ఆగని జిల్లాల ఆందోళనలు
నల్లగొండ: జిల్లాల విభజన ప్రక్రియ గడువు సమీపిస్తుండడంతో తమ న్యాయమైన డిమాండ్‌ను నెరవేర్చాలని ఆందోళనకారులు పోరును ఉధృతం చేస్తున్నారు. గుండాల మండలాన్ని యూదాద్రి జిల్లాలోనే కొనసాగించాలని ఆ మండల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రెండో రోజు కూడా నిరాహార దీక్ష కొనసాగింది. అరుుతే ఆమరణ దీక్ష చేస్తున్న బీజేవైఎం మండల కన్వీనర్ కృష్ణమూర్తి పరిస్థితి విషమంగా మారడంతో పోలీసులు ఆస్పత్రికి తరలించారు. అదే విధంగా నలుగురు చొప్పున యువకులు బీఎస్‌ఎన్‌ఎల్ సెల్ టవర్, వాటర్ ట్యాంకు ఎక్కి రెండు గంటల పాటు నిరసన తెలిపారు.
మండల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రెండు గంటల పాటు రాస్తారోకో, వంటావార్పు నిర్వహించారు. హుజూర్‌నగర్, నాంపల్లి మండల కేంద్రాలను రెవెన్యూ డివిజన్ కేంద్రాలుగా మార్చాలని రాస్తారోకో నిర్వహించారు. నాంపల్లిలో నిర్వహించిన బంద్‌కు అన్ని వర్గాలు సంపూర్ణ మద్దతు తెలిపారుు. ఇక అమ్మనబోలు, అడవిదేవులపల్లి గ్రామాలను మండలాలుగా మార్చాలని ఆయూ గ్రామాల ప్రజలు రాస్తారోకోలు, వంటావార్పు నిర్వహించారు. ప్రతిపాదిత మోటకొండూర్ మండలాన్ని రద్దు చేస్తున్నారని తెలిసి గ్రామ సర్పంచ్ కొంతం లక్ష్మీ, ఉప సర్పంచ్ ఆంజనేయులు, వార్డు సభ్యులు చీరాల సత్యనారాయణ, వంగపల్లి ఉపేంద్ర, బచ్చు శ్రీలత, ప్రవీణ్‌రెడ్డి, జయమ్మ, మల్లేష్, లావణ్య, సివమ్మ, గీత, మల్కయ్య, మధుసూదన్‌లు తమ పదవులకు రాజీనామా చేశారు. దేవరకొండను జిల్లాగా మార్చాలని కోరుతూ టీడీపీ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు.