
మోదీ మాటల మనిషి కాదు.. చేతల మనిషి: ఒబామా
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రశంసల్లో ముంచెత్తారు. ఆయనను 'చేతల మనిషి'గా అభివర్ణించారు. 64 ఏళ్ల వయసులో కూడా మోదీ చకచకా పరుగులు పెడుతూ అధికారులను కూడా పరుగులు పెట్టించడాన్ని గుర్తించిన 53 ఏళ్ల ఒబామా.. ఆయన్ను ప్రశంసించకుండా ఉండలేకపోయారు.
మయన్మార్ రాజధాని నేపిటాలో జరుగుతున్న ఆసియాన్ - తూర్పు ఆసియా దేశాల సదస్సులో కాసేపు మోదీతో ఒబామా మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధానిని ‘చేతలమనిషి’గా ప్రశంసించినట్టు విదేశాంగ ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ ట్వీట్ చేశారు. మోదీ- ఒబామా కలవడం గత 45 రోజుల్లో ఇది రెండోసారి. సెప్టెంబర్‌లో మోదీ అమెరికా వెళ్లినపుడు కూడా ఒబామా, ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికారు.
Prez Obama greets PM @narendramodi at Gala dinner - "You are a man of action!" pic.twitter.com/sMDQqBuevg
— Syed Akbaruddin (@MEAIndia) November 12, 2014