life imprissionment
-
క్లాస్‌మేట్‌ను 114 సార్లు పొడిచాడు
ఫ్లోరిడా: అమెరికాలో ఫ్లోరిడా రాష్ట్రం జాక్సన్విల్లేకు చెందిన అయ్డెన్ ఫుస్సి అనే 13 ఏళ్ల బాలుడు తోటి విద్యార్థినిని అతి దారుణంగా పొట్టన పెట్టుకున్నాడు. ఏకంగా 114 సార్లు పొడిచి చంపాడు! అకారణంగా ఈ అమానుషానికి పాల్పడ్డ బాలునికి కోర్టు 40 ఏళ్ల జీవిత ఖైదు విధించింది. ఈ ఘటన 2021లో జరిగింది. తన క్లాస్మేట్, చీర్ లీడర్ అయిన ట్రిస్టిన్ బైలీ (13)ని ఫుస్సి సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి పొట్టన పెట్టుకున్నాడు. కేవలం ఎవరో ఒకరిని చంపాలనే ఉద్దేశంతోనే, ముందస్తు ప్రణాళిక ప్రకారమే అతనీ దారుణానికి ఒడిగట్టినట్లు జడ్జి చెప్పారు. -
జీవిత ఖైదీ ఆత్మహత్య
సంగారెడ్డి రూరల్: జిల్లా జైలు ఆవరణలో జీవిత ఖైదీ చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సంగారెడ్డి రూరల్ ఎస్సై శివలింగం కథనం ప్రకారం.. మెదక్ జిల్లా ఝరాసంగం మండలం కప్పాడుకు చెందిన మొగులయ్య (50)కు సొంత కూతురిపై అత్యాచారం చేసిన నేరంపై 2006లో జీవిత ఖైదు విధించారు. 2015 జూన్ వరకు చర్లపల్లి జైలులో ఉన్న మొగులయ్యను జులైలో కందిలోని జిల్లా జైలుకు తరలించారు. నెల క్రితం మొగులయ్య పెరోల్‌పై బయటకు వచ్చాడు. ఆదివారం తిరిగి జైలుకు రావాల్సి ఉంది. ఈ క్రమంలో సోమవారం ఉదయం జిల్లా జైలు ఆవరణలో గల చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని సోదరుడు ఏసయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.