ఒక షేక్ హ్యాండ్.. ఒక కౌగిలి! | narendra modi shakes a hand, gives a hug to barrack obama | Sakshi
Sakshi News home page

ఒక షేక్ హ్యాండ్.. ఒక కౌగిలి!

Published Sun, Jan 25 2015 10:16 AM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

ఒక షేక్ హ్యాండ్.. ఒక కౌగిలి! - Sakshi

ఒక షేక్ హ్యాండ్.. ఒక కౌగిలి!

అనుకున్న సమయం కంటే సుమారు అరగంట ముందుగానే వచ్చిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు న్యూఢిల్లీలో సాదర స్వాగతం లభించింది. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాలం విమానాశ్రయానికి చేరుకుని, ఒబామా దంపతులకు విమానం వద్దే స్వాగతం పలికారు. ఒబామా దంపతులు ఉపయోగించే ద బీస్ట్ వాహనాన్ని నేరుగా విమానం వద్దకు తీసుకురావడంతో.. దాని సమీపంలోనే స్వాగత కార్యక్రమాలు పూర్తయ్యాయి.

ముందుగా ఒబామాకు షేక్ హ్యాండ్ ఇచ్చిన నరేంద్రమోదీ.. ఆ తర్వాత ఆయనను బలంగా ఆలింగనం చేసుకున్నారు. ఆ తర్వాత మిషెల్ ఒబామా కూడా మోదీతో చేతులు కలిపారు. అనంతరం ఒబామా, మోదీ, మిషెల్ ముగ్గురూ చేతులు ఊపుతూ ఫొటోలకు పోజులిచ్చారు. కాగా, ఒబామా బస చేస్తున్న ఐటీసీ మౌర్య హోటల్ బయట పోలీసులు వివిధ ప్రాంతాల్లో మోహరించారు. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసు దళానికి చెందిన ప్రత్యేక స్నిఫర్ డాగ్ స్క్వాడ్ను రప్పించారు. సమీపంలో ఉన్న తాజ్ హోటల్ వద్ద కూడా భారీ భద్రత ఏర్పాటు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement