
విజయవంతంగా ముగిసిన ఒబామా పర్యటన
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత పర్యటన దిగ్విజయంగా ముగిసింది. మంగళవారం మధ్యాహ్నం ఒబామా దంపతులు ప్రత్యేక విమానంలో సౌదీ అరేబియాకు పయనమయ్యారు. కేంద్ర మంత్రి పియూష్ గోయెల్, ఇతర ఉన్నతాధికారులు ఒబామాకు వీడ్కోలు పలికారు.
ఈ రోజు ఉదయం ఒబామా సిరి ఫోర్ట్ ఆడిటోరియంలో ప్రసంగించారు. ఈ రోజు ఆగ్రాకు వెళ్లి తాజ్మహల్ను సందర్శించాల్సివుంది. అయితే సౌదీ రాజు అబ్దుల్లా మరణించడంతో ఒబామా ఆగ్రా పర్యటనకు రద్దు చేసుకుని సౌదీకి బయల్దేరారు. రిపబ్లిక్ డే వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఒబామా మూడు రోజుల భారత్ పర్యటనలో అణు ఒప్పందం, ఇరు దేశాల మధ్య వాణిజ్య బంధం తదితర కీలక అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీతో చర్చలు జరిపారు.