తెలుగు సంవత్సరాది ఉగాదిని అమెరికాలో ఉన్న ఆంధ్రులు ఘనంగా చేసుకుంటున్నారు. అక్కడి పలు రాష్ట్రాల్లో తెలుగు సంఘాల ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. మిన్నెసోటా రాష్ట్రంలో కూడా ఉగాది వేడుకలను ఘనంగా చేసుకున్నారు. దాదాపు రెండు వేల మంది వరకు ఈ వేడుకల్లో పాలు పంచుకున్నారు.
తెలుగు సంస్కృతి, సంప్రదాయం ఉట్టిపడే రీతిలో సాంస్కృతిక కార్యక్రమాలు సాగాయి. పట్టుపంచెలు, పట్టుచీరలు అక్కడి వాతావరణాన్నే మార్చేశాయి. తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో కెనడీ స్కూల్లో జరిగిన ఈ పండగ తమలో నూతనోత్సాహాన్ని నింపిందని ఎన్నారైలు అంటున్నారు. అందరూ కలిసి పండగను చేసుకోవడం ఆనందంగా ఉందని చెబుతున్నారు.
అమెరికాలో ఘనంగా ఉగాది సంబరాలు
Published Mon, Mar 31 2014 5:15 PM | Last Updated on Sat, Jul 6 2019 12:42 PM
Advertisement
Advertisement