ఫేస్బుక్లో 113 ఏళ్ల బామ్మ ఖాతా!
న్యూయార్క్: పసిపిల్లలను నుంచి బామ్మల వరకు ఫేస్బుక్కు ఆకర్షితులవుతున్నారు. ఫేస్బుక్ ఆస్థాయిలో జనం మెదళ్లలోకి చొచ్చుకుపోతోంది. ప్రపంచంలో జీవించి ఉన్న శతాధిక వద్ధులలో ఒకరైన ఓ బామ్మ కూడా ఫేస్బుక్లో తన ఖాతా తెరిచారు. అమెరికాలోని మిన్నెసోటాలో నివశిస్తున్న అన్నా స్టోహ్ వయసు 113 ఏళ్లు. ఈ వయసులో ఫేస్‌బుక్‌లో తనకంటూ ఓ ఖాతా తెరిచి ఈ బామ్మ రికార్డు సష్టించారు.
పైగా తన వయసు 99 ఏళ్లేనని తగ్గించి చెప్పడం విశేషం. 1900 సంవత్సరం అక్టోబర్ 15న జన్మించిన స్టోహ్ ఈ వారంలోనే 114వ జన్మదినాన్ని జరుపుకోనున్నారు. బోర్ కొట్టినప్పుడల్లా కుటుంబ సభ్యులను, స్నేహితులను ఫేస్‌బుక్ ద్వారా పలకరిస్తూ నేటి యువతరానికి తీసిపోకుండా ప్రస్తుతం ఆమె కాలక్షేపం చేసేస్తున్నారు.
**