
తెరకెక్కనున్న ఒబామా ప్రేమకథ!
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు.. తన భార్య మిషెల్ అంటే ఎనలేని ప్రేమ ఉంది. వీరిద్దరి ప్రేమకథను తెరకెక్కించి సినిమా తీస్తే ఎలా ఉంటుంది? సరిగ్గా ఇదే ఆలోచన కొంతమందికి వచ్చింది. అంతే.. వెంటనే అమెరికా తొలి జంట ప్రేమకథను సినిమాగా తీయాలని ప్రయత్నాలు ప్రారంభించారు. సౌత్ సైడ్, యూ విల్ అనే రెండు సంస్థలు కలిసి సినిమా తీసేందుకు కథ సిద్ధం చేసుకుంటున్నాయి.
మిషెల్ యుక్తవయసులో ఉన్నప్పటి పాత్రకు టికా సంప్టర్ను ఎంచుకున్నారు. ఒబామా పాత్రకు ఎవరు సరిపోతారా అని ఇంకా వెతుకుతున్నారు. బరాక్ ఒబామాతో కలిసి మిషెల్ తొలిసారిగా చికాగోలోని ఆర్ట్ ఇన్స్టిట్యూట్లో డూ ద రైట్ థింగ్ అనే ప్రదర్శన చూసిన సంఘటనను ఈ సినిమాలో బాగా హైలైట్ చేస్తారని సమాచారం. తాను స్వయంగా రాసిన స్క్రీన్ప్లే ఆధారంగా రిచర్డ్ టేన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారు. ట్రేసి బింగ్, స్టెఫానీ అలైన్ నిర్మాతలుగా వ్యవహరిస్తారు.