ఒక పోలీసు అధికారి మృతి..
100 మందికి పైగా గాయాలు
ఇస్లామాబాద్: ఆందోళనకారులకు, భద్రతా సిబ్బందికి మధ్య ఘర్షణలతో పాకిస్తాన్ ఆక్రమిత కాశీ్మర్(పీఓకే) అట్టుడికిపోతోంది. శనివారం మొదలైన రగడ ఆదివారం మరింత ఉధృతమైంది. గోధుమ పిండి ధరలు విపరీతంగా పెరగడం, విద్యుత్ చార్జీలు మండిపోతుండడం పట్ల జనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధరలు తగ్గంచాలని డిమాండ్ చేస్తూ నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారు. వారిని అడ్డుకొనేందుకు ప్రయతి్నంచిన భద్రతా సిబ్బందిపై తిరగబడుతున్నారు.
తుపాకులతో కాల్పులు తెగబడుతున్నారు. ఆదివారం పీఓకేలోని ఇస్లాంగఢ్‌లో జరిగిన కాల్పుల్లో ఒక పోలీసు అధికారి మరణించారు. 100 మందికిపైగా గాయపడ్డారు. వీరిలో ఎక్కువ మంది పోలీసులే ఉన్నారు. పీఓకేలో పలు ప్రాంతాల్లో మొబైల్, ఇంటర్నెట్ సేవలను అధికారులు నిలిపివేశారు. తాజా పరిస్థితిపై సమీక్షించేందుకు పాకిస్తాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ సోమవారం అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. పీఓకేలో పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయని పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment