బాయ్‌ఫ్రెండ్‌ను సూట్‌కేసులో పెట్టి తాళం.. | Woman Leaves Boyfriend To Die In Suitcase In Florida | Sakshi
Sakshi News home page

బాయ్‌ఫ్రెండ్‌ను సూట్‌కేసులో పెట్టి తాళం వేసింది

Published Fri, Feb 28 2020 11:02 AM | Last Updated on Fri, Feb 28 2020 11:49 AM

Woman Leaves Boyfriend To Die In Suitcase In Florida - Sakshi

ఫ్లోరిడా : తన బాయ్‌ఫ్రెండ్‌ను సరదాగా ఆట పట్టిద్దామనుకొన్న ఒక మహిళ కటకటాలపాలైన ఘటన ఫ్లోరిడా నగరంలో చోటుచేసుకుంది. వివరాలు.. సారా బూన్‌ అనే మహిళ తన బాయ్‌ఫ్రెండ్‌ జార్జ్ టోర్రెస్ జూనియర్‌తో కలిసి ఫ్లోరిడా నగరంలో నివసిస్తున్నారు. గత సోమవారం ఇంట్లోనే ఉన్న వీరిద్దరు సరదాగా మద్యం సేవించారు. అనంతరం హైడ్‌ అండ్‌ సీక్‌ పేరుతో సారా బూన్‌ తన బాయ్‌ఫ్రెండ్‌ జార్జ్‌ను సూట్‌కేసులో పెట్టి జిప్‌కు తాళం వేసింది. 'ఈ సూట్‌కేసులో ఎక్కువ సేపు ఉండలేను.. ప్లీజ్‌ నన్ను బయటికి రానివ్వు' అని జార్జ్‌ ఎంత వేడుకున్న బూన్‌ పట్టించుకోకుండా తన గదిలోకి వెళ్లిపోయింది. దీంతో రాత్రంతా సూట్‌కేసులోనే ఉండిపోవడంతో జార్జ్‌ ఊపిరాడక చనిపోయాడు. మరుసటి రోజు బూన్‌ కిందకు వచ్చి సూట్‌కేస్‌ తెరిచి చూడడంతో జార్జ్‌ అప్పటికే మృతి చెందడంతో ఆమె షాక్‌కు గురైంది. దీంతో బూన్‌ పోలీసులకు ఫోన్‌ చేయడంతో వెంటనే ఘటనా స్థలికి చేరుకొని బూన్‌ను కస్టడీలోకి తీసుకున్నారు.

'మేము మద్యం తాగిన అనంతరం సరదాగా ఉంటుందని హైడ్‌ అండ్‌ సీక్‌ గేమ్‌ ఆడుదామని జార్జ్‌ను అడిగాను. అందుకు  జార్జ్‌ ఒప్పుకోవడంతో అతన్ని సూట్‌కేసులో ఉంచి దానికి తాళం వేసి నా గదిలోకి వెళ్లిపోయాను. నాకు ఊపిరి ఆడడం లేదు.. బయటికి తీయాలని జార్జ్‌ వేడుకున్నా..  మద్యం మత్తులో నేను పట్టించుకోలేదు' అని పోలీసులకు వివరించింది. అయితే బూన్‌ ఫోన్‌లో రికార్డయిన స్టేట్‌మెంట్‌ మాత్రం ఆమె చెప్పిన దానికి పొంతన లేకుండా ఉందని పోలీసులు పేర్కొన్నారు. ఆ స్టేట్‌మెంట్‌లో జార్జ్‌ బూన్‌ను... తనను సూట్‌కేసు నుంచి బయటికి తీయమని అడిగినప్పుడు.. బూన్‌ పెద్దగా నవ్వుతూ.. 'నువ్వు నన్ను మోసం చేసినప్పుడు నాకు కూడా ఇలాంటి ఫీలింగే కలిగిందని' ఫోన్‌లో రికార్డయి ఉంది. బూన్‌ కావాలనే జార్జ్‌ను చంపిందా అన్న కోణంలో విచారణ జరుపుతున్నామని పోలీసులు వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement