గువహతి: కేంద్ర ప్రభుత్వం సోమవారం(మార్చ్11) నుంచి అమల్లోకి తీసుకువచ్చిన సీఏఏ చట్టంపై బంద్‌కు పిలుపిచ్చిన అస్సాం ప్రతిపక్ష పార్టీలకు ఆ రాష్ట్ర పోలీసులు నోటీసులు ఇచ్చారు. సీఏఏ చట్టం రూల్స్ నోటిఫై చేసిన వెంటనే సోమవారం సాయంత్రం నుంచే అస్సాంలో ప్రతిపక్షపార్టీలు ఆందోళనలకు దిగాయి. రాజధాని గువహతితో పాటు చాలా ప్రాంతాల్లో సీఏఏ చట్టం కాపీలను నిరసనకారులు కాల్చివేశారు. చట్టం అమలు చేయడానికి వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహించారు.
దీంతో పోలీసులు ఈ ఆందోళలపై ఒక ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు. మంగళవారం జరిగే సర్బత్‌మక్ బంద్‌లో భాగంగా ఎవరైనా ప్రజల ఆస్తులకు నష్టం కలిగించడం, పౌరులను గాయపరచడం లాంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, జరిగిన నష్టాన్ని వారి నుంచే పూర్తిగా వసూలు చేస్తామని స్పష్టం చేశారు. ఈమేరకు ఎక్స్(ట్విటర్)లో పోలీసులు ఒక పోస్ట్ చేశారు. ఆదివారమే ఈ విషయమై సీఎం హిమంత బిశ్వ శర్మ ప్రతిపక్ష పార్టీలకు తీవ్ర హెచ్చరిక చేశారు.
Guwahati police gave a legal notice to the Political parties who have called for a 'Sarbatmak Hartal' in Assam to protest against the CAA.
— ANI (@ANI) March 12, 2024
"Any damage to public/ private property including Railway and National Highway properties or injury to any citizen caused due to 'Sarbatmak… pic.twitter.com/vnO6uin76t
సీఏఏ చట్టం అమలుపై ఆందోళనలు చేసే రాజకీయ పార్టీల గుర్తింపు రద్దయ్యే చాన్స్ ఉందని సీఎం బిశ్వశర్మ హెచ్చరించారు. ఎవరికైనా చట్టం పట్ల అభ్యంతరాలుంటే దానిపై సుప్రీంకోర్టుకు వెళ్లవచ్చని సూచించారు. కాగా, 2019 డిసెంబర్‌లో సీఏఏపై అస్సాంలో హింసాత్మక ఆందోళనలు జరిగాయి. ఈ ఆందోళనల్లో ఐదుగురు పౌరులు చనిపోయారు. ఈ చట్టం అమలు చేస్తే బంగ్లాదేశ్ నుంచి రాష్ట్రంలోకి భారీగా వలసలు ఉంటాయని పలు పార్టీలు, గ్రూపులు భావిస్తున్నాయి. ఇదే పెద్ద ఎత్తున నిరసనలకు కారణమవుతోందన్న వాదన వినిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment