hide and seek
-
పత్తిలో దాక్కుని.. ఊపిరందక..
కౌటాల: దాగుడుమూతలు ఆట ఓ బాలుడి ప్రాణం తీసింది. తమ్ముడు, చెల్లికి దొరక్కుండా పత్తిలో దాక్కునే ప్రయత్నంలో ఊపిరి ఆగిపోయింది. ఈ సంఘటన కుమురంభీం జిల్లా కౌటాల మండలం కన్నెపల్లిలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. కన్నెపల్లికి చెందిన చెన్నూరి కైలాష్, రుమలకు ముగ్గు రు సంతానం అభిషేక్, హర్షిత్, అవంతిక ఉన్నారు. అభిషేక్ (12) కౌటాలలోని ప్రైవేటు పాఠశాల్లో 4వ తరగతి చదువుతున్నాడు. తల్లిదండ్రులు కౌటాల వారసంతలో కూరగాయలు విక్రయించడానికి వెళ్లారు. పాఠశాల ముగిసిన తర్వాత ఇంటికి వచ్చిన అభిషేక్ తమ్ముడు, చెల్లితో దాగుడుమూతలు ఆడుతూ ఇంట్లో నిల్వ ఉంచిన పత్తిలో దాక్కునే ప్రయత్నం చేశాడు. దీంతో ఊపిరాడక అపస్మారక స్థితికి చేరాడు. ఇంట్లోకి వచ్చిన హర్షిత్ పత్తిలో తన అన్న తలదూర్చి కాళ్లు పైకి ఉండటం గమనించాడు. భయపడి కేకలు వేయడంతో బంధువులు వచ్చి బయటకు తీశారు. కౌటాలలోని ప్రైవేటు ఆస్పత్రి వైద్యుల సూ చన మేరకు కుటుంబ సభ్యులు కాగజ్‌నగర్‌కు తరలించారు. అప్పటికే అభిషేక్ మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. -
తార్ మార్ తక్కర్ మార్.. చివరికి భలే ట్విస్ట్
ప్రాణి ప్రపంచం వాటి మనుగడ పోరాటాన్ని మాత్రమే కాదు అప్పుడప్పుడు సరదాను కూడా మానవాళికి పంచుతుంటుంది. అలాంటి వీడియోనే ఒకటి విపరీతంగా వైరల్ అవుతోంది. ఆకలితో ఉన్న ఓ పులి.. నీల్గై (బ్లూబక్)ను చూసి వేటాడాలనుకుంది. దాడి చేసే క్రమంలో నెమ్మదిగా ముందుకు కదిలింది. సరిగ్గా.. ఆ నీలిజింక తలెత్తి చూసే సమయానికి కిందకు వంగుని దాగుడు మూతలు ఆడింది. చివరికి.. ఆ రెండింటి మధ్య జరిగిన తార్ మార్ తక్కర్ మార్ ఫలితం ఏంటో మీరూ చూసేయండి. Hide and seek! It began when she saw the #Nilgai at about 80m. Interestingly, the #tiger had all the grass to hide, but she continued to blend with the road without cover. #SatpuraNationalPark #Hunting #predator #SavetTiger #TigerTales @NatureIn_Focus @RGSustain1 @conserve_ind pic.twitter.com/qMbK1fOhXG — Rajesh Sanap (@RajeshVS87) November 6, 2022 మధ్యప్రదేశ్ సాత్పురా నేషనల్ పార్క్‌లో ఈ ఘటన జరిగిందని రాజేష్ సనాప్ అనే వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్ వీడియోను పోస్ట్ చేశారు. విపరీతమైన లైకులు, వ్యూస్‌తో దూసుకుపోతోంది ఆ వీడియో. సరదా కామెంట్లు మాత్రమే కాదు.. ఈ వీడియోపై సీరియస్ కోణంలోనూ కామెంట్లు కనిపిస్తున్నాయి. ఇదీ చూసేయండి: రైళ్లలో కొందరు ఛాయ్ ఎలా వేడి చేస్తారో తెలుసా? -
దాగుడుమూతలు ఆడుతూ.. లిఫ్ట్ ప్రమాదంలో బాలిక మృతి
ముంబై: దాగుడుమూతల ఆట ఆడుతూ 16 ఏళ్ల బాలిక మృతి చెందింది. ఈ ఘటన ముంబైలోని మన్‌ఖుర్డ్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం....16 ఏళ్ల రేష్మా ఖారవి తన అమ్మమ్మ ఇంటికి వచ్చింది. అక్కడ స్నేహితులతో దాగుడు మూతల ఆట ఆడుతోంది. ఆ ఆటలో భాగంగా స్నేహితులను వెతికే క్రమంలో ఆ లిఫ్ట్ ఎలివేటర్ వద్ద ఉన్న కిటికిలో తల పెట్టింది. ఇంతలో అనుహ్యంగా లిఫ్ట్ కిందకు రావడంతో ఆమె తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందింది. ఇదంతా హౌసింగ్ సోసైటి నిర్లక్ష్యం వల్లే జరిగిందంటూ బాలిక తండ్రి రవి ఖర్వి ఆందోళన చేశారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా లిఫ్ట్ ఓపెనింగ్‌ని అద్దాలతో కవర్ చేయాలని అన్నారు. ఈ మేరకు పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని లిఫ్ట్ పాడై ఉన్నట్లు గుర్తించారు. యంత్రాల లోపం కారణంగానే ఇలా అకస్మాత్తుగా కిందకు వెళ్లినట్లు చెప్పారు. బాధితుడి తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి హౌసింగ్ చైర్మన్‌ని, సెక్రటరీని అరెస్టు చేసినట్లు తెలిపారు. బాధితురాలి కుటుంబం సాథే నగరంలో ఉంటారని, ఆమె దీపావళి సందర్భంగా మన్‌ఖుర్డ్‌లో హౌసింగ్ సోసైటి ఐదో అంతస్థులో ఉంటున్న అమ్మమ్మ ఇంటికి వచ్చినప్పుడూ ఈ దుర్ఘటన చోటు చేసుకున్నట్లు పోలీఉలు వెల్లడించారు. (చదవండి: పనిమనిషితో సహా జంట అనుమానాస్పద మృతి..కానీ రెండేళ్ల చిన్నారి....) -
వైరల్‌గా మారిన బాతు, పిల్లల దాగుడుమూతల వీడియో
చిన్నపిల్లలు దాగుడుమూతలు ఆడటం మనం చూసుంటాం. కాకపోతే ఈ వీడియోను చూస్తే మాత్రం.. ఈ ఆట కేవలం మనుషులకు మాత్రమే కాదు, బాతులు కూడా ఆడుకుంటాయా? అనిపిస్తుంది. అలాంటి ఫన్నీ వీడియోను ఓ ట్విటర్ ఖాతాదారుడు షేర్ చేయగా నెట్టింట హల్ చల్ చేస్తోంది. జంతువుల ఆటలు, సరదాగా చేసిన పనుల వీడియోలు ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ బాతు, తన పిల్లల వీడియో విషయానికి వస్తే.. 24 సెకన్ల నిడివ గల ఈ వీడియోలో.. నీటి కొలనులో ఉన్న బాతు పిల్లలు తన తల్లి దగ్గరికి వెళ్తుంటాయ్. అవి అలా దగ్గరకు వెళ్లిన ప్రతీసారి తల్లి బాతు తన పిల్లలకు కనపడకుండా నీటిలో మునిగి దాక్కుంటోంది. ఇలా మూడు సార్లు తన పిల్లలతో ఆ తల్లి బాతు ఆటలాడుతుంది. చూడటానికి అచ్చం మన పిల్లలు ఆడే హైడ్ అండ్ సీక్ లానే ఉన్న ఈ సరదా వీడిలో చాలా ఫన్నీగా ఉండడంతో సోషల్ మీడియా యూజర్లకు వీపరీతంగా నచ్చేసింది. భారీ సంఖ్యలో వ్యూస్, లైక్స్‌తో దూసుకుపోతోంది. తన పిల్లలకు నీటిలో ఎలా మునగాలో తల్లి ట్రైనింగ్ ఇస్తుందని కొందరు, మనషుల నుంచి ఎలా తప్పించుకోవాలో తర్ఫీదునిస్తోందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. మాతృ దేవో భవ.. తల్లే తొలి గురువు అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. Mommy playing seek and hide.. 😅 pic.twitter.com/ewWivaghfa — Buitengebieden (@buitengebieden_) June 29, 2021 చదవండి: మనుషుల కంటె ఏనుగులే నయం.. వైరల్ వీడియో.. -
లాక్డౌన్: వాషింగ్ మెషీన్లో దాక్కున్న యువతి
లాక్డౌన్ సమయంలో ఓ యువతి నిజంగానే లాక్ అయిపోయింది. అది కూడా వాషింగ్మెషీన్లో. వినడానికి విడ్డూరంగా ఉన్న ఇదే జరిగింది. వివరాల్లోకి వెళితే.. అమెరికాలో లాక్డౌన్ అమల్లో ఉన్న విషయం తెలిసిందే. ఇంట్లో ఖాళీగా కూర్చుంటే బోర్ కొడుతుందని పద్దెనిమిదేళ్ల అమరీ డాన్సీ అనే అమ్మాయి తన సోదరీమణులలతో కలిసి దాగుడు మూతలు (హైడ్ అండ్ సీక్) ఆడింది. అయితే దాక్కోవడానికి ఇంట్లో ఎక్కడా చోటే లేనట్టు వాషింగ్ మెషీన్‌లోకి దూరడానికి ప్రయత్నించింది. ఇరుకుగా ఉన్నప్పటికీ అదేదీ పట్టించుకోకుండా ఎలాగోలా దూరేసింది. అప్పుడే అసలు కథ మొదలైంది. వెళ్లడమైతే వెళ్లింది కానీ బయటకు మాత్రం రాలేకపోయింది. తన శక్తినంతా కూడదీసుకున్నా ఫలితం లేకపోయింది. (సర్ప్రైజ్ సూపర్!.. ఆ అట్టపెట్టెలో ఏముందంటే..) ఇది గమనించిన ఆమె సోదరి ఇంట్లోవాళ్లకు విషయం చెప్పింది. అయితే ఆమెను ఎలా రక్షించాలో ఎవరికీ అర్థం కాకపోపవడంతో ఎమర్జెన్సీ నంబర్‌కు డయల్ చేశారు. వెంటనే రెస్క్యూ సిబ్బంది ముఖానికి మాస్కులతో ఆమె ఇంటిని చేరుకున్నారు. నానా రకాలుగా ప్రయత్నించి సురక్షితంగా ఆమెను బయటకు తీశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ విషయం గురించి మాట్లాడుతూ.. అప్పటికే అన్ని చోట్లా దాక్కున్నాం. కాబట్టి ఈసారి కొత్త చోటు వెతుక్కుందామని వాషింగ్ మెషీన్‌లోకి దూరానని చెప్పుకొచ్చింది. కానీ నేను బయటికి వస్తానో లేదోనని భయంతో చచ్చిపోయానని పేర్కొంది. (టిక్‌టాక్ వీడియోకు లైక్స్ రాలేదని..) -
బాయ్‌ఫ్రెండ్‌ను సూట్‌కేసులో పెట్టి తాళం వేసింది
-
బాయ్‌ఫ్రెండ్‌ను సూట్‌కేసులో పెట్టి తాళం..
ఫ్లోరిడా : తన బాయ్‌ఫ్రెండ్‌ను సరదాగా ఆట పట్టిద్దామనుకొన్న ఒక మహిళ కటకటాలపాలైన ఘటన ఫ్లోరిడా నగరంలో చోటుచేసుకుంది. వివరాలు.. సారా బూన్ అనే మహిళ తన బాయ్‌ఫ్రెండ్ జార్జ్ టోర్రెస్ జూనియర్‌తో కలిసి ఫ్లోరిడా నగరంలో నివసిస్తున్నారు. గత సోమవారం ఇంట్లోనే ఉన్న వీరిద్దరు సరదాగా మద్యం సేవించారు. అనంతరం హైడ్ అండ్ సీక్ పేరుతో సారా బూన్ తన బాయ్‌ఫ్రెండ్ జార్జ్‌ను సూట్‌కేసులో పెట్టి జిప్కు తాళం వేసింది. 'ఈ సూట్‌కేసులో ఎక్కువ సేపు ఉండలేను.. ప్లీజ్ నన్ను బయటికి రానివ్వు' అని జార్జ్ ఎంత వేడుకున్న బూన్ పట్టించుకోకుండా తన గదిలోకి వెళ్లిపోయింది. దీంతో రాత్రంతా సూట్‌కేసులోనే ఉండిపోవడంతో జార్జ్ ఊపిరాడక చనిపోయాడు. మరుసటి రోజు బూన్ కిందకు వచ్చి సూట్‌కేస్ తెరిచి చూడడంతో జార్జ్ అప్పటికే మృతి చెందడంతో ఆమె షాక్‌కు గురైంది. దీంతో బూన్ పోలీసులకు ఫోన్ చేయడంతో వెంటనే ఘటనా స్థలికి చేరుకొని బూన్‌ను కస్టడీలోకి తీసుకున్నారు. 'మేము మద్యం తాగిన అనంతరం సరదాగా ఉంటుందని హైడ్ అండ్ సీక్ గేమ్ ఆడుదామని జార్జ్‌ను అడిగాను. అందుకు జార్జ్ ఒప్పుకోవడంతో అతన్ని సూట్‌కేసులో ఉంచి దానికి తాళం వేసి నా గదిలోకి వెళ్లిపోయాను. నాకు ఊపిరి ఆడడం లేదు.. బయటికి తీయాలని జార్జ్ వేడుకున్నా.. మద్యం మత్తులో నేను పట్టించుకోలేదు' అని పోలీసులకు వివరించింది. అయితే బూన్ ఫోన్లో రికార్డయిన స్టేట్మెంట్ మాత్రం ఆమె చెప్పిన దానికి పొంతన లేకుండా ఉందని పోలీసులు పేర్కొన్నారు. ఆ స్టేట్మెంట్లో జార్జ్ బూన్‌ను... తనను సూట్‌కేసు నుంచి బయటికి తీయమని అడిగినప్పుడు.. బూన్ పెద్దగా నవ్వుతూ.. 'నువ్వు నన్ను మోసం చేసినప్పుడు నాకు కూడా ఇలాంటి ఫీలింగే కలిగిందని' ఫోన్లో రికార్డయి ఉంది. బూన్ కావాలనే జార్జ్‌ను చంపిందా అన్న కోణంలో విచారణ జరుపుతున్నామని పోలీసులు వెల్లడించారు. -
దొంగతనం జరిగినట్టు ఫోన్ కాల్ : వెళ్లి చూస్తే అవాక్కు
లండన్ : బ్యాంక్‌లో దొంగతనం జరిగినట్లు పోలీసులకు ఫోన్ వచ్చింది. సిబ్బందిని తీసుకుని హాడావుడిగా వెళ్లిన పోలీసులకు అక్కడ జరుగుతున్న తంతు చూసి ఆశ్చర్యంతో నోట మాట రాలేదు. కారణం దొంగతనం జరిగిందని భావించిన పోలీసులకు బ్యాంక్ సిబ్బంది దొంగాపోలీస్(హైడ్ అండ్ సీక్) ఆట ఆడుతూ కనిపించి షాక్ ఇచ్చారు. ఈ సంఘటన బర్మింగ్‌హామ్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాట్‌వెస్ట్ బ్యాంక్ అధికారులు సిబ్బందిలో ఉత్సాహం పెంచడం కోసం సరదగా దొంగాపోలీస్ ఆట ఆడిపించారు. ఆటలో భాగంగా సిబ్బంది కాస్తా అలారమ్ మోగించారు. ఇది విన్న ఓ స్థానికుడు బ్యాంక్‌లో దొంగతనం జరిగిందని భావించి పోలీసులకు ఫోన్ చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఆదరబాదరగా బ్యాంక్ వద్దకు వచ్చారు. దొంగతనం గురించి ఆరా తీయగా అసలు విషయం బయటకు వచ్చింది. ఈ సంఘటన గురించి పోలీసు అధికారి ఒకరు తన ట్విటర్లో తెలియజేశారు. అంతేకాక తమకు ఫోన్ చేసిన వ్యక్తికి కృతజ్ఞతలు కూడా తెలిపారు. -
అన్నపై మూడేళ్ల చిన్నారి కాల్పులు!
కాలిఫోర్నియా: అప్పటివరకూ ఆటల్లో మునిగితేలుతున్న ఓ మూడు సంవర్సరాల చిన్నారి తన సోదరుడిని కాల్చేశాడు. ఈ కాల్పుల్లో 15 ఏళ్ల యువకుడి పాదంలోకి బుల్లెట్ దూసుకెళ్లి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన శనివారం రాత్రి కాలిఫోర్నియాలో చోటుచేసుకుంది. స్టాక్టన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మూడు సంవత్సరాలున్న ఓ బాబు వరుసకు సోదరడయ్యే బాలుడు(15)తో కలిసి దాగుడుమూతల(హైడ్ అండ్ సీక్) ఆట ఆడుతున్నాడు. ఇందులో భాగంగా బెడ్ రూమ్‌లోకి బాబు వెళ్లాడు. అక్కడ ఆ చిన్నారికి గన్ దొరకగా, పొరపాటుగా తన అన్నను కాల్చేశాడు. చిన్నారి పొరపాటున కాల్చేశాడా.. లేక ఎవరైనా కాల్పులు జరిపారా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ గన్ వారి చిన్నాన్న వాడుతుండేవాడని దర్యాప్తు అధికారులు కనుగొన్నారు. శాన్ బెర్నార్డినోలో ఓ జంట కాల్పులు జరిపి 14 మందిని పొట్టనపెట్టుకుని వారం గడవకముందే మరోసారి కాల్పుల ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. ఈ ఘటనకు సంబంధించి వారిద్దరి తల్లిదండ్రులూ దర్యాప్తులో తమకు సహకరిస్తున్నారని పూర్తి వివరాల కోసం ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు వివరించారు. గాయపడిన బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని చెప్పారు.