
ప్రమాదానికి కారణమైన పత్తి, అభిషేక్(ఫైల్)
కౌటాల: దాగుడుమూతలు ఆట ఓ బాలుడి ప్రాణం తీసింది. తమ్ముడు, చెల్లికి దొరక్కుండా పత్తిలో దాక్కునే ప్రయత్నంలో ఊపిరి ఆగిపోయింది. ఈ సంఘటన కుమురంభీం జిల్లా కౌటాల మండలం కన్నెపల్లిలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. కన్నెపల్లికి చెందిన చెన్నూరి కైలాష్, రుమలకు ముగ్గు రు సంతానం అభిషేక్, హర్షిత్, అవంతిక ఉన్నారు. అభిషేక్ (12) కౌటాలలోని ప్రైవేటు పాఠశాల్లో 4వ తరగతి చదువుతున్నాడు.
తల్లిదండ్రులు కౌటాల వారసంతలో కూరగాయలు విక్రయించడానికి వెళ్లారు. పాఠశాల ముగిసిన తర్వాత ఇంటికి వచ్చిన అభిషేక్ తమ్ముడు, చెల్లితో దాగుడుమూతలు ఆడుతూ ఇంట్లో నిల్వ ఉంచిన పత్తిలో దాక్కునే ప్రయత్నం చేశాడు. దీంతో ఊపిరాడక అపస్మారక స్థితికి చేరాడు. ఇంట్లోకి వచ్చిన హర్షిత్ పత్తిలో తన అన్న తలదూర్చి కాళ్లు పైకి ఉండటం గమనించాడు. భయపడి కేకలు వేయడంతో బంధువులు వచ్చి బయటకు తీశారు. కౌటాలలోని ప్రైవేటు ఆస్పత్రి వైద్యుల సూ చన మేరకు కుటుంబ సభ్యులు కాగజ్‌నగర్‌కు తరలించారు. అప్పటికే అభిషేక్ మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
Comments
Please login to add a commentAdd a comment