వైరల్‌ వీడియో కోసం ప్రియుడికి గురిపెట్టి..! | Minnesota Woman shoots boyfriend in YouTube stunt | Sakshi
Sakshi News home page

అయ్యో! ఆ కోరిక ఎంత పనిచేసింది!

Published Thu, Jun 29 2017 11:59 AM | Last Updated on Tue, Sep 5 2017 2:46 PM

వైరల్‌ వీడియో కోసం ప్రియుడికి గురిపెట్టి..!

వైరల్‌ వీడియో కోసం ప్రియుడికి గురిపెట్టి..!

వైరల్‌ వీడియో తీయాలన్న కోరిక విషాదానికి దారితీసింది. యూట్యూబ్‌ కోసం వీడియో తీసే క్రమంలో ఓ 19 ఏళ్ల యువతిని తన ప్రియుడిని కాల్చేసింది. ప్రియుడి ఛాతికి పుస్తకాన్ని అడ్డుపెట్టి.. తుపాకీతో గురిపెట్టి కాల్చింది. తూటాను బుల్లెట్‌ అడ్డుకుంటుందని వారిద్దరూ భావించారు. ఈ వీడియోతో లక్షలకొద్ది క్లిక్కులు సాధించాలని ఆశపడ్డారు. కానీ, ఈ విన్యాసం తలకిందులైంది. ప్రియురాలు తుపాకీలోంచి దూసుకొచ్చిన తూటా పుస్తకాన్ని చీల్చుకొని ప్రియుడి ఛాతిలోకి దూసుకెళ్లింది.

అక్కడికక్కడే అతడు కుప్పకూలి ప్రాణాలు వదిలాడు. ఈ ఘటన అమెరికాలోని మిన్నెసోటాలో జరిగింది. 19 ఏళ్ల మోనాలిసా పెరెజ్‌, 22 ఏళ్ల పెడ్రో రుయిజ్‌ గత కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెరెజ్‌ ఏడు నెలల గర్భవతి కూడా. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం వైరల్‌ వీడియో తీయాలన్న కోరికతో తుపాకీతో ఈ ఇద్దరు చేసిన ప్రయోగం విఫలమైంది. పెరెజ్‌ తుపాకీతో కాల్చడంతో పెడ్రో ప్రాణాలు కోల్పోయాడు. ప్రస్తుతం​ పోలీసులు పెరెజ్‌ను అరెస్టు చేశారు. ఆమెపై వ్యక్తి మృతికి కారణమయ్యారంటూ అభియోగాలు మోపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement