చూయింగ్‌ గమ్‌ నమిలితే బరువు తగ్గుతారా..! | Using Chewing Gum To Lose Weight Is It Effective - Sakshi

Weight Loss :చూయింగ్‌ గమ్‌ నమిలితే బరువు తగ్గుతారా!పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే..

Published Wed, Sep 20 2023 5:22 PM | Last Updated on Wed, Sep 20 2023 6:04 PM

Using Chewing Gum To Lose Weight Is It Effective - Sakshi

చూయింగ్‌ గమ్‌ తినడం వల్ల నిజంగా బరువు తగ్గుతారా..? ఇది నిజమేనా? బరువు తగ్గడంలో ఇది ఎంత వరకు ఉపయోగపడుతుంది. పూర్తిస్తాయిలో పనిచేస్తుందా? పరిశోధనలు ఏం చెప్పాయి తదితరాల గురించి చూద్దాం!.

పిల్లలు, టీనేజ్‌ పిల్లలు చూయింగ్‌ గమ్‌ని ఇష్టంగా నములుతుంటారు. కానీ ఇది బరువు ఎలా తగ్గిస్తుంది. చాలామంది అనుకునేది ఇది తినడం వల్ల ఎక్కువ తినాలనే కోరిక ఉండదు కాబట్టి తెలియకుండానే తినడం మానేస్తారని అని భావిస్తారు. అలాగే అల్పాహారం తీసుకోవాలనే కోరిక కూడా తగ్గుతుందని, క్యాలరీ నియంత్రణలో సమర్థవంతంగా సహాయపడుతుందని చెబుతున్నారు చాలామంది. మరికొందరూ చూయింగ్‌ గమ్‌ని నమలడం ద్వారా అనారోగ్యకరమైన చిరుతిండ్ల జోలికి పోకుండా ఉండగలం అని అంటున్నారు. ఇది తినడం వల్ల తెలియకుండానే ఆకలి తగ్గిపోతుంది కాబట్టి బరువు తగ్గడానికి చక్కటి మార్గం అని చాలా మంది అభిప్రాయం

దీర్ఘకాలికంగా ఇది మంచిదేనా?
సమగ్రంగా బరువు తగ్గాలనుకుంటే చక్కని డైట్‌ తగినంత వ్యాయామానికి మించిన చక్కటి మార్గం ఇంకొకటి లేదు. ఈ చుయింగ్‌ గమ్‌ని దీర్ఘకాలికంగా తింటే మంచి కన్నా దుష్పరిణామాలు ఫేస్‌ చేసే ప్రమాదమే ఎక్కువుగా ఉందని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణలు. చక్కెర రహిత చుయింగ్‌ గమ్‌లో కృత్రిమ చక్కెర్లు ఉంటాయి. అందువల్ల వీటిని ఎక్కువగా తీసుకుంటే శరీరంపై ప్రతికూల ప్రభావాలుంటాయని అంటున్నారు. ఇలా నములుతూ ఉండటం వల్ల దవడం సంబంధ సమస్యలు, జీర్ణ సమస్యలకు దారితీయొచ్చని వార్నింగ్‌ ఇస్తున్నారు. 

అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే..
బరువు తగ్గేందుకు చూయింగ్‌ గమ్‌ ఏమి అంత ప్రభావవంతమైనది కాదనే చెబుతున్నాయి. ముఖ్యంగా ఆకలి, క్యాలరీలు వంటివి తగ్గినప్పటికీ సమగ్రంగా బరువు తగ్గుతారా అనేది సందేహమే అంటున్నాయి పరిశోధనలు. జీవనశైలి లేదా ఆహారంలో మార్పులు చేసేటప్పుడూ ఆరోగ్య నిపుణుల సలహాలు సూచనలు మేరుకు పాటించండి అని పరిశోధనలు నొక్కి చెబుతున్నాయి.

(చదవండి: స్పైసీ చిప్స్‌ తినకూడదా? చనిపోతారా..?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement