
ముంబై: దాగుడుమూతల ఆట ఆడుతూ 16 ఏళ్ల బాలిక మృతి చెందింది. ఈ ఘటన ముంబైలోని మన్‌ఖుర్డ్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం....16 ఏళ్ల రేష్మా ఖారవి తన అమ్మమ్మ ఇంటికి వచ్చింది. అక్కడ స్నేహితులతో దాగుడు మూతల ఆట ఆడుతోంది. ఆ ఆటలో భాగంగా స్నేహితులను వెతికే క్రమంలో ఆ లిఫ్ట్ ఎలివేటర్ వద్ద ఉన్న కిటికిలో తల పెట్టింది. ఇంతలో అనుహ్యంగా లిఫ్ట్ కిందకు రావడంతో ఆమె తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందింది.
ఇదంతా హౌసింగ్ సోసైటి నిర్లక్ష్యం వల్లే జరిగిందంటూ బాలిక తండ్రి రవి ఖర్వి ఆందోళన చేశారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా లిఫ్ట్ ఓపెనింగ్‌ని అద్దాలతో కవర్ చేయాలని అన్నారు. ఈ మేరకు పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని లిఫ్ట్ పాడై ఉన్నట్లు గుర్తించారు. యంత్రాల లోపం కారణంగానే ఇలా అకస్మాత్తుగా కిందకు వెళ్లినట్లు చెప్పారు.
బాధితుడి తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి హౌసింగ్ చైర్మన్‌ని, సెక్రటరీని అరెస్టు చేసినట్లు తెలిపారు. బాధితురాలి కుటుంబం సాథే నగరంలో ఉంటారని, ఆమె దీపావళి సందర్భంగా మన్‌ఖుర్డ్‌లో హౌసింగ్ సోసైటి ఐదో అంతస్థులో ఉంటున్న అమ్మమ్మ ఇంటికి వచ్చినప్పుడూ ఈ దుర్ఘటన చోటు చేసుకున్నట్లు పోలీఉలు వెల్లడించారు.
(చదవండి: పనిమనిషితో సహా జంట అనుమానాస్పద మృతి..కానీ రెండేళ్ల చిన్నారి....)
Comments
Please login to add a commentAdd a comment