army officer killed
-
పీఓకేలో తీవ్ర ఘర్షణలు
ఇస్లామాబాద్: ఆందోళనకారులకు, భద్రతా సిబ్బందికి మధ్య ఘర్షణలతో పాకిస్తాన్ ఆక్రమిత కాశీ్మర్(పీఓకే) అట్టుడికిపోతోంది. శనివారం మొదలైన రగడ ఆదివారం మరింత ఉధృతమైంది. గోధుమ పిండి ధరలు విపరీతంగా పెరగడం, విద్యుత్ చార్జీలు మండిపోతుండడం పట్ల జనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధరలు తగ్గంచాలని డిమాండ్ చేస్తూ నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారు. వారిని అడ్డుకొనేందుకు ప్రయతి్నంచిన భద్రతా సిబ్బందిపై తిరగబడుతున్నారు. తుపాకులతో కాల్పులు తెగబడుతున్నారు. ఆదివారం పీఓకేలోని ఇస్లాంగఢ్లో జరిగిన కాల్పుల్లో ఒక పోలీసు అధికారి మరణించారు. 100 మందికిపైగా గాయపడ్డారు. వీరిలో ఎక్కువ మంది పోలీసులే ఉన్నారు. పీఓకేలో పలు ప్రాంతాల్లో మొబైల్, ఇంటర్నెట్ సేవలను అధికారులు నిలిపివేశారు. తాజా పరిస్థితిపై సమీక్షించేందుకు పాకిస్తాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ సోమవారం అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. పీఓకేలో పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయని పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ చెప్పారు. -
భారీ ఎన్కౌంటర్.. నలుగురు ఆర్మీ అధికారుల మృతి
శ్రీనగర్: జమ్ము కశ్మీర్లో బుధవారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. రాజౌరి జిల్లాలోని కలకోట్ అడవిలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఉగ్రవాదులను తుదముట్టించే క్రమంలో ఇద్దరు ఆర్మీ అధికారులతోపాటు ఇద్దరు సైనికులు అమరులయ్యారు. అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారని ఇంటెలిజెన్స్ సమచారంతో ఆర్మీ బలగాలు, పోలీసులు సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. పోలీసుల కదలికలను పసిగట్టిన ఉగ్రవాదులు ఎదురు కాల్పులకు దిగడంతో ఎన్కౌంటర్ జరిగింది. కాగా జమ్మూ కాశ్మీర్‌లోని పీర్ పంజాల్ పర్వత శ్రేణుల్లోని అటవీ ప్రాంతం గత కొన్నేళ్లుగా వరుస ఎన్కౌంటర్ల జరుగుతున్నాయి. ఈ ప్రాంతాలు పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే), జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్ని ఆనుకుని ఉన్నాయి. ఈ మార్గాల ద్వారా ఉగ్రవాదులు భారత్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నారు. టెర్రరిస్టులకు ఈ అటవీ ప్రాంతాలు స్థావరాలుగా మారాయి. దీంతో ఈ ప్రాంతం భద్రతా దళాలకు సవాలుగా మారింది. గత వారం కూడా రాజౌరీ జిల్లాలో భద్రతాబలగాలకు, ఆర్మీకి మధ్య ఎన్కౌంటర్లో ఓఉగ్రవాది హతమయ్యాడు. బుధాల్ తహసీల్ పరిధిలోని గుల్లెర్-బెహ్రూట్ ప్రాంతంతో సైన్యం, పోలీసులు, సీఆర్పీఎఫ్ కార్డన్ సెర్చ్ సమయంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. చదవండి: Air India: టాటా గ్రూప్ సంస్థపై భారీ పెనాల్టీ.. కారణం ఇదేనా.. -
