
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేయాలంటూ ప్రస్తుత అధ్యకుడు డొనాల్ట్ ట్రంప్ కుమారుడు ఎరిక్ ట్రంప్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఈ ట్వీట్‌పై నెటిజన్లు జోకులు పేల్చుతున్నారు. వివరాల్లోకి వెళితే.. మిన్సెసోటాలోని ప్రజలంతా బయటకు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎరిక్ మంగళవారం ట్వీటర్ ద్వారా పేర్కొన్నారు. అయితే అమెరికాలో ఎన్నికలు జరిగి ఫలితాలు కూడా వెలువడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎరిక్ చేసిన తాజా ట్వీట్ అతన్ని ఇరకాటంలోకి నెట్టివేసింది. ఎన్నికలు అయిపోయిన ఇన్ని రోజులకు ఎరిక్ ఓటు వేయాలని కోరడం ఏంటని కొంతమంది నెటిజన్లు నోరెళ్లపెడుతున్నారు. అయితే అమెరికాలో ఎన్నికల రోజు కూడా ఎరిక్ ప్రజలను ఓటు వేయాలని కోరుతూ ట్వీట్ శారు. ఒకవేళ సాంకేతిక లోపం కారణంగా ఆ ట్వీట్ ఇప్పడు వచ్చి ఉండవచ్చని కొందరు భావిస్తున్నారు. చదవండి: అధికార మార్పిడికి ట్రంప్ మోకాలడ్డు!
ఏదేమైనప్పటికీ ట్వీట్ చేసిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఈ పోస్టును డిలీట్ చేశారు. కానీ అప్పటికే నెటిజన్లు దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్లను తీసి తమ అకౌంట్‌లలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. కాగా ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరులో డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ విజయం సాధించిన విషయం తెలిసిందే. బరాక్ ఒబామా దగ్గర 8 ఏళ్లు ఉపాధ్యక్షుడుగా పనిచేసిన వైట్ హౌస్‌లో బైడెన్ ఇప్పుడు అధ్యక్ష పీఠం అధిష్టించడానికి సిద్ధమయ్యారు. కొత్త అధ్యక్షుడు జనవరి 20న అధికారికంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ఎన్నికల్లో ఘోర పరాజాయాన్ని ఎదుర్కొన్న డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఓటమిని జీర్ణించుకోలేని ట్రంప్ అధికార మార్పిడికి సంబంధించి బైడెన్ బృందానికి సహకరించకుండా ప్రభుత్వ యంత్రాంగాన్ని అడ్డుకోవడం తాజా పరిణామాలు. చదవండి: వైట్‌హౌస్ నుంచి వెళ్దాం: ట్రంప్‌తో భార్య మెలానియా
But of course Eric Trump scheduled an Election Day tweet for the wrong week... pic.twitter.com/a4tL0UYRm8
— Rex Chapman🏇🏼 (@RexChapman) November 10, 2020
Proof Eric Trump is Internet Explorer (yes this is real) pic.twitter.com/YiJaPl6aeN
— Bizarre Lazar 🏴☠️ (@BizarreLazar) November 11, 2020
You are a 🤡 do you know what day it is?
— Antonio Gianola (@antoniogianola) November 10, 2020
Now I am not an expert, but I think @EricTrump just told Minnesota to commit voter fraud. pic.twitter.com/5AOOxew1xn
— Kyle (@wylekolfe) November 11, 2020
Comments
Please login to add a commentAdd a comment