ఇటీవల జరిగిన ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల్లో ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన విషయం తెలిసిందే. వరుసగా రెండోసారి ఎన్నికల్లో మాక్రాన్ అధ్యక్ష పీఠాన్ని దక్కించుకున్నారు. ఎన్నికల్లో మాక్రాన్‌కు 58 శాతం ఓట్లు రాగా, ప్రత్యర్థి మరీన్ లీపెన్‌కు 42 శాతం ఓట్లు పడ్డాయి.
ఇదిలా ఉండగా ఎన్నికల ఫలితాల రోజునే ఆయన గెలుపును జీర్ణించుకోలేని వ్యతిరేకవాదులు మాక్రాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్లపై నిరసన వ్యక్తం చేశారు. తాజాగా మరో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. మాక్రాన్ ఫ్రెంచ్ పట్టణంలోని ఓ ఫుడ్ మార్కెట్‌లో కొంత మందితో మాట్లాడుతుండగా ఆయనపై నిరసనకారులు టమాటాలతో విసిరారు. వెంటనే మాక్రాన్ భద్రతా సిబ్బంది అలర్ట్ అయి ‘ప్రొజెక్టల్’ అంటూ గట్టిగా అరుస్తూ ఆయనకు రక్షణగా నిలిచారు. దీంతో మాక్రాన్‌కు ఈ పర్యటన సందర్భంగా చేదు అనుభవం ఎదురైంది.
Emmanuel Macron made his first appearance since his election, he received tomato from the French crowd. pic.twitter.com/s6AnNM75TI
— 🍁En el barrio de Cortes viven residentes (@VecBarrioCortes) April 27, 2022
కాగా, అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత మొదటిసారిగా పాల్గొన్న మొదటి పబ్లిక్ మీట్‌లోనే ఇలా జరగడంతో మాక్రాన్ ఖంగుతిన్నారు. ఈ ఘటన అనంతరం మాక్రాన్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇది కూడా చదవండి: ఇదేం రూల్ సామీ.. బాల్కనీలో బట్టలు ఆరబెడితే రూ.20 వేలు ఫైన్!
Comments
Please login to add a commentAdd a comment