్రయత్నించింది. మధ్యాహ్నం గోడపై పాకుంటూ దాదాపు 12 ఫోర్లు ఎక్కాక అది గమనించిన.. మిన్నెసోటా పబ్లిక్ రెడియో రిపోర్టర్ టిమ్ నెల్సన్ ఈ విషయాన్ని తన ట్విటర్లో పోస్ట్ చేశాడు. క్షణాల్లో ఈ వార్త వైరల్‌గా మారింది. సాధారణంగా ఇండ్లలో పెంచుకునే రకూన్లు చాలా కూల్‌గా ఉంటాయి. కానీ ఈ రకూన్ ఇలా చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ బిల్డింగ్‌లో ఉన్నవారు కూడా దానిని లోపలి నుంచి ఫొటోలు తీయడం ప్రారంభించారు. స్థానిక టీవీ చానెళ్లు దీన్ని లైవ్ టెలికాస్ట్ చేయడం మొదలుపెట్టాయి. మెల్లిమెల్లిగా 22వ ఫ్లోర్‌కు చేరుకున్న రకూన్ అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకుంది. #MPRraccoon ట్యాగ్‌తో ట్విటర్లో విపరీతమైన చర్చ జరిగింది. దానిని ఎలాగైనా కిందికి తీసుకురావాలంటూ నెటిజన్లు ప్రభుత్వ అధికారులను డిమాండ్ చేశారు. ఆ బిల్డింగ్ అద్దాలు తెరుచుకునేవి కాకపోవడం, అది అంత ఎత్తులో ఉండటంతో అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేకపోయారు. అది ఆ తర్వాత కిందికి దిగడం ప్రారంభించింది. నిల్సన్తో పాటు స్థానిక మీడియా కూడా దీనిపై తాజా సమాచారాన్ని అందిస్తున్నాయి. మంగళవారం రాత్రి కూడా రకూన్ కదలికలను గమనిస్తూనే ఉన్నారు. బుధవారం ఉదయం అది 17వ ఫ్లోర్ వద్ద విశ్రాంతి తీసుకుంటున్నట్టు సమాచారం. -
భర్తను హతమార్చి తప్పించుకోవడానికి మరో హత్య
ఫ్లోరిడా : 56 ఏళ్ల వయస్సులో ఓ మహిళ పాల్పడిన ఘాతుకం చూస్తుంటే మనుషులు ఇలా కూడా ఆలోచిస్తారా అనే అనుమానం కలుగుతుంది. సినిమాల్లోలాగా తన ఐడెండిటిని మార్చుకోవడం కోసం ఆమె తన పోలికలతో ఉన్న మరో మహిళని చంపేసింది. వివరాల్లోకి వెళ్తే.. మిన్నెసోటాకు చెందిన లోయిస్ రైస్, డేవిడ్‌లకు ముగ్గురు పిల్లలు. గత నెలలో వీరు కనబడకపోవడంతో సన్నిహితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన అధికారులు ఫామ్‌హౌస్‌లో డేవిడ్ మృతదేహాన్ని గుర్తించారు. జూదానికి బానిసైన అతని భార్యే హత్య చేసినట్టు అనుమానించారు. ఆమె ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. కానీ లాభం లేకపోవడంతో ఫేస్బుక్ ద్వారా లోయిస్ గురించి తెలిస్తే సమాచారం ఇవ్వాల్సిందిగా ప్రజలను కోరారు. సీన్ కట్ చేస్తే ఫ్లోరిడా స్టేట్‌లోని లీ కౌంటిలో తన పొలికలతో ఉన్న పమేలా హచిన్సన్తో స్నేహన్ని పెంచుకున్న లోయిస్ ఆమె ఐడెండిటిని తనదిగా చేసుకోవడానికి ప్రయత్నించింది. అందులో భాగంగా ఆదివారం రాత్రి పమేలాను హతమార్చింది. ఆమె పర్స్‌తో పాటు, ఇతర విలువైన వస్తువులను తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీనిపై దర్యాప్తు జరుపుతున్న ఓ అధికారి మాట్లాడుతూ.. నా జీవితంలో ఈ రకమైన హత్యను చూడలేదన్నారు. లోయిస్ చిరునవ్వు చూసిన వారెవరైనా ఆమె మృదు స్వభావం కలదని అనుకుంటారని, కానీ లోయిస్ రైస్ పెద్ద నయ వంచకురాలని అభిప్రాయపడ్డారు. తన భర్త హత్య కేసులో నిందితురాలిగా ఉన్న లోయిస్, పమేలా హచిన్సన్లా మారడానికే ఈ హత్య చేసింది.. ఆమె కోసం దేశవ్యాప్తంగా గాలింపు చేపట్టామని తెలిపారు. -
వైరల్ వీడియో కోసం ప్రియుడికి గురిపెట్టి..!
వైరల్ వీడియో తీయాలన్న కోరిక విషాదానికి దారితీసింది. యూట్యూబ్ కోసం వీడియో తీసే క్రమంలో ఓ 19 ఏళ్ల యువతిని తన ప్రియుడిని కాల్చేసింది. ప్రియుడి ఛాతికి పుస్తకాన్ని అడ్డుపెట్టి.. తుపాకీతో గురిపెట్టి కాల్చింది. తూటాను బుల్లెట్ అడ్డుకుంటుందని వారిద్దరూ భావించారు. ఈ వీడియోతో లక్షలకొద్ది క్లిక్కులు సాధించాలని ఆశపడ్డారు. కానీ, ఈ విన్యాసం తలకిందులైంది. ప్రియురాలు తుపాకీలోంచి దూసుకొచ్చిన తూటా పుస్తకాన్ని చీల్చుకొని ప్రియుడి ఛాతిలోకి దూసుకెళ్లింది. అక్కడికక్కడే అతడు కుప్పకూలి ప్రాణాలు వదిలాడు. ఈ ఘటన అమెరికాలోని మిన్నెసోటాలో జరిగింది. 19 ఏళ్ల మోనాలిసా పెరెజ్, 22 ఏళ్ల పెడ్రో రుయిజ్ గత కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెరెజ్ ఏడు నెలల గర్భవతి కూడా. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం వైరల్ వీడియో తీయాలన్న కోరికతో తుపాకీతో ఈ ఇద్దరు చేసిన ప్రయోగం విఫలమైంది. పెరెజ్ తుపాకీతో కాల్చడంతో పెడ్రో ప్రాణాలు కోల్పోయాడు. ప్రస్తుతం పోలీసులు పెరెజ్‌ను అరెస్టు చేశారు. ఆమెపై వ్యక్తి మృతికి కారణమయ్యారంటూ అభియోగాలు మోపారు. -
కర్ర, కరెంటు వైరుతో బాలుడికి చిత్రహింసలు
మిన్నెసోటా: పన్నెండేళ్ల బాలుడిని ఓ పాస్టర్ క్రూరంగా హింసించాడు. ఈ సంఘటన అమెరికాలోని మిన్నెసోటా నగరంలో వెలుగు చూసింది. తన నమ్మకాన్ని కాదన్నందుకే బాలుడిని పాస్టర్ హింసించాడని పోలీసులు తెలిపారు. పాస్టర్ డాంగ్ వూక్(51) చర్చికి వచ్చిన బాలుడిని బంధించినట్లు చెప్పారు. ఆ తర్వాత కర్ర, ఎలక్ట్రిక్ వైర్లతో నాలుగు రోజుల పాటు చిత్రహింసలు పెట్టినట్లు వెల్లడించారు. అతని చెర నుంచి ఎలాగోలా తప్పించుకున్న బాలుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దేవుడు ప్రత్యక్షం కావడానికే తనను హింసిస్తున్నానని పాస్టర్ చెప్పినట్లు పేర్కొన్నాడు. నాలుగు రోజుల పాటు తనను దారుణంగా కొట్టి హింసించినట్లు తెలిపాడు. కాగా, పాస్టర్ తనయుడు జో సియోగ్ కిమ్(19) కూడా వేరొకరిని వేధించిన కేసులో ఏడాది క్రితం అరెస్టయ్యాడు. -
అమెరికా మాల్ లో కత్తితో దాడి: 7మందికి గాయాలు
మిన్నెసోటా: అమెరికాలోని మిన్నెసోటా మాల్ లో దుండగుడు బీభత్సం సృష్టించాడు. షాపింగ్ కు వచ్చిన వారిపై కత్తితో దాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు కాల్చి చంపారు. ఈ ఘటనలో దాదాపు ఏడుగురికి కత్తి గాయాలయినట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. దాడి అనంతరం మాల్ ను మూసేసి.. ఆ ప్రాంతానికి తమ అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. కాగా, దాడికి పాల్పడిన వ్యక్తికి ఉగ్రవాదసంస్ధతో సంబంధాలు ఉన్నట్లు భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది. -
'మమ్మల్ని జంతువుల్లా చూడటం మానండి'
సెయింట్ పాల్: అమెరికాలో నల్లజాతీయులను పోలీసులు కాల్చేసిన ఘటనలో నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మిన్నెసోటాలోని సెయింట్ పాల్లో గత కొన్ని రోజులుగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్న సుమారు 40 మందిని పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. దీంతో గవర్నర్ నివాసానికి సమీపంలో రోడ్డును మూసివేసి ఆందోళనకారులు నిర్వహిస్తున్న ధర్నాను పోలీసులు అడ్డుకున్నారు. జులై 7న ఫిలాండ్ కాసిల్ అనే నల్లజాతీయుడిని పోలీసు అధికారి సెయింట్ ఆంథోనీ కాల్చిచంపిన విషయం తెలిసిందే. ఫేస్బుక్ లైవ్‌స్ట్రీమింగ్ ద్వారా ఫిలాండో కాసిల్ గర్ల్‌ఫ్రెండ్ ఈ ఘటనను రికార్డ్ చేసింది. అప్పటి నుంచి ఆందోళనకారులు.. సెయింట్ పాల్ లో గవర్నర్ నివాసం వద్ద ఆందోళనలు కొనసాగిస్తున్నారు. అరెస్ట్‌ల సందర్భంగా తమను జంతువుల్లా ట్రీట్ చేయడం మానుకోవాలని నల్లజాతి నిరసనకారుడు జాకబ్ లడ్డా పేర్కొన్నారు. అకారణంగా ఓ వ్యక్తిని చంపేశారని, ఈ ఘటనలో న్యాయం జరగాలని ఆయన డిమాండ్ చేశారు. -
తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన జుకర్ బర్గ్
మిన్నెసోట: మిన్నెసోటాలో నల్లజాతి పౌరుడు ఫిలాండో కాస్టిల్ కాల్చివేతపై ఫేస్ బుక్ అధినేత జుకర్ బర్గ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను అమితంగా కలిచివేసిందని అన్నారు. ఇలాంటి ఘటనలు ఎప్పటికీ జరగకూడదని కోరుకోవాలని అన్నారు. ఓ పక్క లైసెన్స్ అడుగుతూనే వివరణ ఇచ్చేలోగా తన భార్య ముందు ఫిలాండో అనే నల్లజాతి పౌరుడిని పోలీసులు అతి దారుణంగా కాల్చి చంపగా అది ఫేస్ బుక్ లైవ్ లో ప్రపంచానికి కనిపించింది. దీనిపై జుకర్ ఇలా స్పందించారు. ‘నిన్న మిన్నెసోటాకు చెందిన డైమండ్ రైనాల్డ్ అనే మహిళ తన ఫియాన్సీ ఫిలాండో కాస్టిల్ కారులో కాల్పులకు గురైన తర్వాత ఫేస్ బుక్ లైవ్ లోకి వచ్చింది. బుల్లెట్ గాయాలతో ఫిలాడో ప్రాణాలు విడిచాడు. ఈ వీడియోలో నాలుగేళ్ల వారి పాప ఈ దారుణ దృశ్యాన్ని వెనుక సీట్లో కూర్చొని బిక్కుబిక్కుగా చూస్తోంది. కాస్టిల్ కుటుంబానికి జరిగిన ఘటన నా గుండెను పిండేసింది. చాలా కుటుంబాలు ఈ వీడియో చూసి ఒక రకమైన విషాదంలోకి వెళ్లాయి. ఇలాంటి సంఘటనలతో ఫేస్బుక్ యూజర్లకు కలుగుతున్న బాధలో నా బాధ కూడా ఉంది. ఈ వారం వెలుగులోకి వచ్చిన ఎన్నో సజీవ చిత్రాలు, సంఘటనలు లక్షలమందిని భయం గుప్పిట్లోకి తీసుకెళుతున్నాయి. డైమండ్ కుటుంబానికి జరిగిన ఘటనలాంటిది మరొకటి చూడకూడదని మనం బలంగా కోరుకుందాం. ఈ సంఘటన మనం ఎందుకు ఒక చోట కలిసి మరింత దగ్గరిగా ఒక ప్రపంచంగా బ్రతకాలో.. ఎంత దూరం వరకు వెళ్లాలో విషయాన్ని మరోసారి గుర్తు చేస్తుంది’ అని ఆయన తన ఫేస్ బుక్ పేజీలో రాశారు. -
అమెరికాలో నల్లజాతీయుడి కాల్చివేత
మిన్నెసోటా: అమెరికా లూసియానా రాష్ట్రంలోని మిన్నెసోటాలో నల్లజాతీయుడిని పోలీసు అధికారి కాల్చిచంపడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంగళవారం కూడా ఇలాంటి ఘటనలోనే బాటన్ రోగ్ నగరంలో ఓ పోలీసు అధికారి ఆల్టన్ స్టెర్లింగ్ అనే వ్యక్తిని కాల్చి చంపారు. కారులో వెళుతున్న ఫిలాండో కాసిల్ (32) అనే వ్యక్తి వద్ద తుపాకి ఉండటాన్ని చూసిన అధికారి అతని వైపు తన గన్ చూపించారు. దీంతో కారును ఆపిన కాసిల్.. తన గన్ లైసెన్స్ చూపడానికి వెళ్తుండగా పోలీసు అధికారి షూట్ చేసి చంపాడని అతనితో పాటు కారులో ఉన్న ప్రేయసి డైమండ్ రెనాల్డ్స్ ఘటన సమయంలో తీసిన లైవ్ వీడియోలో పేర్కొంది. అధికారి వద్దకు వెళ్లేముందు తన వద్ద గన్ లైసెన్స్ ఉందని కాసిల్ చెప్పాడని ఆమె వీడియోలో చెప్పింది. కాగా, కాసిల్ ను నాలుగు సార్లు కాల్చారు. ‘‘సార్, వెపన్ లైసెన్స్ ను చూపడానికి అతను వస్తున్నాడు’’ అని ఆమె పెద్దగా కేకలు వేయడం కూడా వీడియోలో రికార్డయింది. దీంతో వందలమంది ప్రజలు ఆస్టన్, కాసిల్ లు మరణించిన ప్రదేశాలకు తరలివెళ్లి నిరసనలు తెలుపుతున్నారు. కాగా, బుధవారం వెలుగులోకి వచ్చిన మరో వీడియోలో ఆస్టన్, ఇద్దరు పోలీసు అధికారులకు చిన్న వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. దీంతో ఆస్టన్ ను కిందపడేసిన ఇద్దరు అధికారులు పలుమార్లు షూట్ చేసినట్లు కనిపిస్తోంది. అధికారులు పిలిచినప్పుడు వ్యక్తి వారిని బెదిరించలేదని, కానీ వారు అతనిపై దారుణంగా కాల్పులు జరిపారని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. బాధితుడికి న్యాయం జరగాలని పోరాడుతున్నట్లు చెప్పారు. మరణించిన వ్యక్తికి ఐదుగురు బిడ్డలు ఉన్నారని, వారి గతేం కావాలి.. ఇది కేవలం ఒక్కరికి సంబంధించిన విషయం కాదని నిరసనకారులు అన్నారు. కాగా, ఘటనపై అమెరికా న్యాయశాఖ విచారణకు ఆదేశించింది. -
గర్ల్ ఫ్రెండ్‌ని రేప్ చేశాడని ఫ్రెండ్ తల నరికి..
మిన్నెసోటా: జూన్ 24.. అర్థరాత్రి సమయం. అనుమానాస్పద లైసెన్స్ నెంబర్ ప్లేట్‌తో ఉన్న కారు. అనుమానం వచ్చిన పోలీసులు ఆ కారు వద్దకు వెళ్లారు. ఈలోగా కారులో ఉన్నవారు వేగం పెంచారు. పోలీసులు వారిని అందుకునే ప్రయత్నం చేయగా గంటలకు వందమైళ్ల వేగంతో ఆ కారు దూసుకెళ్లింది. అలా కొద్ది దూరం వెళ్లాక రెండు చోట్ల బలంగా ఢీకొని ఆగిపోయింది. కారు డ్రైవర్ అందులో నుంచి పారిపోయి సమీపంలోని ఓ నివాసంలో దాచుకోగా.. అందులో ఉన్న జోసెఫ్ క్రిస్టెన్ థార్సెన్ అనే వ్యక్తికి పోలీసులు ఎట్టకేలకు సంకెళ్లు తగిలించారు. అక్కడే ఓ పాడుబడ్డ ఇంట్లో దాక్కున్న డ్రైవర్‌ను బయటకు లాక్కొచ్చారు. అప్పుడు ఆ వ్యక్తి చెప్పిన నిజం చూసి పోలీసులు ఖిన్నులయ్యారు. ఇంతకు ఏమిటా నిజం అనుకుంటున్నారా.. థార్సెన్ హత్య చేశాడు. అవును.. తన స్నేహితుడైన డేవిడ్ అలెగ్జాండర్ హైమన్ అనే వ్యక్తిని కిరాతకంగా పొడవడమే కాకుండా అతడి తల నరికేసి అడవుల్లో పారేశాడు. తన గర్ల్‌ఫ్రెండ్‌పై అత్యాచారానికి పాల్పడ్డాడనే కారణంతోనే అతడిని హత్య చేశాడు. వాస్తవానికి థార్సెన్ మత్తుపదార్ధాలకు అలవాటుపడిన వ్యక్తి. అతడిపై రెండు మూడు నేరాల కేసులతోపాటు జైలుకు పోయి వచ్చిన చరిత్ర కూడా కలదు. 35 ఏళ్ల థార్సెన్ కు హైమన్(21)కు ఫేస్ బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. వారిద్దరు స్నేహితులయ్యారు. థార్సెన్‌కు ఒక గర్ల్ ప్రెండ్ కూడా ఉంది. ఒక రోజు థార్సెన్ గర్ల్ ప్రెండ్ వద్దకు వెళ్లిన హైమన్ ఆమెపై లైంగికదాడి చేశాడంట. అలా దాడి చేసినప్పుడే ఆమె కూడా అతడిపై తిరగబడి కొట్టింది కూడా. అయితే, డ్రగ్స్ బారిన పడిన ఈ ముగ్గురు మరో కారు డ్రైవర్‌తో కలిసి కారులో వెళుతూ మధ్యలో డ్రగ్స్ సేవించారు. అనంతరం కారు చెకింగ్ కోసం అని హైమన్ కిందికి దిగగా వెనుక నుంచి థార్సెన్ బలంగా బేస్ బాల్ బ్యాట్ తో దాడి చేశాడు. అనంతరం కత్తితో అతడిని పొడిచి కసిగా అతడి తల నరికేసి అడవిలో పారేశాడు. తర్వాత ఏం తెలియనట్లు నటించాడు. ఈ కథంతా విన్న పోలీసులు అవాక్కయ్యి థార్సన్ను అతడి గర్ల్ ఫ్రెండ్ ను మరో కారు డ్రైవర్ ను చివరకు అదుపులోకి తీసుకున్నాడు. -
మిన్నెసోటాలో శ్రీరామనవమి వేడుకలు
అమెరికా: 'శ్రీరామ నవమి' మనందరికీ తెలిసిందే. ఇదొక హిందువుల పవిత్ర పండుగ. హిందూ క్యాలెండర్ ప్రకారం చైత్ర మాసం నవమి రోజున ఈ పండుగను చేస్తారు. ఈ శ్రీరామ నవమి మహోత్సవాలు శనివారం యూఎస్ఏలోని మిన్నెసోటాలో ఘనంగా జరిగాయి. అక్కడ మిన్నెసోటా ఏరియా తెలంగాణ అసోసియేషన్ (మాతా) ఆధ్వర్యంలో హిందూ దేవాలయంలో సంప్రదాయ బద్ధంగా నిర్వహించారు. ఈ మహోత్సవానికి 600 పైగా భక్తులు హాజరయ్యారు. ఈ వేడుకను ఆలయ పూజారులు ఆరంభించారు. వందలాది మంది భక్తులు ఇందులో పాల్గొన్నారు. ఆలయ పూజారి మురళి భత్తార్ కన్యదానం, మాంగల్యధారణ, తలంబ్రాల సేవ, అర్చన, ఆరతి ర్యక్రమాలను నిర్వహించారు. మాతా అధ్యక్షుడు సుధాకర్ జపా, ఆయన కుటుంబ సభ్యులు, మాతా బోర్డు సభ్యులు శ్రీరామ దంపతులకు పట్టు వస్త్రాలను సమర్పించారు. వేంకట దేవులపల్లి గ్రూపు అందించిన రామభజన, రామదాసు కీర్తనలతో భక్తులు ఆనందించారు. పూజ తర్వాత ఆర్గనైజర్లు భక్తులకు పానకం(తేనీరు) ప్రసాదించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు భక్తులకు, ఆలయ యాజమాన్యానికి, కమిటీ సభ్యులకు మాతా ప్రెసిడెంట్ సుధాకర్ జపా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాతా బోర్డు సభ్యులు జి.మహిందర్, నెల్ల నాగేందర్, అల్లమనేని నిరంజన్, బచ్చిగారి రాజశేఖర్, రవ్వా రమేష్, సాగి రవి, భగవాన్ రెడ్డి, గడ్డం శ్రీనివాస్, కోమకుల రమేష్, కంజుల రాకేష్, కోయాడ పవన్, సక్రు, కపిడి కవిత, మద్దిశెట్టి శివాని, పట్టూరి యుగేందర్, తాళ్ల సారథి, బుచ్చిరెడ్డి, సురేష్, శ్రీపాద దేవరాజు, ఆదిత్య, కాదర్ల అనుష్క, గూనుగంటి అశ్విని, కూర మాలతి, భవాని చేపూరి, కౌకోటి రాజ్, చిన్నోల అమర్ తదితరులు పాల్గొన్నారు. -
అత్యంత పెద్ద వయస్కురాలైన ఫేస్బుక్ అభిమాని మృతి
న్యూయార్క్: అత్యంత పెద్ద వయస్కురాలైన ఫేస్బుక్ అభిమాని అన్నా స్టోయర్(114) అమెరికాలోని మిన్నెసోటాలో మరణించారు. తన జన్మదినాన్ని తప్పుగా పేర్కొని ఆమె ఫేస్బుక్ లో ఖాతా తెరిచారు. తన వయసు 15 ఏళ్లు తగ్గించి 99గా పేర్కొని ఫేస్బుక్ ఎకౌంట్ పొందారు. నిజానికి ఆమె 1900, అక్టోబర్ 15న జన్మించారు. అక్టోబర్ లో జన్మదినం జరుపుకున్న అన్నా స్టోయర్ లేటెస్ట్ ఐఫోన్ ఎలా వాడాలో నేర్చుకున్నారు. ఇందులో ఈ-మెయిల్, గూగుల్ ఎలా చూసుకోవాలో తెలుసుకున్నారు. సోషల్ మీడియా ద్వారా తన అభిప్రాయాలను కుటుంబ సభ్యులు, స్నేహితులతో పంచుకునేవారు. -
ఇద్దరు చిన్నారులపై అత్యాచారం చేసిన ఫాదర్
చెన్నై: అమెరికాలో ఇద్దరు చిన్నారులపై అత్యాచారానికి పాల్పడిన కేసులో నిందితుడిగా ఉన్న చర్చి ఫాదర్ జోసెఫ్ పళనివేల్ జయపాల్‌ను ఆ దేశానికి అప్పగించాలంటూ ఢిల్లీ కోర్టు కేంద్రాన్ని సోమవారం ఆదేశించింది. తమిళనాడులోని నీలగిరి జిల్లా ఊటీకి చెందిన ఫాదర్ జోసెఫ్ 2004-05లో అమెరికాలోని మిన్నసోట్టా నగర్లో ఉండేవాడు. అక్కడి చర్చికి వచ్చిన 14, 16 ఏళ్ల చిన్నారులపై అతను అత్యాచారానికి పాల్పడినట్లు కేసు నమోదైంది. అత్యాచారం సంఘటనతో తీవ్ర అనారోగ్యానికి గురైన 14 ఏళ్ల బాలికను అక్కడి ఆస్పత్రికి తరలించారు. ఈ ఘాతుకాన్ని బయటకు చెబితే చిన్నారిని హతమారుస్తానని ఫాదర్ బెదిరించినట్లు మరో ఆరోపణ ఉంది. ఈ ఆరోపణలను ఖండించిన జోసెఫ్ 2005లో భారత్‌కు చేరుకుని అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అమెరికాలోని రెసివ్‌కవుండి కోర్టు ఫాదర్ జోసెఫ్‌ను అరెస్ట్ చేయాల్సిందిగా 2010 డిసెంబరు 28న వారెంట్ జారీచేసింది. ఫాదర్‌ను అప్పగించాలని భారత విదేశాంగశాఖను అమెరికా కోర్టు 2011 ఫిబ్రవరిలో కోరింది. దీంతో విదేశాంగ శాఖ నవీన్ కుమార్ అనే ప్రత్యేక న్యాయవాదిని ఫాదర్ కేసు విషయమై నియమించింది. ఢిల్లీలోని అదనపు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు విచారణ చేపట్టింది. ఫాదర్‌పై నమోదు చేసిన అభియోగాల్లో వాస్తవాలు ఉన్నట్లు కోర్టు అభిప్రాయపడుతున్నదని ఢిల్లీ కోర్టు మేజిస్ట్రేట్ అజయ్‌కార్క్ వ్యాఖ్యానించారు. కాబట్టి అత్యాచార ఆరోపణలపై ఏ దేశం విచారణ కోరుతోందో ఆ దేశానికి (అమెరికా) ఫాదర్ జోసెఫ్‌ను అప్పగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని మేజిస్ట్రేటు ఆదేశించారు. ఫాదర్‌పై ఆరోపణలు రుజువైన పక్షంలో అక్కడి చట్టాల ప్రకారం 30 ఏళ్ల జైలుశిక్ష పడే అవకాశం ఉంది. ** -
అమెరికాలో ఘనంగా ఉగాది సంబరాలు
తెలుగు సంవత్సరాది ఉగాదిని అమెరికాలో ఉన్న ఆంధ్రులు ఘనంగా చేసుకుంటున్నారు. అక్కడి పలు రాష్ట్రాల్లో తెలుగు సంఘాల ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. మిన్నెసోటా రాష్ట్రంలో కూడా ఉగాది వేడుకలను ఘనంగా చేసుకున్నారు. దాదాపు రెండు వేల మంది వరకు ఈ వేడుకల్లో పాలు పంచుకున్నారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయం ఉట్టిపడే రీతిలో సాంస్కృతిక కార్యక్రమాలు సాగాయి. పట్టుపంచెలు, పట్టుచీరలు అక్కడి వాతావరణాన్నే మార్చేశాయి. తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో కెనడీ స్కూల్లో జరిగిన ఈ పండగ తమలో నూతనోత్సాహాన్ని నింపిందని ఎన్నారైలు అంటున్నారు. అందరూ కలిసి పండగను చేసుకోవడం ఆనందంగా ఉందని చెబుతున్నారు.