ఆర్మీ ఉద్యోగి సతీష్‌ది హత్యే
సాక్షి, విశాఖపట్నం: వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడన్న కారణంగా ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను భార్యే కడతేర్చింది. మద్దిలపాలెంలో గత నెల 18న జరిగిన ఘటనలో చిక్కుముడిని పోలీసులు విప్పారు. మొదట ఆత్మహత్యగా కేసు నమోదు చేసినప్పటికీ ఆర్మీ అధికారులు పోస్టుమార్టం రిపోర్టు అడగడంతో వాస్తవాలు వెలుగు చూశాయి. ఈ మేరకు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను పోలీస్ కమిషనర్ కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో నగర పోలీస్ కమిషనర్ రాజీవ్‌కుమార్ మీనా వెల్లడించారు. ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్న దల్లి సతీష్‌కుమార్ మద్దిలపాలెం పెద్దనుయ్యి ప్రాంతంలో రెండు అంతస్తుల భవనంలో నివసిస్తున్నాడు. ఆయనకి 2010లో మాజీ ఆర్మీ ఉద్యోగి కూతురైన జ్యోతితో వివాహం జరిగింది. వారికి కృష్ణ ప్రవీణ్, కృష్ణ లిథిక్ అనే ఇద్దరు కుమారులున్నారు. భర్త సతీష్‌కుమార్ ఉద్యోగరీత్యా దూరంగా ఉండటంతో జ్యోతి కొద్ది కాలంగా సిమ్మ భరత్(24) అనే యువకుడితో అక్రమసంబంధం పెట్టుకుంది. వారిద్దరూ రహస్యంగా కలుసుకుంటూ ఉండేవారు. ఈ విషయం సతీష్‌కుమార్ తల్లి పార్వతి దేవికి తెలియడంతో జ్యోతిని పలుమార్లు మందలించింది. ఈ క్రమంలో జూలై 28న తన భర్త సెలవు పెట్టుకుని వస్తున్నాడని తెలుసుకున్న జ్యోతి తన ప్రియుడికి విషయాన్ని చెప్పింది. తనను కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారని చెప్పింది. ఇంతలో ఇంటికి వచ్చిన సతీష్‌కుమార్ తన భార్య బాగోతం తెలుసుకుని నిలదీశాడు. ఈ నేపథ్యంలో ఆగస్టు 19న వేకువజామున సతీష్ ఆత్మహత్య చేసుకున్నట్లు అతని భార్య జ్యోతి ఎంవీపీ కాలనీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అక్కడితో విషయం వదిలేశారు. అయితే ఆర్మీ అధికారులు పూర్తి వివరాలతో పోస్టుమార్టం నివేదిక కావాలని అడగడంతో అధికారులు మళ్లీ దర్యాప్తు చేపట్టడంతో వాస్తవాలు వెలుగుచూశాయి. మందులో నిద్రమాత్రలు కలిపి... సెలవులకు ఇంటికి వచ్చిన భర్త తన ప్రవర్తనపై ప్రశ్నించిన విషయం భరత్‌కు జ్యోతి తెలియచేయడంతో ఇద్దరూ కలిసి సతీష్‌కుమార్‌ను చంపేందుకు ప్రణాళిక రూపొందించారు. ఈ క్రమంలో సతీష్‌కుమార్ తాగే మందులో నిద్రమాత్రలు కలిపి తరువాత చున్నీతో గొంతు నొక్కి చంపాలని పథకం పన్నారు. అనుకున్నట్లుగానే ఆగస్టు 18న సతీష్ తాగే మందులో అతని భార్య జ్యోతి, ఆమె ప్రియుడు భరత్, భరత్ స్నేహితుడైన గొడ్ల భాస్కర్‌రావు నిద్రమాత్రలు కలిపారు. అనంతరం మత్తులోకి జారిపోయిన సతీష్‌ను చున్నీతో గొంతు నొక్కి చంపేశారు. తరువాత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ట్లు నమ్మించేందుకు అతని బెడ్రూమ్లోకి తీసుకెళ్లి చీరతో ఫ్యానుకు వేలాడదీశారు. ఆగస్టు 19న తెల్లవారి తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని అత్తమామలకు చెప్పి ఆస్పత్రికి తీసుకెళ్లింది. అయితే అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్థారించడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు ఎంవీపీ పోలీసులకు జ్యోతి ఫిర్యాదు చేసింది. స్థానికులకు, కుటుంబ సభ్యులకు అనుమానం రాకపోవడంతో కేసును పూర్తిగా మూసేశారు. ఆగస్టు 23న పోస్ట్‌మార్టం రిపోర్టులన్నీ వివరంగా కావా లని స్థానిక పోలీసులను ఆర్మీ అధికారులు కోరా రు. దీంతో సతీష్ మృతదేహానికి పోస్టుమార్టం చేయించగా వచ్చిన రిపోర్టు ఆధారంగా దర్యాప్తు చేయడంతో సతీష్‌కుమార్‌ది ఆత్మహత్య కాద ని... హత్యేనని ఎంవీపీ పోలీసులు తేల్చారు. హత్య చేసిన రోజే మృతుడి రెండు ఉంగరాలను భరత్, భాస్కరరావులకు జ్యోతి ఇచ్చేయడంతో వారు వాటిని విక్రయించి జల్సాలు చేశారు. లభించిన సాక్ష్యాల ఆధారంగా సెప్టెంబర్ 9న జ్యోతి, భరత్, భాస్కర్‌రావును మద్దిలపాలెం బస్సు డిపో వద్ద ఎంవీపీ పోలీసులు అరెస్ట్ చేశారు. సమావేశంలో డీసీపీ – 1 రంగారెడ్డి, ఏసీపీ ఆర్వీఎస్ఎన్ మూర్తి, ఎంవీపీ కాలనీ పోలీస్‌స్టేషన్ సీఐ షణ్ముఖరావు, ఎస్ఐ భాస్కర్‌రావు పాల్గొన్నారు. కేసులోని చిక్కుముడి విప్పిన అధికారులను సీపీ అభినందించారు. -
అనుమానాస్పద రీతిలో విశ్రాంత ఆర్మీ అధికారి మృతి
హైదరాబాద్: అనుమానాస్పద రీతిలో ఓ విశ్రాంత ఆర్మీ అధికారి మృతి చెందిన ఘటన ఆసిఫ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని మెహిదీపట్నం సంతోష్‌నగర్ విజయశ్రీ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ నం.406లో ఆర్మీ విశ్రాంత ఉద్యోగి శంకర శ్రీశైల మల్లిఖార్జునరావు(75) తన భార్య రోహిణితో కలసి నివాసం ఉంటున్నారు. వీరి కుమారుడు శ్రీధర్, కుమార్తె శ్రీదేవి ఉద్యోగ నిమిత్తం అమెరికాలో ఉంటున్నారు. ఆదివారం రోహిణి టీ తీసుకుని బెడ్రూంలోకి వెళ్లబోగా తలుపు లోపల గడియవేసి ఉంది. ఎంతసేపు పిలిచినా చప్పుడు లేకపోవడంతో చుట్టుపక్కల వారిని పిలిచి తలుపు విరగ్గొట్టి చూడగా బెడ్రూంలో నుంచి దట్టమైన పొగలు కనిపించాయి. మంటలు ఆర్పేందుకు ప్రయత్నించగా అదుపులోకి రాలేదు. దీంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న సిబ్బంది మంటలను ఆర్పి చూడగా మల్లిఖార్జున్‌రావు పూర్తిగా కాలిపోయి ఉన్నారు. కాగా, ఇతనికి టీ తాగి స్మోక్ చేసే అలవాటు ఉన్నట్లు రోహిణి తెలిపింది. సమాచారం అందుకున్న ఎస్సై పి.వెంకటేశ్వర్లు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
మరో ముగ్గురు జవాన్ల వీరమరణం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని పాంపోర్ పట్టణంలో ఉగ్రవాదులతో పోలీసుల ఎన్కౌంటర్ కొనసాగుతోంది. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ ఇనిస్టిట్యూట్ (ఈడీఐ) భవనంలో దాక్కున్న ఉగ్రవాదులను అంతం చేసేందుకు జరుగుతున్న ఆపరేషన్‌లో ఆదివారం మరో ముగ్గురు జవాన్లు అమరులయ్యారు. భద్రతాబలగాల కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. ఈ ఎన్కౌంటర్లో అమరులైన జవాన్ల సంఖ్య ఐదుకు చేరింది. ఆదివారం అమరులైన వారిలో ఇద్దరు కెప్టెన్లు ఉన్నారు. తెల్లవారుజామున ఈడీఐ భవనంపై పట్టుకోసం ప్రయత్నించిన పారా యూనిట్ కెప్టెన్ పవన్ కుమార్(23), మరో కెప్టెన్ తుషార్ మహాజన్(26), జవాన్ ఓం ప్రకాశ్‌పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. పవన్ అక్కడే అమరుడవ్వగా.. తీవ్రంగా గాయపడిన తుషార్, ఓం ప్రకాశ్ 92 బేస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. చనిపోయారని ఆర్మీ అధికారులు వెల్లడించారు. ఉగ్రవాదులు కాల్పలు జరపటంతోపాటు.. మధ్యమధ్యలో గ్రనేడ్లు విసురుతున్నారని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. వీలైనంత త్వరలో ఆపరేషన్ ముగిస్తామని తెలిపాయి. శనివారం సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు కాల్పులు జరపటంతో ఇద్దరు జవాన్లు, ఒక పౌరుడు మరణించగా.. 9 మంది జవాన్లు గాయపడ్డం తెలిసిందే. ఎంతో గర్వంగా ఉంది: పవన్ తండ్రి ఈ దాడిలో అమరుడైన తన కుమారుడి త్యాగానికి గర్వంగా ఉందని కెప్టెన్ పవన్ తండ్రి రాజ్బీర్ సింగ్ తెలిపారు. ‘నాకు ఒక్కడే కుమారుడు. వాడిరీ దేశం కోసం ఆర్మీకి ఇచ్చేశాను. ఇవాళ దేశ సేవలోనే నా బిడ్డ అమరుడయ్యాడు. ఒక తండ్రిగా ఇంతకన్నా గర్వకారణమేముంటుంది’ అని పేర్కొన్నారు. హరియాణాలోని జింద్ ప్రాంతానికి చెందిన పవన్ మూడున్నరేళ్ల క్రితం ఆర్మీలో చేరినప్పటినుంచి పలు ఆపరేషన్లలో చురుకుగా పాల్గొన్నాడని ఆర్మీ అధికారులు వెల్లడించారు. కోటా, స్వాతంత్య్రం కాదు.. దుప్పటి చాలు: కెప్టెన్ పవన్ ‘కొందరు రిజర్వేషన్లు కోరుతున్నారు, కొందరు స్వాతంత్య్రం కావాలంటున్నారు, నా దుప్పటి తప్ప నాకేమీ వద్దు’... ఇది జమ్మూ కశ్మీర్ పాంపోర్‌లో ఉగ్రవాదులపై పోరులో వీరమరణం పొందిన కెప్టెన్ పవన్‌కుమార్ చివరి సందేశం. తన ఫేస్బుక్ ఖాతా నుంచి ఈ పోస్ట్ చేశారు. కొన్ని రోజులుగా దేశాన్ని కుదిపేస్తున్న జేఎన్‌యూ వివాదం, జాట్ల ఉద్యమంతో పవన్ జీవితం ముడిపడడం యాదృచ్ఛికమైనా... వాటిపై అభిప్రాయాలు మాత్రం అందరినీ ఆలోచింపచేస్తున్నాయి. జాట్ వర్గానికి చెందిన పవన్ జేఎన్యూలోనే గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. ఆర్మీ డే రోజున (జనవరి 15) జన్మించిన పవన్‌కు బుల్లెట్ వాహనాలు, కమాండో జీపులంటే ఇష్టం.