రాంచెస్టర్: 'పిల్లలకేం తెలుసు?', 'వాళ్లకేం తెలీదు?' ఇలాంటి మాటలను చాలాసార్లు విన్నాం, వింటున్నాం, ఎప్పుడూ వింటూనే ఉంటాం కూడా! కానీ ఇది చదివాక అది అబద్ధం అనిపిస్తోంది. ప్రస్తుతం కరోనా వల్ల ప్రపంచమే స్థంభించిపోయింది. విరుగుడు లేని వ్యాధి కావడంతో ప్రతి ఒక్కరూ వణికిపోతున్నారు. ఈ మహమ్మారిని ఓడించేందుకు వైద్యులు అలుపెరగకుండా పోరాడుతున్నారు. కానీ పెరుగుతున్న కేసులు, సరిపోని వెంటిలేటర్లు వారికి పెనుసవాళ్లుగా మారుతున్నాయి. ఇంతటి పెద్ద సమస్య రెండు చిన్ని బుర్రలకు అర్థమైంది. 'మేమున్నాం..' అంటూ బోసి నవ్వులతో సాయం చేసేందుకు ముందుకొచ్చారు. వెంటిలేటర్లకు ఎంత డబ్బులవుతాయో చెప్పండి, ఇస్తాం అంటూ ఓ లేఖ పెట్టారు. అల్లరి పనులను పక్కనపెట్టి అర్థవంతమైన సందేశం ఇచ్చారు. మనసును స్పృశించే ఈ ఘటన అమెరికాలోని మించెన్నెసొటాలో చోటు చేసుకుంది. (అది కుక్కపిల్ల కాదు: అక్కడే వదిలేయ్!)
మయో క్లినిక్‌లో పనిచేస్తున్న స్టీవెన్స్ మధ్యాహ్నం భోజనం చేసేందుకు టేబుల్ దగ్గరకు వెళ్లాడు. అప్పటికే అక్కడ ఇద్దరు చిన్నారులు డబ్బులు లెక్కపెడుతూ కనిపించగా బల్లపై తెల్ల కాగితం ఉంది. అందులో.. "ప్రియమైన మాయా క్లినిక్ ఉద్యోగులారా.. కొత్త బెడ్లు, వెంటిలేటర్లు కొనుగోలు చేసేందుకు నేను, మా సోదరి కొంత డబ్బు విరాళంగా ఇవ్వాలనుకుంటున్నాం. అది మీకు సరిపోతుందని ఆశిస్తున్నాం" అని రాసి ఉంది. అది చదివేసరికి ఆ పిల్లలు ఎంత ఖర్చవుతాయి? మా చేతిలో ఉంది సరిపోతుంది కదూ.. అని బేలగా మొహం పెట్టి అడిగారు. వారి ఆలోచనకు నిశ్చేష్టుడైన అతడు ఆ లేఖను ఫొటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. "ఇది చదువుతున్నప్పుడు ఏడుస్తుంది నేను కాదు.. మీరు" అంటూ క్యాప్షన్ జోడించాడు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. పిల్లల గొప్ప మనుసుకు నెటిజన్లు అబ్బురపడుతున్నారు. వారికి కరోనా భీభత్సం గురించి ఎంత మేరకు తెలుసన్నది తెలీదుగానీ, ఇలాంటి సమయంలో ఆదుకోవాలన్న విషయం మాత్రం మిగతావారికన్నా వాళ్లకే ఎక్కువ తెలుసంటున్నారు. (బుల్లోడా! నువ్వు సామాన్యుడివి కాదు..)
Comments
Please login to add a commentAdd a comment