ట్రంప్ కొడుకు చట్టాన్ని అతిక్రమించాడా?
ట్రంప్ కొడుకు చట్టాన్ని అతిక్రమించాడా?
Published Wed, Nov 9 2016 8:34 AM | Last Updated on Sat, Aug 25 2018 7:50 PM
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటింగ్లో పాల్గొన్న ఎరిక్ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ సుపుత్రుడు ఎరిక్ ట్రంప్, న్యూయార్క్ రాష్ట్ర చట్టాన్ని అతిక్రమించినట్టు తెలుస్తోంది. ఓటింగ్లో పాల్గొన్న అనంతరం ఎరిక్, తన తండ్రి పేరుకు పైన వేసిన ఓవెల్ బ్యాలెట్ ఫోటోను, ఓ ట్వీట్ను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ' నా తండ్రికి ఈ ఓటు ఒక అద్భుతమైన గౌరవం!, అమెరికాకు ఆయన గ్రేట్ జాబ్ నిర్వహిస్తారు'' అని ఎరిక్ ట్వీట్ చేశారు. అనంతరం ఆ పోస్టును ట్రంప్ ట్విట్టర్ అకౌంట్ నుంచి డిలీట్ చేశాడు.
అయితే న్యూయార్క్ చట్టాల ప్రకారం ఓటర్లు వారు మార్క్ చేసిన బ్యాలెట్లను ఇతరులకు చూపించడం నిషేధం. ఈ చట్టాలు సోషల్ మీడియా పోస్టులకు కూడా వర్తిస్తాయని ఫెడరల్ జడ్జి గతవారమే తీర్పు కూడా ఇచ్చారు. కానీ ఎరిక్ ఆ చట్టాలను అతిక్రమించి బ్యాలెట్తో కూడిన ఈ ట్వీట్ను ట్విట్టర్ లో పోస్టు చేసినట్టు తెలుస్తోంది. ఎరిక్ ట్రంప్ ప్రతినిధులు కానీ, న్యూయార్క్ సిటీ బోర్డు ఆఫ్ ఎలక్షన్స్ కానీ దీనిపై స్పందించడం లేదు. కాగ, ఎరిక్ మంగళవారం తన ఓటు హక్కు వినియోగించుకున్నాడు. ఎన్నడూ లేనంతగా ఈ సారి అధ్యక్ష ఎన్నికల్లో అమెరికన్లు తమ ఓటు హక్కును మంగళవారం వినియోగించుకున్నారని ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి.
Advertisement
Advertisement