తొమ్మిదోసారి తాత అయిన ట్రంప్ | Donald Trump becomes granddad for 9th time | Sakshi
Sakshi News home page

తొమ్మిదోసారి తాత అయిన ట్రంప్

Published Wed, Sep 13 2017 11:18 AM | Last Updated on Sat, Aug 25 2018 7:52 PM

తొమ్మిదోసారి తాత అయిన ట్రంప్ - Sakshi

తొమ్మిదోసారి తాత అయిన ట్రంప్

న్యూయార్క్‌ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ తొమ్మిదోసారి తాతయ్య అయ్యారు. ఆయన కుమారుడు ఎరిక్‌ ట్రంప్‌, కోడలు లారా ట్రంప్‌లకు మగబిడ్డ (ఎరిక్‌ ల్యూక్‌ ట్రంప్‌) జన్మించాడు. ట్రంప్‌ ఆర్గనేజేషన్‌ ఈ విషయాన్ని ట్విట్టర్‌ ద్వారా స్పష్టం చేసింది. ట్రంప్‌ కూడా తన కొడుకు, కోడలికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్‌ చేశారు.

ఎరిక్‌ ట్రంప్‌, అతడి సోదరుడు డాన్‌ జూనియర్‌లు ప్రముఖ న్యాయవాదులు మాత్రమే కాకుండా ప్రచార సమయంలో కూడా వీరు కీలకంగా వ్యవహరించారు. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ పనిచేస్తున్న నేపథ్యంలో కుటుంబ వ్యవహారాలు, వ్యాపారాలు వీరే చూసుకుంటున్నారు. లారా ట్రంప్‌ కూడా నాటి అధ్యక్ష ఎన్నికల్లో ప్రచారం చేశారు. ట్రంప్‌కు ఇప్పటికే ఎనిమిదిమంది మనవళ్లు మనవరాళ్లు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement