భర్తను హతమార్చి తప్పించుకోవడానికి మరో హత్య | A Woman Murdered Lookalike For Escape From Husband Murder Case | Sakshi
Sakshi News home page

56 ఏళ్ల వయస్సులో మహిళ ఘాతుకం

Published Tue, Apr 17 2018 11:19 AM | Last Updated on Mon, Jul 30 2018 8:41 PM

A Woman Murdered Lookalike For Escape From Husband Murder Case - Sakshi

పమేలా హచిన్సన్‌, లోయిస్‌ రైస్‌

ఫ్లోరిడా : 56 ఏళ్ల వయస్సులో ఓ మహిళ పాల్పడిన ఘాతుకం చూస్తుంటే మనుషులు ఇలా కూడా ఆలోచిస్తారా అనే అనుమానం కలుగుతుంది. సినిమాల్లోలాగా తన ఐడెండిటిని మార్చుకోవడం కోసం ఆమె తన పోలికలతో ఉన్న మరో మహిళని చంపేసింది. వివరాల్లోకి వెళ్తే..  మిన్నెసోటాకు చెందిన లోయిస్ రైస్‌, డేవిడ్‌లకు ముగ్గురు పిల్లలు. గత నెలలో వీరు కనబడకపోవడంతో సన్నిహితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన అధికారులు ఫామ్‌హౌస్‌లో డేవిడ్‌ మృతదేహాన్ని గుర్తించారు. జూదానికి బానిసైన అతని భార్యే హత్య చేసినట్టు అనుమానించారు. ఆమె ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. కానీ లాభం లేకపోవడంతో ఫేస్‌బుక్‌ ద్వారా లోయిస్ గురించి తెలిస్తే సమాచారం ఇవ్వాల్సిందిగా ప్రజలను కోరారు.

సీన్‌ కట్‌ చేస్తే ఫ్లోరిడా స్టేట్‌లోని లీ కౌంటిలో తన పొలికలతో ఉన్న పమేలా హచిన్సన్‌తో స్నేహన్ని పెంచుకున్న లోయిస్‌ ఆమె ఐడెండిటిని తనదిగా చేసుకోవడానికి ప్రయత్నించింది. అందులో భాగంగా ఆదివారం రాత్రి పమేలాను హతమార్చింది. ఆమె పర్స్‌తో పాటు, ఇతర విలువైన వస్తువులను తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీనిపై దర్యాప్తు జరుపుతున్న ఓ అధికారి మాట్లాడుతూ.. నా జీవితంలో ఈ రకమైన హత్యను చూడలేదన్నారు. లోయిస్ చిరునవ్వు చూసిన వారెవరైనా ఆమె మృదు స్వభావం కలదని అనుకుంటారని,  కానీ  లోయిస్ రైస్‌ పెద్ద నయ వంచకురాలని అభిప్రాయపడ్డారు‌. తన భర్త హత్య కేసులో నిందితురాలిగా ఉన్న లోయిస్‌, పమేలా హచిన్సన్‌లా మారడానికే ఈ హత్య చేసింది.. ఆమె కోసం దేశవ్యాప్తంగా గాలింపు చేపట్టామని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement