ఒకరోజు ముందే బయల్దేరుతున్న మోడీ | Narendra Modi advances his US trip by a day | Sakshi
Sakshi News home page

ఒకరోజు ముందే బయల్దేరుతున్న మోడీ

Published Tue, Sep 23 2014 9:40 AM | Last Updated on Thu, Apr 4 2019 5:12 PM

ఒకరోజు ముందే బయల్దేరుతున్న మోడీ - Sakshi

ఒకరోజు ముందే బయల్దేరుతున్న మోడీ

ప్రధాని నరేంద్రమోడీ ఒకరోజు ముందుగానే అమెరికా బయల్దేరుతున్నారు. జర్మనీలో నైట్ ల్యాండింగ్ మీద ఆంక్షలు ఉండటంతో ప్రయాణ సౌలభ్యం కోసం ఆయన ఒకరోజు ముందే వెళ్తున్నారు. వాస్తవానికి ఈనెల 26వ తేదీన బయల్దేరాలని ప్రధాని అనుకున్నా, 25నే బయల్దేరి, ముందు అనుకున్న షెడ్యూలు కంటే 5గంటలు ముందుగా సెప్టెంబర్ 26న న్యూయార్క్ చేరుకుంటారు. ముందుగా ఆయన 27వ తేదీ ఉదయం 9/11 స్మారక స్థలం వద్దకు వెళ్తారు.

మోడీ వెళ్లే ఎయిరిండియా విమానం జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్లో ఆగి, ఆ తర్వాత అక్కడినుంచి అమెరికాకు వెళ్తుంది. రాత్రి 11గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు విమానాలు ఫ్రాంక్ఫర్ట్లో దిగడానికి గానీ, అక్కడినుంచి ఎగరడానికి గానీ వీల్లేదు. రాత్రిపూట తమకు విమానాల శబ్దం ఇబ్బందిగా ఉందని చుట్టుపక్కల ఉండే స్థానికులు ఫిర్యాదు చేయడంతో 2011 నుంచి ఈ చర్య తీసుకున్నారు.

29, 30 తేదీలలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను వైట్హౌస్లో మోడీ కలుసుకుంటారు. న్యూయార్క్లో జరిగే ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభకు హాజరై, ఆ తర్వాత వాషింగ్టన్ డీసీ చేరుకుంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement