గర్ల్ ఫ్రెండ్ని రేప్ చేశాడని ఫ్రెండ్ తల నరికి..
మిన్నెసోటా: జూన్ 24.. అర్థరాత్రి సమయం. అనుమానాస్పద లైసెన్స్ నెంబర్ ప్లేట్తో ఉన్న కారు. అనుమానం వచ్చిన పోలీసులు ఆ కారు వద్దకు వెళ్లారు. ఈలోగా కారులో ఉన్నవారు వేగం పెంచారు. పోలీసులు వారిని అందుకునే ప్రయత్నం చేయగా గంటలకు వందమైళ్ల వేగంతో ఆ కారు దూసుకెళ్లింది. అలా కొద్ది దూరం వెళ్లాక రెండు చోట్ల బలంగా ఢీకొని ఆగిపోయింది. కారు డ్రైవర్ అందులో నుంచి పారిపోయి సమీపంలోని ఓ నివాసంలో దాచుకోగా.. అందులో ఉన్న జోసెఫ్ క్రిస్టెన్ థార్సెన్ అనే వ్యక్తికి పోలీసులు ఎట్టకేలకు సంకెళ్లు తగిలించారు. అక్కడే ఓ పాడుబడ్డ ఇంట్లో దాక్కున్న డ్రైవర్ను బయటకు లాక్కొచ్చారు.
అప్పుడు ఆ వ్యక్తి చెప్పిన నిజం చూసి పోలీసులు ఖిన్నులయ్యారు. ఇంతకు ఏమిటా నిజం అనుకుంటున్నారా.. థార్సెన్ హత్య చేశాడు. అవును.. తన స్నేహితుడైన డేవిడ్ అలెగ్జాండర్ హైమన్ అనే వ్యక్తిని కిరాతకంగా పొడవడమే కాకుండా అతడి తల నరికేసి అడవుల్లో పారేశాడు. తన గర్ల్ఫ్రెండ్పై అత్యాచారానికి పాల్పడ్డాడనే కారణంతోనే అతడిని హత్య చేశాడు. వాస్తవానికి థార్సెన్ మత్తుపదార్ధాలకు అలవాటుపడిన వ్యక్తి. అతడిపై రెండు మూడు నేరాల కేసులతోపాటు జైలుకు పోయి వచ్చిన చరిత్ర కూడా కలదు. 35 ఏళ్ల థార్సెన్ కు హైమన్(21)కు ఫేస్ బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. వారిద్దరు స్నేహితులయ్యారు.
థార్సెన్కు ఒక గర్ల్ ప్రెండ్ కూడా ఉంది. ఒక రోజు థార్సెన్ గర్ల్ ప్రెండ్ వద్దకు వెళ్లిన హైమన్ ఆమెపై లైంగికదాడి చేశాడంట. అలా దాడి చేసినప్పుడే ఆమె కూడా అతడిపై తిరగబడి కొట్టింది కూడా. అయితే, డ్రగ్స్ బారిన పడిన ఈ ముగ్గురు మరో కారు డ్రైవర్తో కలిసి కారులో వెళుతూ మధ్యలో డ్రగ్స్ సేవించారు. అనంతరం కారు చెకింగ్ కోసం అని హైమన్ కిందికి దిగగా వెనుక నుంచి థార్సెన్ బలంగా బేస్ బాల్ బ్యాట్ తో దాడి చేశాడు. అనంతరం కత్తితో అతడిని పొడిచి కసిగా అతడి తల నరికేసి అడవిలో పారేశాడు. తర్వాత ఏం తెలియనట్లు నటించాడు. ఈ కథంతా విన్న పోలీసులు అవాక్కయ్యి థార్సన్ను అతడి గర్ల్ ఫ్రెండ్ ను మరో కారు డ్రైవర్ ను చివరకు అదుపులోకి తీసుకున్నాడు.