లాక్‌డౌన్: వాషింగ్ మెషీన్‌లో దాక్కున్న యువ‌తి | Teen Stuck In Washing Machine Over Playing Hide And Seek | Sakshi
Sakshi News home page

వాషింగ్ మెషీన్‌లో యువ‌తి, ర‌క్షించిన‌ రెస్క్యూ సిబ్బంది

Published Thu, Apr 23 2020 12:44 PM | Last Updated on Thu, Apr 23 2020 1:05 PM

Teen Stuck In Washing Machine Over Playing Hide And Seek - Sakshi

లాక్‌డౌన్ స‌మ‌యంలో ఓ యువ‌తి నిజంగానే లాక్ అయిపోయింది. అది కూడా వాషింగ్‌మెషీన్‌లో. విన‌డానికి విడ్డూరంగా ఉన్న ఇదే జ‌రిగింది. వివ‌రాల్లోకి వెళితే.. అమెరికాలో లాక్‌డౌన్‌ అమల్లో ఉన్న విష‌యం తెలిసిందే. ఇంట్లో ఖాళీగా కూర్చుంటే బోర్ కొడుతుంద‌ని ప‌ద్దెనిమిదేళ్ల అమ‌రీ డాన్సీ అనే అమ్మాయి త‌న సోద‌రీమ‌ణుల‌లతో క‌లిసి దాగుడు మూత‌లు (హైడ్ అండ్ సీక్) ఆడింది. అయితే దాక్కోవ‌డానికి ఇంట్లో ఎక్క‌డా చోటే లేన‌ట్టు వాషింగ్ మెషీన్‌లోకి దూర‌డానికి ప్ర‌య‌త్నించింది. ఇరుకుగా ఉన్న‌ప్ప‌టికీ అదేదీ ప‌ట్టించుకోకుండా ఎలాగోలా దూరేసింది. అప్పుడే అస‌లు క‌థ మొద‌లైంది. వెళ్ల‌డ‌మైతే వెళ్లింది కానీ బయ‌ట‌కు మాత్రం రాలేక‌పోయింది. త‌న శక్తినంతా కూడ‌దీసుకున్నా ఫ‌లితం లేక‌పోయింది. (సర్‌ప్రైజ్‌ సూపర్‌!.. ఆ అట్టపెట్టెలో ఏముందంటే..)

ఇది గ‌మ‌నించిన ఆమె సోద‌రి ఇంట్లోవాళ్ల‌కు విష‌యం చెప్పింది. అయితే ఆమెను ఎలా ర‌క్షించాలో ఎవ‌రికీ అర్థం కాక‌పోప‌వ‌డంతో ఎమ‌ర్జెన్సీ నంబ‌ర్‌కు డ‌య‌ల్ చేశారు. వెంట‌నే రెస్క్యూ సిబ్బంది ముఖానికి మాస్కుల‌తో ఆమె ఇంటిని చేరుకున్నారు. నానా ర‌కాలుగా ప్ర‌య‌త్నించి సుర‌క్షితంగా ఆమెను బ‌య‌ట‌కు తీశారు. దీనికి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.  ఈ విష‌యం గురించి మాట్లాడుతూ.. అప్ప‌టికే అన్ని చోట్లా దాక్కున్నాం. కాబ‌ట్టి ఈసారి కొత్త చోటు వెతుక్కుందామ‌ని వాషింగ్ మెషీన్‌లోకి దూరాన‌ని చెప్పుకొచ్చింది. కానీ నేను బ‌య‌టికి వ‌స్తానో లేదోన‌ని భ‌యంతో చ‌చ్చిపోయాన‌ని పేర్కొంది. (టిక్‌టాక్‌ వీడియోకు లైక్స్‌ రాలేదని..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement