
ఒబామా.. ఎస్ఎంఎస్ పంపరు.. ట్వీట్ చేయరు!
మన దేశ ప్రధాని నరేంద్రమోదీ ట్విట్టర్లో మహా యాక్టివ్గా ఉంటారు. ఏ దేశానికెళ్లినా అక్కడి ఫొటోలు గానీ, అక్కడ బ్యాక్గ్రౌండ్తో సెల్ఫీలు గానీ తీసుకుని వెంటనే ట్విట్టర్లో పెట్టేస్తారు. మరోవైపు ఆయనతో ఇటీవలే టీ పంచుకున్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మాత్రం.. అసలు ట్వీట్లు కాదుకదా.. కనీసం ఎస్ఎంఎస్లు కూడా పంపరట. అసలు ఆయనకు వీడియో రికార్డింగ్ ఉన్న స్మార్ట్ఫోన్ కూడా లేదు.
ఆయన వద్ద ఉన్నది కేవలం బ్లాక్బెర్రీ మాత్రమే. అందులో ఈమెయిళ్లు మాత్రమే పంపుతానని ఒబామా చెప్పారు. భద్రతా కారణాల వల్లే రికార్డింగ్ ఉన్న స్మార్ట్ఫోన్ వాడేందుకు తనకు అనుమతి లేదని తెలిపారు. అయితే టీనేజిలో ఉన్న తన కూతుళ్లిద్దరు మాత్రం స్మార్ట్ ఫోన్లు వాడతారని, స్నేహితులకు ఎస్ఎంఎస్లు పంపుతారని అన్నారు. అమెరికా విదేశాంగ శాఖ మాజీ మంత్రి హిల్లరీ క్లింటన్ ఈమెయిల్ ఐడీని కూడా ఎవరికీ చెప్పడానికి తనకు వీల్లేదని ఆయన చెప్పారు.