
ఒబామా భద్రత డొల్ల!
అమెరికా అధ్యక్షుడికి భద్రత అంటే.. అమ్మో అద్భుతం అనుకుంటాం. కానీ, అదంతా ఉత్త డొల్లేనని తేలిపోయింది. మూడు నేరాల్లో శిక్ష అనుభవించిన ఓ నేరస్థుడు తుపాకితో సహా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో పాటు లిఫ్టులోకి ప్రవేశించాడు. అయితే ఈ సంఘటన జిరిగింది ఇప్పుడు కాదు.. సెప్టెంబర్ 6వ తేదీన. ఇలా అధ్యక్షుడితో పాటు లిఫ్టులోకి తుపాకితో వెళ్లిన సంఘటన తీవ్ర విమర్శలకు దారితీసింది. అతడు కేవలం తుపాకితో వెళ్లడమే కాక, లిఫ్టులో తన సెల్ఫోన్ కెమెరాతో చుట్టుపక్కల పరిసరాలను కూడా షూట్ చేశాడు.
ఇంతకుముందు వైట్హౌస్ ఫెన్సింగ్ దూకి ఓ వ్యక్తి లోపలకు ప్రవేశించాడు. ఆ సంఘటన కూడా అక్కడి భద్రతా వైఫల్యాలను వెక్కిరించింది. వాస్తవానికి అధ్యక్షుడి చుట్టూ స్టేట్ ఏజెంట్లు, ఏజెన్సీ అధికారులు మాత్రమే ఆయుధాలతో ఉండటానికి అవకాశం ఉంది. ఈ సంఘటన జరిగిన నేపథ్యంలో సీక్రెట్ సర్వీస్ డైరెక్టర్ జూలియా పియర్సన్ను వివరణ కోరారు. ఎందుకిలా జరిగిందో చెప్పాలని అడిగారు.