అత్యంత పెద్ద వయస్కురాలైన ఫేస్బుక్ అభిమాని మృతి | Oldest Facebook fan dies at 114 | Sakshi
Sakshi News home page

అత్యంత పెద్ద వయస్కురాలైన ఫేస్బుక్ అభిమాని మృతి

Published Wed, Dec 24 2014 11:19 AM | Last Updated on Thu, Jul 26 2018 5:21 PM

అత్యంత పెద్ద వయస్కురాలైన ఫేస్బుక్ అభిమాని మృతి - Sakshi

అత్యంత పెద్ద వయస్కురాలైన ఫేస్బుక్ అభిమాని మృతి

న్యూయార్క్: అత్యంత పెద్ద వయస్కురాలైన ఫేస్బుక్ అభిమాని అన్నా స్టోయర్(114) అమెరికాలోని మిన్నెసోటాలో మరణించారు. తన జన్మదినాన్ని తప్పుగా పేర్కొని ఆమె ఫేస్బుక్ లో ఖాతా తెరిచారు.  తన వయసు 15 ఏళ్లు తగ్గించి 99గా పేర్కొని ఫేస్బుక్ ఎకౌంట్ పొందారు. నిజానికి ఆమె 1900, అక్టోబర్ 15న జన్మించారు.

అక్టోబర్ లో జన్మదినం జరుపుకున్న అన్నా స్టోయర్ లేటెస్ట్ ఐఫోన్ ఎలా వాడాలో నేర్చుకున్నారు. ఇందులో ఈ-మెయిల్, గూగుల్ ఎలా చూసుకోవాలో తెలుసుకున్నారు. సోషల్ మీడియా ద్వారా తన అభిప్రాయాలను కుటుంబ సభ్యులు, స్నేహితులతో పంచుకునేవారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement