చీకట్లో ఎదురుగా ఉన్న వ్యక్తి చేతిలోని సెల్‌ఫోన్‌ను తుపాకీగా భావించి, ఆ వ్యక్తి పైన 20సార్లు కాల్పులు జరిపి చంపిన ఘటన కాలిఫోర్నియాలోని సాక్రమెంటోలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే స్టీఫెన్ అలోంజో క్లార్క్ (22) సాక్రమెంట్‌లో ఉంటున్న తన తాతగారింటికి వచ్చాడు. వృద్ధాప్యంలో ఉన్నతన తాత గారికి సాయం చేయడానికి క్లార్క్ ప్రతివారం వస్తు ఉంటాడు. అలానే ఇప్పుడు కూడా వచ్చాడు. రాత్రి సమయంలో తన సెల్‌ఫోన్‌ను తీసుకుని ఇంటి వెనక పెరట్లో తిరుగుతున్నాడు.