Eric Trump
-
వైరల్ ట్వీట్.. తప్పులో కాలేసిన ట్రంప్ కుమారుడు
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేయాలంటూ ప్రస్తుత అధ్యకుడు డొనాల్ట్ ట్రంప్ కుమారుడు ఎరిక్ ట్రంప్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఈ ట్వీట్‌పై నెటిజన్లు జోకులు పేల్చుతున్నారు. వివరాల్లోకి వెళితే.. మిన్సెసోటాలోని ప్రజలంతా బయటకు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎరిక్ మంగళవారం ట్వీటర్ ద్వారా పేర్కొన్నారు. అయితే అమెరికాలో ఎన్నికలు జరిగి ఫలితాలు కూడా వెలువడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎరిక్ చేసిన తాజా ట్వీట్ అతన్ని ఇరకాటంలోకి నెట్టివేసింది. ఎన్నికలు అయిపోయిన ఇన్ని రోజులకు ఎరిక్ ఓటు వేయాలని కోరడం ఏంటని కొంతమంది నెటిజన్లు నోరెళ్లపెడుతున్నారు. అయితే అమెరికాలో ఎన్నికల రోజు కూడా ఎరిక్ ప్రజలను ఓటు వేయాలని కోరుతూ ట్వీట్ శారు. ఒకవేళ సాంకేతిక లోపం కారణంగా ఆ ట్వీట్ ఇప్పడు వచ్చి ఉండవచ్చని కొందరు భావిస్తున్నారు. చదవండి: అధికార మార్పిడికి ట్రంప్ మోకాలడ్డు! ఏదేమైనప్పటికీ ట్వీట్ చేసిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఈ పోస్టును డిలీట్ చేశారు. కానీ అప్పటికే నెటిజన్లు దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్లను తీసి తమ అకౌంట్లలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. కాగా ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరులో డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ విజయం సాధించిన విషయం తెలిసిందే. బరాక్ ఒబామా దగ్గర 8 ఏళ్లు ఉపాధ్యక్షుడుగా పనిచేసిన వైట్ హౌస్‌లో బైడెన్ ఇప్పుడు అధ్యక్ష పీఠం అధిష్టించడానికి సిద్ధమయ్యారు. కొత్త అధ్యక్షుడు జనవరి 20న అధికారికంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ఎన్నికల్లో ఘోర పరాజాయాన్ని ఎదుర్కొన్న డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఓటమిని జీర్ణించుకోలేని ట్రంప్ అధికార మార్పిడికి సంబంధించి బైడెన్ బృందానికి సహకరించకుండా ప్రభుత్వ యంత్రాంగాన్ని అడ్డుకోవడం తాజా పరిణామాలు. చదవండి: వైట్‌హౌస్ నుంచి వెళ్దాం: ట్రంప్‌తో భార్య మెలానియా But of course Eric Trump scheduled an Election Day tweet for the wrong week... pic.twitter.com/a4tL0UYRm8 — Rex Chapman🏇🏼 (@RexChapman) November 10, 2020 Proof Eric Trump is Internet Explorer (yes this is real) pic.twitter.com/YiJaPl6aeN — Bizarre Lazar 🏴☠️ (@BizarreLazar) November 11, 2020 You are a 🤡 do you know what day it is? — Antonio Gianola (@antoniogianola) November 10, 2020 Now I am not an expert, but I think @EricTrump just told Minnesota to commit voter fraud. pic.twitter.com/5AOOxew1xn — Kyle (@wylekolfe) November 11, 2020 -
పదోసారి తాత అయిన అమెరికా అధ్యక్షుడు
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాత అయ్యారు. ఆయన కుమారుడు ఎరిక్ ట్రంప్ భార్య లారా సోమవారం రాత్రి ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఎరిక్ ట్విటర్లో పంచుకున్నాడు. ‘ఈ ప్రపంచంలోకి కరోలినా డొరొతీ ట్రంప్ ను ఆహ్వానిస్తున్నాం’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. డొరోతితో కలుపుకుని డొనాల్డ్ ట్రంప్ మనవలు, మనవరాళ్ల సంఖ్య 10కి చేరింది. ఎరిక్‌కు ఇప్పటికే ఒక బాబు ఉన్నాడు. ముగ్గురు భార్యలున్న ట్రంప్‌నకు మొత్తం ఐదుగురు పిల్లలు. వారిలో పెద్దవాళ్లైన డొనాల్డ్ జూనియర్‌కు ఐదుగురు, ఇవాంకా ట్రంప్‌నకు ముగ్గురు పిల్లలు. ట్రంప్‌నకు సంబంధించిన వ్యాపార వ్యవహారాలను ఎరిక్ చూసుకుంటారు. -
తొమ్మిదోసారి తాత అయిన ట్రంప్
న్యూయార్క్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తొమ్మిదోసారి తాతయ్య అయ్యారు. ఆయన కుమారుడు ఎరిక్ ట్రంప్, కోడలు లారా ట్రంప్‌లకు మగబిడ్డ (ఎరిక్ ల్యూక్ ట్రంప్) జన్మించాడు. ట్రంప్ ఆర్గనేజేషన్ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా స్పష్టం చేసింది. ట్రంప్ కూడా తన కొడుకు, కోడలికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు. ఎరిక్ ట్రంప్, అతడి సోదరుడు డాన్ జూనియర్లు ప్రముఖ న్యాయవాదులు మాత్రమే కాకుండా ప్రచార సమయంలో కూడా వీరు కీలకంగా వ్యవహరించారు. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ పనిచేస్తున్న నేపథ్యంలో కుటుంబ వ్యవహారాలు, వ్యాపారాలు వీరే చూసుకుంటున్నారు. లారా ట్రంప్ కూడా నాటి అధ్యక్ష ఎన్నికల్లో ప్రచారం చేశారు. ట్రంప్‌కు ఇప్పటికే ఎనిమిదిమంది మనవళ్లు మనవరాళ్లు ఉన్నారు. Congratulations to Eric & Lara on the birth of their son, Eric "Luke" Trump this morning! https://t.co/Aw0AV82XdE — Donald J. Trump (@realDonaldTrump) 12 September 2017 .@LaraLeaTrump and I are excited to announce the birth of our son, Eric "Luke" Trump at 8:50 this morning. pic.twitter.com/b8zRSktcd8 — Eric Trump (@EricTrump) 12 September 2017 -
ట్రంప్ కొడుకు చట్టాన్ని అతిక్రమించాడా?
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటింగ్‌లో పాల్గొన్న ఎరిక్ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ సుపుత్రుడు ఎరిక్ ట్రంప్, న్యూయార్క్ రాష్ట్ర చట్టాన్ని అతిక్రమించినట్టు తెలుస్తోంది. ఓటింగ్‌లో పాల్గొన్న అనంతరం ఎరిక్, తన తండ్రి పేరుకు పైన వేసిన ఓవెల్ బ్యాలెట్ ఫోటోను, ఓ ట్వీట్‌ను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ' నా తండ్రికి ఈ ఓటు ఒక అద్భుతమైన గౌరవం!, అమెరికాకు ఆయన గ్రేట్ జాబ్ నిర్వహిస్తారు'' అని ఎరిక్ ట్వీట్ చేశారు. అనంతరం ఆ పోస్టును ట్రంప్ ట్విట్టర్ అకౌంట్ నుంచి డిలీట్ చేశాడు. అయితే న్యూయార్క్ చట్టాల ప్రకారం ఓటర్లు వారు మార్క్ చేసిన బ్యాలెట్లను ఇతరులకు చూపించడం నిషేధం. ఈ చట్టాలు సోషల్ మీడియా పోస్టులకు కూడా వర్తిస్తాయని ఫెడరల్ జడ్జి గతవారమే తీర్పు కూడా ఇచ్చారు. కానీ ఎరిక్ ఆ చట్టాలను అతిక్రమించి బ్యాలెట్‌తో కూడిన ఈ ట్వీట్‌ను ట్విట్టర్ లో పోస్టు చేసినట్టు తెలుస్తోంది. ఎరిక్ ట్రంప్ ప్రతినిధులు కానీ, న్యూయార్క్ సిటీ బోర్డు ఆఫ్ ఎలక్షన్స్ కానీ దీనిపై స్పందించడం లేదు. కాగ, ఎరిక్ మంగళవారం తన ఓటు హక్కు వినియోగించుకున్నాడు. ఎన్నడూ లేనంతగా ఈ సారి అధ్యక్ష ఎన్నికల్లో అమెరికన్లు తమ ఓటు హక్కును మంగళవారం వినియోగించుకున్నారని ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి.