అన్నపై మూడేళ్ల చిన్నారి కాల్పులు! | 3-year-old shoots older brother in California | Sakshi
Sakshi News home page

అన్నపై మూడేళ్ల చిన్నారి కాల్పులు!

Published Sun, Dec 6 2015 3:47 PM | Last Updated on Sun, Sep 3 2017 1:36 PM

అన్నపై మూడేళ్ల చిన్నారి కాల్పులు!

అన్నపై మూడేళ్ల చిన్నారి కాల్పులు!

కాలిఫోర్నియా: అప్పటివరకూ ఆటల్లో మునిగితేలుతున్న ఓ మూడు సంవర్సరాల చిన్నారి తన సోదరుడిని కాల్చేశాడు. ఈ కాల్పుల్లో 15 ఏళ్ల యువకుడి పాదంలోకి బుల్లెట్ దూసుకెళ్లి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన శనివారం రాత్రి కాలిఫోర్నియాలో చోటుచేసుకుంది. స్టాక్టన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మూడు సంవత్సరాలున్న ఓ బాబు వరుసకు సోదరడయ్యే బాలుడు(15)తో కలిసి దాగుడుమూతల(హైడ్ అండ్ సీక్) ఆట ఆడుతున్నాడు. ఇందులో భాగంగా బెడ్ రూమ్లోకి బాబు వెళ్లాడు. అక్కడ ఆ చిన్నారికి గన్ దొరకగా, పొరపాటుగా తన అన్నను కాల్చేశాడు.

చిన్నారి పొరపాటున కాల్చేశాడా.. లేక ఎవరైనా కాల్పులు జరిపారా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ గన్ వారి చిన్నాన్న వాడుతుండేవాడని దర్యాప్తు అధికారులు కనుగొన్నారు. శాన్ బెర్నార్డినోలో ఓ జంట కాల్పులు జరిపి 14 మందిని పొట్టనపెట్టుకుని వారం గడవకముందే మరోసారి కాల్పుల ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. ఈ ఘటనకు సంబంధించి వారిద్దరి తల్లిదండ్రులూ దర్యాప్తులో తమకు సహకరిస్తున్నారని పూర్తి వివరాల కోసం ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు వివరించారు. గాయపడిన బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement