Lara Trump
-
తొమ్మిదోసారి తాత అయిన ట్రంప్
న్యూయార్క్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తొమ్మిదోసారి తాతయ్య అయ్యారు. ఆయన కుమారుడు ఎరిక్ ట్రంప్, కోడలు లారా ట్రంప్‌లకు మగబిడ్డ (ఎరిక్ ల్యూక్ ట్రంప్) జన్మించాడు. ట్రంప్ ఆర్గనేజేషన్ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా స్పష్టం చేసింది. ట్రంప్ కూడా తన కొడుకు, కోడలికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు. ఎరిక్ ట్రంప్, అతడి సోదరుడు డాన్ జూనియర్లు ప్రముఖ న్యాయవాదులు మాత్రమే కాకుండా ప్రచార సమయంలో కూడా వీరు కీలకంగా వ్యవహరించారు. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ పనిచేస్తున్న నేపథ్యంలో కుటుంబ వ్యవహారాలు, వ్యాపారాలు వీరే చూసుకుంటున్నారు. లారా ట్రంప్ కూడా నాటి అధ్యక్ష ఎన్నికల్లో ప్రచారం చేశారు. ట్రంప్‌కు ఇప్పటికే ఎనిమిదిమంది మనవళ్లు మనవరాళ్లు ఉన్నారు. Congratulations to Eric & Lara on the birth of their son, Eric "Luke" Trump this morning! https://t.co/Aw0AV82XdE — Donald J. Trump (@realDonaldTrump) 12 September 2017 .@LaraLeaTrump and I are excited to announce the birth of our son, Eric "Luke" Trump at 8:50 this morning. pic.twitter.com/b8zRSktcd8 — Eric Trump (@EricTrump) 12 September 2017 -
తెరపైకి ట్రంప్ కోడలు
ఆష్ బర్న్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారతీయ అమెరికన్లు హిల్లరీ క్లింటన్ వైపే మొగ్గుచూపుతున్నారని వార్తలు వచ్చిన నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్... ఇండియన్-అమెరికన్ కమ్యూనిటీని తనవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందుకోసం తన కుటుంబ సభ్యులను రంగంలోకి దింపారు. వర్జీనియాలోని లాడన్ కౌంటీలో రాజధాని హిందూ దేవాలయంలో జరిగిన దీపావళి వేడుకల్లో ట్రంప్ కోడలు లారా పాల్గొన్నారు. పనిలో పనిగా తన మామగారికి ఓటు వేయాలని ప్రవాస భారతీయులను అభ్యర్థించారు. ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైతే భారత్- అమెరికా సంబంధాలు మరింత బలోపేతమవుతాయని అన్నారు. భారతదేశం అన్నా, భారతీయులన్నా తన మామగారికి ఎంతో అభిమానమని చెప్పారు. భారతీయ సంస్కృతిని తాను ఎంతోగానే గౌరవిస్తానని పేర్కొంటూ చెప్పులు బయట విడిచిపెట్టి ఆమె ఆలయంలోకి ప్రవేశించారు. హిందూ సాంప్రదాయాలు అంటే తనకెంతో ఇష్టమని ట్రంప్ రెండో కుమారుడు ఎరిక్ భార్య అయిన లారా చెప్పారు. ట్రంప్ కుమార్తె ఇవాంకా ఇక్కడికి రావాల్సివుంది. అయితే ఆమె వేరే చోటికి వెళ్లాల్సిరావడంతో లారా ఈ వేడుకలకు హాజరయ్యారు. అమెరికా అధ్యక్ష అభ్యర్థులకు చెందిన కుటుంబంలోని సభ్యురాలు హిందూ ఆలయానికి రావడం ఇదే మొదటిసారని చెబుతున్నారు. లారాకు ప్రవాస భారతీయ సంఘం నేత రాజేశ్ గూటి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... స్థానికులతో మమేకం అయేందుకు పండుగలు దోహం చేస్తాయని పేర్కొన్నారు.