
గర్భిణికి తన కాన్వాయ్ ఇస్తానన్న ఒబామా
అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ కుమార్తె చెల్సియా ఇప్పుడు నిండు గర్భిణి. ఆమె న్యూయార్క్ వెళ్లి అక్కడ బిడ్డను కనాలి. అందుకోసం అవసరమైతే ఎలాంటి ఇబ్బంది లేకుండా వెళ్లడానికి తన కాన్వాయ్ ఇస్తానని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆఫర్ చేశారు. సిరియాలో యుద్ధం మొదలైన తర్వాత కూడా ఏమాత్రం టెన్షన్ పడకుండా.. చాలా సరదాగా గడిపారాయన. బిల్ క్లింటన్ నిర్వహించే ఓ కార్యక్రమానికి హాజరైనప్పుడు ఆయనీ ఆఫర్ చేశారు.
న్యూయార్క్ నగరంలో వాహనాల్లో వెళ్లాలంటే చాలా కష్టం. అక్కడ ట్రాఫిక్ భయంకరంగా ఉంటుంది. ఇదే విషయాన్ని తాను క్లింటన్తో చర్చించానని, అప్పుడే విషయం వచ్చిందని ఒబామా అన్నారు. తన కాన్వాయ్ ఉపయోగిస్తే ఆమె సులభంగా వెళ్లగలదని చెప్పానన్నారు. న్యూయార్క్ ట్రాఫిక్ గురించి అందరూ చెప్పడమే తప్ప తాను ఎప్పుడూ పెద్దగా గమనించలేదని కూడా ఆయన అన్నారు. తాను బహుశా అక్టోబర్ ఒకటోతేదీ నాటికల్లా తాతను అవుతానని బిల్ క్లింటన్ చెబుతున్నారు.