అమెరికాలో నల్లజాతీయుడి కాల్చివేత | New US police shooting in Minnesota as protests continue in Baton Rouge | Sakshi
Sakshi News home page

అమెరికాలో నల్లజాతీయుడి కాల్చివేత

Published Thu, Jul 7 2016 1:48 PM | Last Updated on Mon, Sep 4 2017 4:20 AM

అమెరికాలో నల్లజాతీయుడి కాల్చివేత

అమెరికాలో నల్లజాతీయుడి కాల్చివేత

మిన్నెసోటా: అమెరికా లూసియానా రాష్ట్రంలోని మిన్నెసోటాలో నల్లజాతీయుడిని పోలీసు అధికారి కాల్చిచంపడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంగళవారం కూడా ఇలాంటి ఘటనలోనే బాటన్ రోగ్ నగరంలో ఓ పోలీసు అధికారి ఆల్టన్ స్టెర్లింగ్ అనే వ్యక్తిని కాల్చి చంపారు. కారులో వెళుతున్న ఫిలాండో కాసిల్ (32) అనే వ్యక్తి వద్ద తుపాకి ఉండటాన్ని చూసిన అధికారి అతని వైపు తన గన్ చూపించారు. దీంతో కారును ఆపిన కాసిల్.. తన గన్ లైసెన్స్ చూపడానికి వెళ్తుండగా పోలీసు అధికారి షూట్ చేసి చంపాడని అతనితో పాటు కారులో ఉన్న ప్రేయసి డైమండ్ రెనాల్డ్స్ ఘటన సమయంలో తీసిన లైవ్ వీడియోలో పేర్కొంది.

అధికారి వద్దకు వెళ్లేముందు తన వద్ద గన్ లైసెన్స్ ఉందని కాసిల్ చెప్పాడని ఆమె వీడియోలో చెప్పింది. కాగా, కాసిల్ ను నాలుగు సార్లు కాల్చారు. ‘‘సార్, వెపన్ లైసెన్స్ ను చూపడానికి అతను వస్తున్నాడు’’ అని ఆమె పెద్దగా కేకలు వేయడం కూడా వీడియోలో రికార్డయింది. దీంతో వందలమంది ప్రజలు ఆస్టన్, కాసిల్ లు మరణించిన ప్రదేశాలకు తరలివెళ్లి నిరసనలు తెలుపుతున్నారు. కాగా, బుధవారం వెలుగులోకి వచ్చిన మరో వీడియోలో ఆస్టన్, ఇద్దరు పోలీసు అధికారులకు చిన్న వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. దీంతో ఆస్టన్ ను కిందపడేసిన ఇద్దరు అధికారులు పలుమార్లు షూట్ చేసినట్లు కనిపిస్తోంది.

అధికారులు పిలిచినప్పుడు వ్యక్తి వారిని బెదిరించలేదని, కానీ వారు అతనిపై దారుణంగా కాల్పులు జరిపారని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. బాధితుడికి న్యాయం జరగాలని పోరాడుతున్నట్లు చెప్పారు. మరణించిన వ్యక్తికి ఐదుగురు బిడ్డలు ఉన్నారని, వారి గతేం కావాలి.. ఇది కేవలం ఒక్కరికి సంబంధించిన విషయం కాదని నిరసనకారులు అన్నారు. కాగా, ఘటనపై అమెరికా న్యాయశాఖ విచారణకు ఆదేశించింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement