
లండన్ : బ్యాంక్‌లో దొంగతనం జరిగినట్లు పోలీసులకు ఫోన్ వచ్చింది. సిబ్బందిని తీసుకుని హాడావుడిగా వెళ్లిన పోలీసులకు అక్కడ జరుగుతున్న తంతు చూసి ఆశ్చర్యంతో నోట మాట రాలేదు. కారణం దొంగతనం జరిగిందని భావించిన పోలీసులకు బ్యాంక్ సిబ్బంది దొంగాపోలీస్(హైడ్ అండ్ సీక్) ఆట ఆడుతూ కనిపించి షాక్ ఇచ్చారు. ఈ సంఘటన బర్మింగ్‌హామ్‌లో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాట్‌వెస్ట్ బ్యాంక్ అధికారులు సిబ్బందిలో ఉత్సాహం పెంచడం కోసం సరదగా దొంగాపోలీస్ ఆట ఆడిపించారు. ఆటలో భాగంగా సిబ్బంది కాస్తా అలారమ్ మోగించారు. ఇది విన్న ఓ స్థానికుడు బ్యాంక్‌లో దొంగతనం జరిగిందని భావించి పోలీసులకు ఫోన్ చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఆదరబాదరగా బ్యాంక్ వద్దకు వచ్చారు. దొంగతనం గురించి ఆరా తీయగా అసలు విషయం బయటకు వచ్చింది. ఈ సంఘటన గురించి పోలీసు అధికారి ఒకరు తన ట్విటర్‌లో తెలియజేశారు. అంతేకాక తమకు ఫోన్ చేసిన వ్యక్తికి కృతజ్ఞతలు కూడా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment