![ఫేస్‌బుక్‌లో చేరిన ఒబామా](/styles/webp/s3/article_images/2017/09/3/51447125802_625x300.jpg.webp?itok=IpGJcChU)
ఫేస్‌బుక్‌లో చేరిన ఒబామా
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఫేస్‌బుక్‌లో చేరారు. తన సొంత దేశంలోనే ఈ సోషల్ మీడియా ప్రారంభమైనా ఇంతకాలం అందులో లేని ఒబామా, తొలిసారి అందులో చేరి.. వాతావరణ మార్పుల గురించి వీడియోను తొలి పోస్టుగా పెట్టారు. దాన్ని ఇప్పటివరకు ఏకంగా 15.25 లక్షల మంది చూశారు. వైట్ హౌస్ బ్యాక్ యార్డులో నడుస్తూ మన అందమైన గ్రహాన్ని రక్షించాలంటూ చెప్పిన వైనాన్ని వీడియో తీయించి.. దాన్ని పోస్ట్ చేశారు. తన తర్వాత వచ్చే అధ్యక్షులు కూడా ఇలాగే పచ్చిక బయళ్లలో నడవాలని కోరుకుంటున్నానని, వాళ్లతో పాటు అమెరికన్లందరూ కూడా మంచి నేషనల్ పార్కులు, అద్భుతమైన ప్రకృతి సౌందర్యం, కొండలు, సముద్రాలు అన్నింటినీ ఎంజాయ్ చెయ్యాలనే భావిస్తున్నట్లు అందులో చెప్పారు.
ప్రతి నలుగురు పెద్దవాళ్లలో ముగ్గురు ఫేస్‌బుక్‌లో ఉంటున్నారని, అలాంటప్పుడు అందరితో భావాలు పంచుకోడానికి ఇదే మంచి సాధనమని భావించి చేరానని అన్నారు. బరాక్ ఒబామా పేరుతో ఉన్న ఫేస్‌బుక్ అకౌంటుకు 4.5 కోట్ల మంది ఫాలోవర్లున్నారు. ఈ అకౌంటును ఆర్గనైజింగ్ ఫర్ యాక్షన్ అనే సంస్థ నిర్వహిస్తుంది. మే నెలలోనే ట్విట్టర్‌లో చేరిన ఒబామా, తన పదవీకాలం ముగుస్తున్న సమయంలో సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా మారారు.