
సాక్షి, బెంగళూరు: కన్నడ నాడు గీతాన్ని అవమానించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రొబెషనరీ ఐఏఎస్ అధికారి ప్రీతి గెహ్లాట్‌ను సస్పెండ్ చేశారు. గురువారం తుమకూరు జిల్లా శిరాలో జరిగిన ఓ ప్రభుత్వ కార్యక్రమంలో కన్నడ నాడు గీతాన్ని ఆలపిస్తుండగా ప్రీతి గెహ్లాట్ చూయింగ్ గమ్ నమిలారంటూ పలు కన్నడ సంఘాలు ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీ రత్నప్రభకు ఫిర్యాదు చేశాయి. దీంతో ప్రీతి గెహ్లాట్‌ను సస్పెండ్ చేస్తూ రత్నప్రభ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.