Punjab Chief Minister Bhagwant Mann Meets Protester Amid Agnipath Scheme - Sakshi
Sakshi News home page

ఆగని అగ్నిపథ్ నిరసన: సాక్షాత్తు ముఖ్యమంత్రి కాన్వాయ్‌ ఆపీ...: వీడియో వైరల్

Published Sun, Jun 19 2022 2:56 PM | Last Updated on Sun, Jun 19 2022 3:26 PM

Punjab Chief Minister Bhagwant Mann Meets Protester Amid Agnipath  - Sakshi

చండీగఢ్: పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ రోడ్‌షోలో ప్రజలను పలకరిస్తున్నారు. ఈ మేరకు ఆయన ఎస్‌యూవీ కారులో నుంచుని ప్రజలకు అభివాదం చేసుకుంటూ వెళ్లిపోతున్నారు. ఇంతలో ఒక నల్లని టీషర్టు ధరించిన వ్యక్తి ముఖ్యమంత్రి కాన్యాయ్‌ని ఆపాల్సిందిగా చేతులు ఊపాడు. దీంతో ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ ఆ వ్యక్తితో మాట్లాడేందుకు తన కారుని ఆపారు.

సదరు వ్యక్తి మొదటగా ముఖ్యమంత్రికి కరచలనం చేసి అగ్నిపథ్‌ గురించి మాట్లాడాడు. ఈ అగ్నిపథ్‌ పథకాన్ని అమలు చేసే ముందు నాయకులంతా సమావేశమై చర్చించి ఉంటే బావుండేది కదా అని అడిగాడు ఆ వ్యక్తి.  దీంతో భగవంత్‌ మాన్‌ సదరు వ్యక్తి చేతిని పట్టుకుని అగ్నిపథ్‌ గురించి చర్చించడానికి ఎంపీలంతా సమావేశమైతే...తానే స్వయంగా వెళ్లి మాట్లాడతానని హామీ ఇచ్చారు. ఈ అగ్నిపథ్‌ పథకానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా హింసాత్మక నిరసనలు చెలరేగిన సంగతి తెలిసిందే.

మరోవైపు సాయుధ దళాల రిక్రూట్‌మెంట్‌లో సమూల మార్పులను ప్రకటించే ముందు ప్రభుత్వం సంప్రదింపులు జరిపి ఇతర నాయకుల అభిప్రాయాలను పరిగణలోనికి తీసుకుని ఉండాల్సిందని ప్రతిపక్షాలు కూడా దుమ్మెత్తిపోస్తున్నాయి. అంతేకాదు ఈ విషయమై చర్చలకు కూర్చొవల్సిందే అంటున్న జౌత్సాహిక నిరసనకారులకు వంత పాడుతున్నాయి ప్రతిపక్షాలు.

ఐతే ప్రభుత్వం ఇంకా కొన్ని చోట్ల నిరసనలు జరుగుతుండటంతో దిద్దుబాటు చర్య చేపట్టడమే కాకుండా పలు రాయితీలను కూడా ప్రకటించింది. ఈ మేరకు కోస్ట్‌గార్డు, డిఫెన్స్‌ సివిలియన్‌ పోస్టులతో సహా మొత్తం 16 డిఫెన్స్‌ పబ్లిక్‌ సెక్టార్‌ అండర్‌ టేకింగ్స్‌లో విస్తరించి ఉన్న రక్షణ మంత్రిత్వశాఖ ఉద్యోగాల్లో 10 శాతం కోటా కల్పించింది.  ఈ రిజర్వేషన్‌ మాజీ సైనికులకు ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్‌కు అదనంగా ఉంటుంది.

(చదవండి: 700 కోట్ల ఆస్తి నష్టం.. 718 మంది అరెస్ట్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement