ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీని చంపుతానంటూ బెదిరింపు ఫోన్‌కాల్ చేసిన వ్యక్తిని ఢిల్లీ పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. వివరాలు.. సల్మాన్ అనే 22 ఏళ్ల యువకుడు చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ పలుమార్లు జైలుకు వెళ్లి వచ్చాడు. ఇటీవలే బెయిల్‌పై బయటకు వచ్చిన అతను మళ్లీ జైలుకు వెళ్లాలని భావించాడు. అయితే జైలుకు వెళ్లడం కోసం ఏకంగా ప్రధాని మోదీని చంపేస్తా అంటూ ఢిల్లీ పోలీసులకు బెదిరింపు కాల్ చేశాడు.
దీంతో అప్రమత్తమైన పోలీసులు నెంబర్‌ను ట్రేస్ చేసి సల్మాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. కాగా విచారణలో తనకు బెయిల్‌పై బయట ఉండడం ఇష్టం లేదని.. ఎలాగైనా జైలుకు వెళ్లాలనే ఉద్దేశంతో ఈ పని చేశానని సల్మాన్ వివరించాడు. అయితే మోదీకి సంబంధించి బెదిరింపు కాల్ కావడంతో ఇంటలిజెంట్ విభాగం మరోసారి అతన్ని విచారించనుంది. కాగా సల్మాన్ ప్రస్తుతం ఢిల్లీ పోలీసుల అదుపులోనే ఉన్నాడు.
చదవండి: ప్రియుడి మోసం.. ఇంటి ముందు యువతి రచ్చ
Comments
Please login to add a commentAdd a comment