కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్.. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో భేటీ అయ్యారు.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్.. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో భేటీ అయ్యారు. సోమవారం మధ్యాహ్నం ఒబామా బస చేసిన మౌర్యా హోటల్కు వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు.
సోనియా, మన్మోహన్ వెంట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు. సోనియా బృందం మర్యాదపూర్వకంగా ఒబామాను కలిసినట్టు ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. మన్మోహన్ ప్రధానిగా ఉన్న సయమంలో 2010లో ఒబామా తొలిసారి భారత పర్యటనకు వచ్చారు.