క్లాస్‌మేట్‌ను 114 సార్లు పొడిచాడు | Tristyn Bailey was stabbed 114 times in an unspeakable murder | Sakshi
Sakshi News home page

క్లాస్‌మేట్‌ను 114 సార్లు పొడిచాడు

Published Sun, Mar 26 2023 4:46 AM | Last Updated on Sun, Mar 26 2023 4:46 AM

Tristyn Bailey was stabbed 114 times in an unspeakable murder - Sakshi

ఫ్లోరిడా: అమెరికాలో ఫ్లోరిడా రాష్ట్రం జాక్సన్‌విల్లేకు చెందిన అయ్‌డెన్‌ ఫుస్సి అనే 13 ఏళ్ల బాలుడు తోటి విద్యార్థినిని అతి దారుణంగా పొట్టన పెట్టుకున్నాడు. ఏకంగా 114 సార్లు పొడిచి చంపాడు! అకారణంగా ఈ అమానుషానికి పాల్పడ్డ బాలునికి కోర్టు 40 ఏళ్ల జీవిత ఖైదు విధించింది. ఈ ఘటన 2021లో జరిగింది. తన క్లాస్‌మేట్, చీర్‌ లీడర్‌ అయిన ట్రిస్టిన్‌ బైలీ (13)ని ఫుస్సి సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి పొట్టన పెట్టుకున్నాడు. కేవలం ఎవరో ఒకరిని చంపాలనే ఉద్దేశంతోనే, ముందస్తు ప్రణాళిక ప్రకారమే అతనీ దారుణానికి ఒడిగట్టినట్లు జడ్జి చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement