black man shot
-
చుట్టుముట్టి కాల్చి చంపారు!
-
ఘోరం: చుట్టుముట్టి కాల్చి చంపారు!
వాషింగ్టన్: అమెరికాలో నల్లజాతీయులపై పోలీసుల తుపాకీ గుళ్ల వర్షం కొనసాగుతోంది. జార్జ్ ఫ్లాయిడ్ కాల్చివేతపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసన జ్వాలలు ఎగిసినా పోలీసుల దుందుడుకు చర్యలు తగ్గడం లేదు. తాజాగా మరో నల్లజాతీయుడిని పోలీసులు కాల్చి చంపారు. మృతున్ని ట్రేఫోర్డ్ పెల్లెరిన్గా గుర్తించారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి లుసియానాలోని లఫయెట్టే ప్రాంతంలో చోటుచేసుకుంది. బెన్ క్రంప్ అనే పౌర హక్కుల న్యాయవాది దీనికి సంబంధించిన వీడియోను ట్విటర్లో షేర్ చేయడంతో వైరల్ అయింది. (చదవండి: బ్రిటన్‌లో మరో జార్జ్ ఫ్లాయిడ్!) ‘ఓ నల్ల జాతీయుడిని చట్టుముట్టిన పోలీసులు అతనిపై కాల్పులు జరిపి పొట్టనబెట్టుకున్నారు. దాదాపు 10 రౌండ్ల కాల్పులు జరిపారు. మారణాయుధం (కత్తి) ధరించిన సదరు వ్యక్తి తమ మాటల్ని లెక్కచేయకుండా ముందుకు వెళ్లడంతో కాల్పులు జరిపామని పోలీసులు చెప్పడం అత్యంత అమానవీయం. కత్తిని కలిగి ఉంటే చంపేస్తారా?’అని ఆయన ట్విటర్లో బెన్ క్రంప్ పేర్కొన్నారు. కాగా, జార్జ్ ఫ్లాయిడ్ కుటుంబం తరపున ఆయన కోర్టులో వాదిస్తున్నారు. (చదవండి: ట్రంప్ నిజంగా మూర్ఖుడు.. అబద్దాల కోరు) -
అమెరికాలో మరో నల్ల జాతీయుడి నరహత్య
వాషింగ్టన్: అమెరికా పోలీసుల చేతిలో దారుణ నరహత్యకు గురయిన జార్జ్ ఫ్లాయిడ్ ఘటన మరవక ముందే అలాంటి సంఘటన మరోకటి వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతుంది. ఏ అండ్ ఈ నెట్‌వర్క్‌లో వచ్చే రియల్ టైమ్ పోలీస్ షో ‘లైవ్ పీడీ’ కోసం పోలీసులు ఈ వీడియోను ఏడాది క్రితం చిత్రీకరించారు. ఈ ఘటనలో మరో నల్ల జాతీయుడు మరణించాడు. జార్జ్ ఫ్లాయిడ్ మరణం తర్వాత ఈ వీడియో, ఇందుకు సంబంధించిన నివేదిక వెలుగులోకి వచ్చింది. టెక్సాస్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ క్రింద ఈ నివేదిక వెల్లడయ్యింది. వివరాలు.. జావియర్ అంబ్లెయర్ అనే వ్యక్తి స్నేహితులతో కలిసి పోకర్ ఆడి ఇంటికి వెళ్తుండగా విలియమ్సన్ కౌంటీ డిప్యూటీ జేజే జాన్సన్ అతడిని అడ్డగించాడు. అంబ్లర్ హెడ్‌లైట్స్ అధికంగా ఫోకస్ చేస్తున్నాడని ఆరోపించాడు. జాన్సన్ తన తుపాకీని గీసి, అంబ్లర్ను తన కారు నుంచి దిగమని డిమాండ్ చేశాడు. దాంతో అతను కారు బయటకు వచ్చి చేతులు పైకి లేపి నిలబడ్డాడు. ఆ తర్వాత అంబ్లర్ తన కారు వద్దకు వెళ్లడానికి ప్రయత్నిస్తుండగా.. జాన్సన్ టేజర్‌తో అతడిని కింద పడేస్తాడు. దాంతో అంబ్లర్ మోకాలి మీద నిల్చుని పైకి లేచేందుకు ప్రయత్నిస్తాడు. ఈలోపు వైట్ విలియమ్సన్ కౌంటీ షెరీఫ్ డిప్యూటీ తన “లైవ్ పీడీ” సిబ్బందితో వచ్చి టేజర్‌ను అంబ్లర్ వీపుకు గురి పెడతాడు. ఇద్దరి మధ్య చిన్న పొరాటం లాంటి జరుగుతుండగా మరో ఆస్టిన్ పోలీసు అధికారి ఒకరు సంఘటన స్థలానికి వచ్చి అంబ్లర్కు హ్యాండ్‌కఫ్స్ వేస్తాడు. తనను వదిలివేయాల్సిందిగా అంబ్లర్ వేడుకోవడం వీడియోలో వినవచ్చు. ‘సార్ నేను మీరు చెప్పినట్లు చేయగలను. కానీ నా గుండె చాలా బలహీనంగా ఉంది. అందుకే మీరు చెప్పినట్లు చేయలేకపోతున్నాను. నేను మిమ్మల్ని వ్యతిరేకించడం లేదు. సార్ నాకు ఊపిరి ఆడటం లేదు. దయచేసి.. దయచేసి నన్ను వదిలి పెట్టండి. నన్ను కాపాడండి’ అని వేడుకుంటాడు అంబ్లర్. పోలీసులు మేం చేప్పినట్లు చేయాలని డిమాండ్ చేస్తారు. అందుకు అంబ్లర్ తాను అలా చేయలేనని చెబుతూ ప్రాణం వదులుతాడు. చేతులు వేళ్లాడేస్తాడు. (ఆగని ఆందోళనలు) ఈ లోపు అధికారి మరోసారి టేజర్‌తో కాల్పులు జరుపుతాడు. అంబ్లర్ స్పృహ తప్పిపోవడం గమనించిన పోలీసులు అతడిని ఆస్పత్రికి తీసుకెళ్తారు. వైద్యులు అంబ్లర్ అప్పటికే మరణించాడని తెలిపారు. గుండెకు రక్త ప్రసరణ ఆగిపోవడం వల్లే అతడు మరణించినట్లు నివేదిక వెల్లడించింది. స్టేట్ అటార్నీ జనరల్ కార్యాలయానికి చేసిన నివేదిక ప్రకారం అంబ్లర్ది నరహత్యగా పేర్కొంది. పోస్టు మార్టమ్ నివేదికలో గుండెకు రక్తప్రసరణ ఆగిపోవడం, రక్తపోటు హృదయ సంబంధ వ్యాధులతో అంబ్లర్ మరణించాడని వెల్లడించింది. (‘అతడు ఈ ప్రపంచాన్ని మార్చబోతున్నాడు’) -
ఐఫోన్‌ను చూసి గన్ అనుకుని ...
కాలిఫోర్నియా : చీకట్లో ఎదురుగా ఉన్న వ్యక్తి చేతిలోని సెల్‌ఫోన్‌ను తుపాకీగా భావించి, ఆ వ్యక్తిపై 20సార్లు కాల్పులు జరిపి చంపిన ఘటన కాలిఫోర్నియాలోని సాక్రమెంటోలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే స్టీఫెన్ అలోంజో క్లార్క్ (22) సాక్రమెంట్లో ఉంటున్న తన తాతగారింటికి వచ్చాడు. వృద్ధాప్యంలో ఉన్న తన తాతకు సాయం చేయడానికి క్లార్క్ ప్రతివారం వస్తుంటాడు. ఎప్పటి మాదిరిగానే మరోసారి వచ్చి రాత్రి తన సెల్‌ఫోన్‌ను తీసుకుని ఇంటి వెనక పెరట్లో తిరుగుతున్నాడు. అదే సమయంలో పెట్రోలింగ్‌లో ఉన్న పోలీసులకు అతడు సరిగా కనిపించకపోవడంతో నేరస్తుడని అనుమానించారు. నిఘా కోసం ఏర్పాటుచేసిన హెలికాప్టర్లోకానీ, కెమెరాల్లో కానీ క్లార్క్ చేతిలో ఉన్న వస్తువును సరిగా గుర్తించలేకపోయాయి. దాంతో అతని చేతిలో ఉన్నది తుపాకీనే అని అనుమానంతో క్లార్క్ పై కాల్పులు జరిపారు. అనంతరం అతడి దగ్గరకు వెళ్లి చూడగా అతని చేతిలో ఉన్నది ఆపిల్ ఐఫోన్ అని తెలిసింది. ఈ తతంగం అంతా వారి వద్ద ఉన్న కెమారాల్లో రికార్డు అవుతూనే ఉంది. మరణించిన వ్యక్తి దగ్గర ఉన్నది గన్ కాదని తెలియగానే పోలీసులు కెమరాను మ్యూట్‌లో పెట్టారు. రెండు నిమిషాలపాటు వారి సంభాషణ అంతా మ్యూట్‌లోనే రికార్డయ్యింది. ఈ విషయం గురించి పోలీసు అధికారులను ప్రశ్నించగా భిన్న కథనాలు చెప్పుకొచ్చారు. చనిపోయిన వ్యక్తి అంతకుముందు అక్కడ ఉన్న మూడు వాహనాలను ధ్వంసం చేశాడని, దాంతో పక్కింటివారు 911 నెంబరుకు ఫోన్ చేస్తేనే తాము అక్కడకి వచ్చామని చెప్పారు. క్లార్క్ తమను చూసి పారిపోవడానికి ప్రయత్నించాడని, అందులో భాగంగా పక్క ఇంటి వారి కిటికి అద్దాలను కూడా పగలకొట్టాడన్నారు. మరో అధికారి మాట్లాడుతూ కెమరాలో రికార్డయిన దృశ్యాల్లో అతని ఎడమ చేతిలో ఉన్నవస్తువును సరిగా కనిపించలేదని, దాంతో అతని చేతిలో ఉన్నది మరణాయుధం అని భావించి కాల్పులు జరిపామని చెప్పారు. తొలుత అధికారులు అతని వివరాలను వెల్లడించలేదు. కానీ సాలెనా మన్ని అనే యువతి అతని పేరు స్టీఫెన్ అలోంజో క్లార్క్ అని, తాను అతడికి కాబోయే భార్యనని, వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నట్లు తెలిపింది. అతని సహచరులు, బంధువులు క్లార్క్ మృతికి పోలీసులే కారణం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. -
ఐఫోన్‌ను చూసి గన్ అనుకుని...
-
అమెరికాలో నల్లజాతీయుడి కాల్చివేత
మిన్నెసోటా: అమెరికా లూసియానా రాష్ట్రంలోని మిన్నెసోటాలో నల్లజాతీయుడిని పోలీసు అధికారి కాల్చిచంపడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంగళవారం కూడా ఇలాంటి ఘటనలోనే బాటన్ రోగ్ నగరంలో ఓ పోలీసు అధికారి ఆల్టన్ స్టెర్లింగ్ అనే వ్యక్తిని కాల్చి చంపారు. కారులో వెళుతున్న ఫిలాండో కాసిల్ (32) అనే వ్యక్తి వద్ద తుపాకి ఉండటాన్ని చూసిన అధికారి అతని వైపు తన గన్ చూపించారు. దీంతో కారును ఆపిన కాసిల్.. తన గన్ లైసెన్స్ చూపడానికి వెళ్తుండగా పోలీసు అధికారి షూట్ చేసి చంపాడని అతనితో పాటు కారులో ఉన్న ప్రేయసి డైమండ్ రెనాల్డ్స్ ఘటన సమయంలో తీసిన లైవ్ వీడియోలో పేర్కొంది. అధికారి వద్దకు వెళ్లేముందు తన వద్ద గన్ లైసెన్స్ ఉందని కాసిల్ చెప్పాడని ఆమె వీడియోలో చెప్పింది. కాగా, కాసిల్ ను నాలుగు సార్లు కాల్చారు. ‘‘సార్, వెపన్ లైసెన్స్ ను చూపడానికి అతను వస్తున్నాడు’’ అని ఆమె పెద్దగా కేకలు వేయడం కూడా వీడియోలో రికార్డయింది. దీంతో వందలమంది ప్రజలు ఆస్టన్, కాసిల్ లు మరణించిన ప్రదేశాలకు తరలివెళ్లి నిరసనలు తెలుపుతున్నారు. కాగా, బుధవారం వెలుగులోకి వచ్చిన మరో వీడియోలో ఆస్టన్, ఇద్దరు పోలీసు అధికారులకు చిన్న వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. దీంతో ఆస్టన్ ను కిందపడేసిన ఇద్దరు అధికారులు పలుమార్లు షూట్ చేసినట్లు కనిపిస్తోంది. అధికారులు పిలిచినప్పుడు వ్యక్తి వారిని బెదిరించలేదని, కానీ వారు అతనిపై దారుణంగా కాల్పులు జరిపారని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. బాధితుడికి న్యాయం జరగాలని పోరాడుతున్నట్లు చెప్పారు. మరణించిన వ్యక్తికి ఐదుగురు బిడ్డలు ఉన్నారని, వారి గతేం కావాలి.. ఇది కేవలం ఒక్కరికి సంబంధించిన విషయం కాదని నిరసనకారులు అన్నారు. కాగా, ఘటనపై అమెరికా న్యాయశాఖ విచారణకు ఆదేశించింది.